Saturday, 11 March 2023

APPETITE / ఆకలి

*APPETITE / ఆకలి :* 
                  ➖➖➖✍️


*_నోరూరించే వంటకాలను చూసినా ఆకలి వేయడం లేదా? అయితే మీరు ఈ చిట్కాలు పాటించాల్సిందే..!_*

*_అపటైట్ అంటే తెలుసా మీకు. ఆకలి బాగా వేయడం. మనిషి బతికి బట్టకట్టాలంటే ఖచ్చితంగా తిండి కావాలి. తిండి లేకుంటే బతకడం కష్టం. ఓ మూడు నాలుగు రోజులు తిండి లేకుండా ఉండొచ్చు కానీ.. ఇక ఆ మూడు నాలుగు రోజులు దాటింది అంటే బతకలేం. శరీరంలో అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. శరీరంలో శక్తి ఉండదు. దీంతో మనిషి జీవచ్చవంలా మారిపోతాడు. అందుకే.. మనిషికి తిండి అనేది చాలా అవసరం. రోజుకు మూడు సార్లు తిండి తినాల్సిందే. లేకపోతే మనిషి పనిచేయలేడు. అందుకే.. ఆహారం మన జీవితంలో భాగం అయిపోయింది._ 👇🏼*

               ●●●▪️▪️▪️

*_అయితే.. ఆకలి బాగా వేస్తేనే రోజు పుష్టిగా తినగలుగుతాం. కొందరికి అస్సలు ఆకలే వేయదు. ఇంకొందరికి ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఎక్కువగా ఆకలి వేస్తే సమస్య లేదు కానీ.. ఆకలి అస్సలు వేయకపోతేనే అసలు సమస్య. ఆకలి కాకపోతే తిండి ఎలా తింటాం. తినలేం. అప్పుడు లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే.. ఖచ్చితంగా ఆహారం తీసుకోవాల్సిందే. మరి.. ఆకలి పెరగాలంటే ఏం చేయాలి? ఆకలి బాగా వేయాలంటే ఏం చేయాలి? మన ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఆకలి వద్దన్నా వేస్తుంది. ఫుల్లుగా మెక్కేస్తారు._*

*_" APPETITE : ఆకలి బాగా వేయాలంటే ఏం తినాలి "?_*

*_ఆకలి బాగా వేయాలంటే మన వంటింట్లోనే ఉండే కొన్ని పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. నల్ల మిరియాలు, అల్లం, సైంధవ లవణం, తేనె, నిమ్మరసం, యాలకులు, వాము… ఇవన్నీ రోజువారి జీవితంలో వాడుతూ ఉండాలి. నల్లమిరియాలను పొడిగా చేసుకొని అందులో ఇంత బెల్లం పొడి వేసుకొని క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు తింటే.. ఆకలి వద్దన్నా వేస్తుంది. ఎందుకంటే.. నల్ల మిరియాలలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. అవి రుచికళికలపై ప్రభావితం చూపిస్తాయి. అలాగే.. జీర్ణశక్తిని కూడా పెంచి.. ఆకలి అయ్యేలా మిరియాలు చేస్తాయి. అలాగే.. మిరియాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల.. జీర్ణ సమస్యలతో పాటు గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి._*

*_అలాగే.. అల్లాన్ని కూడా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఎలాగూ అల్లాన్ని కూరల్లో వాడుతుంటారు. అల్లాన్ని ఇంకా వేరే పద్ధతుల్లో కూడా తీసుకోవచ్చు. అల్లం టీగా కూడా తీసుకోవచ్చు. అల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణ సమస్యలను తగ్గించి.. ఆకలిని పెంచుతాయి. అలాగే.. మీకు సైంధవ లవణం తెలుసు కదా. దాన్ని కొంచెం తీసుకొని.. అందులో కొంచెం అల్లం రసం కలపండి. దాన్ని రోజూ రెండు సార్లు.. అన్నం తినడానికి ముందు వాడండి. అలా కొన్ని రోజుల పాటు వాడితే.. ఆకలి బాగా పెరుగుతుంది._*

*_ఉసిరికాయ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ఉసిరికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల.. జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు.. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే.. క్రమం తప్పకుండా.. ఉసిరికాయ రసం, తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే.. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మూడింటి మిశ్రమాన్ని కాసిన్ని నీళ్లలో కలుపుకొని తాగాలి. రోజూ ఉదయమే పరిగడుపున తీసుకోవాలి. అలా చేస్తేనే ఆకలి పెరుగుతుంది._*

*_మీకు యాలకులను తినే అలవాటు ఉంటే.. రోజూ ఉదయం, సాయంత్రం అన్నానికి ముందు రెండుమూడు యాలకులను ఊరికే అలా నమిలి మింగేయండి. యాలకుల టీ తాగినా కూడా ఓకే. అలాగే.. వామును కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. వామును నిమ్మరసంలో కలుపుకొని కూడా తాగొచ్చు. లేదంటే.. కొంచెం వామును తీసుకొని అలాగే నమిలి మింగేసినా ఆకలి పెరుగుతుంది._*

No comments:

Post a Comment