🔸దురదలు దద్దుర్లు
+++++++++++++++++++++
చర్మంపైన దురదలు, దద్దుర్లు పుట్టి బాధపడేవారు తమ సమస్యను శీతపిత్తసమస్యఅనితెలుసుకోవాలి. అలాంటి వారంతా రోజూ గోరువెచ్చని నువ్వులనూనెతో ఒళ్ళంతా సున్నితంగా రుద్దుకొని గంట తరువాత భరించగలిగినంత వేడినీటితో స్నానం చేస్తుండాలి.
10 గ్రా ఆవునెయ్యి వేడిచేసి దించి అందులో 3 గ్రా మిరియాలపొడి వేసి మూతపెట్టి అన్నం తినేతప్పుడు మొద ట ఈ నెయ్యి కలుపుకొని తినాలి పొద్దు మాపు
దాంతోపాటు గోరువెచ్చని త్రిఫల కషాయం ఒకకప్పు తయారు చేసుకొని అందులో ఒకచెంచా తేనెకలిపినిద్రించేముందు తాగాలి.
అలాగే ఒకచెంచా అల్లంరసం, పదిగ్రాములు పాతబెల్లం కలిపిదంచి ముద్దచేసి ఉదయం, సాయంత్రం చప్పరించి తినాలి. ఇలాచేస్తుంటే దురదలు, దద్దుర్లు, మంటలు మటుమాయం.
🔹ఆనెలకు - అద్భుతయోగం
ఆముదం పావుచెంచా, జిల్లేడుపాలు పదిచుక్కలు కలిపి బాగా రంగరించి ఆమిశ్రమాన్ని ఆనెల పైన రాత్రి లేపనంచేసి ఉదయం కడుగుతుంటే ఆనెలు కరిగిపోయి తిరిగి మరలా పుట్టవు.
🔸పెదవి పుండ్లతగ్గడానికి యోగం
జాజికాయను మెత్తగా దంచి పలుచని నూలుబట్ట లో వస్త్రఘాళితంచేసి నిలువ తో వుంచుకోండి. రోజూ రాత్రి నిద్రించేముందు పావుచెంచా జాజికాయ పొడి తీసుకొని అందులో మూడునాలుగు చిటికెలు మంచిపసుపుపొడి అరచెంచా నెయ్యి కలిపి మెత్తగా రంగరించి పెదవులకు రాసుకోండి. ఉదయం స్నానం చేసేటప్పుడు శుభ్రంచేసుకోండి. ఇలా చేస్తుంటే పెదవులపై పుండ్లురావడం, నెత్తురు కారడం, పెదవులు వాచిపోవడం, మొదలైన సమస్యలు హరించిపోయి పైన ఆధరసౌందర్యం అందివస్తుంది.ముఖము మీద మచ్చలకు రాసిన తగ్గును
⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓
No comments:
Post a Comment