Wednesday 22 March 2023

*2 To 9 Year's Kid's Health Information* *చిన్న_పిల్లలులో _ఆరోగ్య సమస్యలు_ఆయుర్వేదం_సలహాలు

*2 To 9 Year's Kid's Health Information* *చిన్న_పిల్లలులో _ఆరోగ్య సమస్యలు_ఆయుర్వేదం_సలహాలు అవగాహనా కోసం_నవీన్_నడిమింటి_సలహాలు* 

 
చిన్నపిల్లలున్న ఇల్లు! అసలే పిల్లలు! ఏం తినాలో,  ఏం తినకూడదో వారికేం తెలియదు! 24 గంటలూ వారినే కనిపెట్టుకుని వుండాలంటే కొద్దిగా కష్టమే! అయినా కళ్ళల్లో వత్తు లేసుకుని కాపలా కాస్తూనే వున్నప్పటికీ పిల్లలు ఏదో తినేస్తుంటారు. వాంతులు పట్టుకు న్నాయి. మరిప్పుడేం చెయ్యాలి? ఆందో ళన చెందన అవసరంలేదు.

✍ కొద్దిగా జీలకర్ర తీసుకుని బాగా శుభ్రపరిచి, దోరగా వేయించాలి. ఆ వేగిన జీలకర్రను మెత్తటి వుండగా చేసుకుని ఓసీసాలో భద్రపరచు కోవాలి.

👉🏿మాదీఫల రసాయనం సీసాను తెచ్చుకుని ఓ చెంచా జీలకర్ర పొడుంలో మాదీఫల రసాయనం కొద్దిగా సేవించాలి.

👉🏿 వాంతులే కాదు వామ్టింగ్‌ సెన్సేషన్‌ కూడా వుండమన్నా వుండదు. పత్యం చెయ్య వల్సిన అవసరం లేదు.

*1.- #విరేచనాలుకు :*
జిగట, మామూలు, నెత్తురు, చీము వంటి విరేచనాలు బారిన మనం పడినప్పుడు ఆ విరేచనాలు ప్రాథమిక దశలోనే వున్నప్పుడు కొద్దిపాటి జాగ్రత్త తీసుకుంటే విరేచనాల బారి నుంచి రక్షణ పొందవచ్చు. ఎలాగంటే ఓ రెండు చింతగింజల్నీ, ఓ చెంచా గసగసాలనూ తీసుకుని ఈ రెంటినీ కలిపి కొద్దిగా నీటిని జోడించి మెత్తగా నూరాలి. అప్పుడు వచ్చే రసాన్ని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చొప్పున ఓ నాలుగైదు రోజులపాటు తాగాలి. అవసరాన్ని బట్టి వ్యాధి తగ్గేంత వరకూ మందు తాగాలి. విరేచనాలు పూర్తిగా తగ్గిపోయేంత వరకూ ఒక్క మజ్జిగ అన్నం మాత్రమే తినాలి.

*2.-#దీర్ఘకాలిక_జ్వరాలకు :*

ఎప్పుడు చూసినా లో ఫీవర్‌ వుంటుంటే దీర్ఘజ్వరం వున్నట్లుగా భావిస్తాం! దీర్ఘజ్వరం వున్నవాళ్లు ‘చల్ల మిరియం’ విధానం వినియోగిస్తే సత్వర ఫలితం వుంటుంది. రోజుకో మిరియం చొప్పున మింగిస్తూ, మిరియపు గింజను మజ్జిగలో నానబెట్టి, మెత్తగా నూరి కడుపులోకి తీసుకుని కొద్దిగా మజ్జిగ తాగుతుంటే దీర్ఘజ్వరాలు తగ్గిపోతాయి. ఈ విధంగా 41 రోజులపాటు చల్లమిరియం వాడవల్సివుంటుంది.

*3.-#ఫ్రీగా_విరోచనం_కావడానికి:*

విరేచనం బిగపట్టి ఇబ్బందిగా వుంటే చిన్న చిట్కాతో ఈ ఇబ్బందిని తొలగించవచ్చు. కొద్దిపాటి సునాముఖి ఆకును తీసుకుని దీనిని బాగా గుండగా చేసి భద్రపరచాలి. అనంతరం పంచదార పాకం పట్టి అందులో సునాముఖి ఆకు గుండను వేసి ఆరబెట్టి చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇది సుమారు రెండు మూడు నెలలపాటు నిల్వ వుంటుంది. అన్ని వయసులవారు నిరభ్యంతరంగా వాడదగిన ఈ మందు విరోచనం ఫ్రీగా అవడానికి సహకరిస్తుంది.

