🟡🟢⚪🟡🟢⚪🟡🟢⚪🟡🟢
*_🟢 మజ్జిగకి సంస్కృతంలో మూడు పేర్లున్నాయి.._*
*_1.తక్రం :_*
*_2.మధితం : 3.ఉదశ్విత్తు :_*
*_🔸 తక్రం: నాలుగోవంతు మాత్రం నీరుపోసి తయారు చేసేది తక్రం._*
*_🔸 మధితం: అసలు నీరు పోయకుండా చిలికినది మధితం. ఇది రుచిగా ఉంటుంది, కానీఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు._*
*_🔸 ఉదశ్విత్తు: సగం నీళ్లు పోసి తయారుచేసేది ఉదశ్విత్తు._*
*_ఈ మూడింటిలో తక్రం ఆరోగ్యానికి చాలా ప్రశస్తం._*
*_🔵 మజ్జిగ మహా పానీయం :_*
*_1.మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ, యోగరత్నాకరం లో ఉన్నది._*
*_2. దేవలోకంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడుసృష్టించాడట._*
*_3. వేసవి కాలంలో మనం మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి._*
*_4.తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు._*
*_5. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది. అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు._*
*_6. చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది. అందుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది._*
*_7.వయసు పెరుగు తున్నకొద్దీ మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి._*
*_🟣 వేసవి కోసం ప్రత్యేకం కూర్చిక పానీయం :_*
*_1. ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండు గ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని కూర్చిక అంటారు._*
*_2. ఇందులో పంచదార, ఉప్పు బదులుగా ఈ క్రింది వాటిని కలపండి._*
*_3. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి._*
*_4. కూర్చికను తాగినప్పుడల్లా, అందులో ఈ మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి త్రాగితే వడదెబ్బ కొట్టదు._*
*_5. పేగులకు బలాన్నిస్తుంది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది._*
*_6. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది. 7. ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది. కాబట్టి, ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది._*
*_🔹ఎండలోకి వెళ్లబోయే ముందు మజ్జిగను ఇలా కూడా తయారు చేసుకొని త్రాగవచ్చు._*
*_1. చక్కగా చిలికిన మజ్జిగ ఒక గ్లాసునిండా తీసుకొని అందులో ఒక నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు (సైంధవ లవణం), పంచదార, చిటికెడంత తినే సోడాఉప్పు కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తే వడదెబ్బకొట్టకుండా ఉంటుంది._*
*_2.ఎండ మరీ ఎక్కువ వుంటే తిరిగి వచ్చిన తరువాత ఇంకోసారి త్రాగవచ్చు._*
*_3. ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసానిండా దీన్ని తయారు చేసుకొని వెంట తిసుకెళ్లి, మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు._*
*_🙏🏼 సర్వేజనాస్సుఖినో భవంతు 🙏🏼_*
No comments:
Post a Comment