🍁ఒంట్లో వేడి చేసిందంటే🍁
🌴వేసవి కాలం వచ్చేసింది.వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం బోలెడన్ని పానీయాలు తాగేస్తుంటాం. సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్లు, షరబత్లు ఇలా రోడ్డు మీద కనబడే ప్రతీది తాగాలనిపిస్తుంది.
👉కానీ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఇంటి దగ్గరే మనకు మంచి పానీయం ఉంది. అదే సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దాన్ని మరిపోయారు.
🌴సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
🌴అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి.
👉పానీయం తయారీ
🌴గుప్పెడు సబ్జా గింజలను తీసుకొని వాటిలో చిన్న చిన్న రాళ్లు, బెడ్లు ఉంటే ఏరేయాలి. మంచి నీళ్లతో వాటిని శుభ్రంచేసి ఓ కప్పులో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. నీటిలో నానిన నల్లని గింజలు కాస్త జెల్లీలా మారిపోతాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకుని తాగొచ్చు, లేదంటే పంచదార కలిపిన నీటిలో వేసుకుని తీసుకోవచ్చు.
🌴సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు.
🌴 రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది.
🌴జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయిబరువు తగ్గడానికి మంచి చిట్కా
🌴 ఆహారం తీసుకునే ముందు గ్లాసుడు సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కేలరీలు కూడా చాలా తక్కువే.🍁
No comments:
Post a Comment