*4.- #దగ్గు_రొంపకు :*

దగ్గు, రొంప విపరీతంగా వున్నప్పుడు చిన్న చిన్న చిట్కాలను ప్రయో గిస్తే ఫలితం సంతృప్తికరంగా వుంటుంది.

✍ తులసి ఆకుల రసాన్ని రోజుకు రెండు మూడు సార్లు రెండు, మూడు చుక్కలు ఇస్తే పిల్లలకు దగ్గు, రొంప తగ్గుతాయి.

✍ తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.

✍ ఓ నాలుగైదు తమలపాకులు ముందు గా వెచ్చచేసి, ఆపై నూరి రసం తీసి, దానిలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.

✍ ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ వుంచాలి. దీనిని ఛాతీకి, గొంతుకకూ రాస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి.

✍ ఒక గుప్పెడు జామాయిలు (యూకలిప్టస్‌ ) ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లల్లో పోసి అవి మరిగి ఒక గ్లాసు అయ్యేదాకా మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి అందులో కొంచెం పంచదార కలిపి, రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఈ నవీన్ రోయ్ సలహాలు పెద్దలకు మంచిది.
For more information 
https://m.facebook.com/story.php?story_fbid=687908856469281&id=100057505178618&mibextid=Nif5oz
*5.- #సూది_ద్వారా_మందులు_ఎప్పుడు_వాడాలి?*
1.రోగికి అవసరమైన మందులు సూదిమందు రూపంలో మాత్రమే లభించినప్పుడు.
2. రోగి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు
3. రోగి నోటి ద్వారా మందులు తీసుకోలేనప్పుడు
4. రోగికి విపరీతంగా వాంతులు అవుతున్నప్పుడు
5. కొన్ని వ్యాధి నిరోధక టీకా మందులు వేయునపుడు.

*6.-#సూది_ద్వారా_మందులు_ఎప్పుడు_వాడరాదు?*
1. చిన్న చిన్న జబ్బులకు
2. సాధారణంగా వచ్చే దగ్గు, జలుబుకు
3.సమాజంలో పోలియో వ్యాధి ఎక్కువగా ఉన్నప్పుడు

*6.-#సూది_ద్వారా_ఏ_మందులు_ఎక్కువగా_ఇవ్వరాదు?*
1. సాధారణంగా వాడే విటమిను మందులు
2. కాల్షియం మందు
3. రక్తహీనతకు వాడే బి12, లివర్ ఎక్స్‌ట్రాక్ట్, ఇన్‌ఫెర్రాన్ లాంటివి.
విటమిను మందులు నోటి ద్వారా తీసుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే విటమినులు, మందుల రూపంలోకన్నా ఆహారం ద్వారా పొందుట అన్ని విధాలా క్షేమదాయకం.రక్తహీనతకు ఇంజెక్షనులకన్నా నోటిద్వారా తీసుకునే ఫెర్రసు సల్ఫేట్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు మంచివి.
*7.- #సూదులవల్ల_జరిగే_ప్రమాదాలు*
1. బాగా శుభంచేయని సూదులు, సిరంజిలవల్ల ఇంజెక్షను వేసినచోట చీము గడ్డ రావచ్చు.
2. అపరిశుభ్రమైన సూదుల ద్వారా ఎయిడ్స్, హెపటైటిస్ ‘బి’ లాంటి భయంకర వ్యాధులు రావచ్చు.
3. సూదుల ద్వారా అప్పుడప్పుడు నరాలకు, రక్తనాళాలకు గాయాలు కావచ్చు.
4. సూదిమందు వికటించి ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

*8.- #సూదులు_జాగ్రత్తలు*
1. సూదిమందు వేయించుకొనేముందు, ఆ మందు పడుతుందా లేదా పరీక్ష చేయించుకొని వేయించుకోండి.
2. శాస్ర్తియంగా శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త చేతే సూదులు వేయించుకోండి.
3. డాక్టర్లు వద్దంటే ఇంజెక్షను వేయమని ఒత్తిడి చేయకండి.
4. సూదివేయని డాక్టరు అసమర్థుడు అనుకోకండి.
5. బాగా శుభ్రపరచిన సూదులు - సిరంజిలతోనే సూదులు వేయించుకోండి.
*ధన్యవాదములు 🙏🏻*
మీ Naveen Nadiminti,
ఫోన్ -9703706660
   
This group creat  on medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/HelathTipsbyNaveen

No comments:

Post a Comment