Thursday, 9 March 2023

పైనాపిల్

★ పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది.
★ పైనాపిల్ జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది.
★ రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది.
★ ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.

★ పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.
★ పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి
★ జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి పైనాపిల్ రసం ఇవ్వడం ఎంతో మంచిది. పైనాపిల్ పండును ఆహారంగా తీసుకోవడం
అందరికీ తెలిసిందే. కానీ అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఎక్కువగా ఉంది.

★ పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు
ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
★ పైనాపిల్‌లోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్‌ని ఉప శమనం చేస్తుంది.
★ పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.

★ పైనాపిల్ రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.

★ పైనాపిల్‌లో ఉన్న ఫైబర్ కంటెంట్ అనేది మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది.
★ పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల.. కంటి సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కంటిచూపు బాగుండటానికి ఇది ఉపయోగపడుతుంది.
★ పైనాపిల్‌లో అమినో యాసిడ్ ట్రైపోటాన్ రిచ్‌గా ఉండటం వల్ల హార్మోన్‌ల ఆరోగ్యానికి మంచిది. న్యూరోలాజిక్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి పైనాపిల్‌లో ఉండే పోషకాలు ఉపయోగపడతాయి. వీటి ద్వారా పాజిటివ్, మూడ్ హార్మోన్‌లకు శక్తి అందుతుంది

No comments:

Post a Comment