*తొందరగా సన్నబడాలంటే ఈ ఐదు రకాల జ్యూస్ ప్రయత్నించండి.*
*ఆ జ్యూస్ లేంటో ఇప్పుడు చూద్దాం...*
*గోధుమగడ్డి జ్యూస్...*
గోధుమగడ్డి జ్యూస్ ను పొద్దున్నే కాఫీ టీ బదులుగా తాగటం వల్ల తొందరగా సన్నబడతారు.దీనికి కావాల్సిన గోధుమగడ్డిని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. ఇందులోఐరన్, కాల్షియం, మెగ్నిషియం, ఫైటో న్యూట్రియెంట్లు,అమైనోయాసిడ్లు, విటమిన్‌లు ఎ, సి, ఇ, కె, బి కాంప్లెక్స్, క్లోరోఫిల్, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.గోధుమగడ్డి జ్యూస్‌ను తరుచూ తీసుకోవడం వల్ల, శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి,ఈజీగా అధికబరువు తగ్గిస్తుంది
*బీట్రూట్,క్యారెట్ జ్యూస్...*
రోజు ఉదయాన్నే టిఫిన్ సమయంలో ఒక బీట్రూట్ మరియు రెండు క్యారెట్లు కలిపి జ్యుస్ లా తయారు చేసుకోవాలి. ఇందులోని విటమిన్ ఏ, సి, ఫైబర్ పుష్కలంగా లభించి,అధిక బరువును తొందరగా తగ్గించడానికి ఉపయోగపడతాయి.
*కరివేపాకు జ్యూస్...*
దీనికోసం గుప్పెడు కరివేపాకు తీసుకొని, ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించుకోవాలి. ఇందులో ఒక స్పూన్ తేనె,ఒక. స్ఫూన్ నిమ్మరసం కలిపి తాగడం వల్ల తొందరగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. కరివేపాకులో పోలిక్ యాసిడ్ మరియు ఐరన్ లభిస్తాయి.ఇందులోని లిపిడ్లు,అమైనో ఆమ్లాలు పొట్ట కొవ్వును తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.
*బొప్పాయి జ్యూస్...*
టిఫిన్ కి బదులుగా బొప్పాయి జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులోని పైబర్ పొట్టలోని కొవ్వును కరిగించడం లో సహాయ పడుతుంది. అంతే కాక ఇందులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
*పుచ్చకాయ జ్యూస్...*
పుచ్చకాయ జ్యూస్ ని తరుచూ తీసుకోవడం వల్ల, ఇందులోని వాటర్ కంటెంట్ తొందరగా పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. దీనితో తినాలానే కోరిక తగ్గి, తొందరగా బరువు తగ్గవచ్చు.
No comments:
Post a Comment