Sunday 5 March 2023

కర్పూరం ఔషధ గుణాలు

*🧊కర్పూరం ఔషధ గుణాలు🧊*
 

దేవుని పూజలో ధూపదీపాల్లాగే, కర్పూరంతో ఇచ్చే మంగళ హారతికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ధూపం వల్ల ఏయే ప్రయోజనాలు ఉన్నాయో హారతి వల్ల కూడా ఆయా ప్రయోజనాలు నెరవేరుతాయి.

సాధారణంగా దేవునికి కర్పూరంతో హారతి ఇస్తారు. ఇలా కర్పూరంతో హారతి ఇవ్వడమే మంచిది, శ్రేష్టం.

కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది కర్పూర చెట్ల కాండానికి గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూర వృక్షాలు మన దేశంలో చాలా తక్కువ. జపాన్, చైనా దేశాల్లో ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. 

1. కర్పూరం సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది.

2. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్నిస్వచ్చంగా మారుస్తుంది.

3. కళ్ళకు మంచిది.

4. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.

5. ఒక శుభ్రమైన వస్త్రంలో కొన్ని బియ్యపుగింజలు, కొద్దిగా కర్పూరం వేసి దాన్ని చిన్న ముడిలా చుట్టి, ఆ వాసన పీల్చడము వలన జలుబు తగ్గుతుంది, పూడుకు పోయిన ముక్కు యధాస్థితికి వస్తుంది.

6. కర్పూరం అతి దాహం, ముఖ శోషలాంటి అనారోగ్యాలను నివారిస్తుంది.

7. మంటలు, దురదలు లాంటి చర్మవ్యాధులకు బాగా పనిచేస్తుంది.

8. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.

9. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.

10. గొంతు పూడుకుపోవడం, స్వరపేటికలో ఉండే దోషాలను నివారిస్తుంది.

11. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.

12. గాలిని శుభ్రం చేసే గుణం ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు, కొన్ని రకాల గుండె సమస్యలకు నివారిణిగా కూడా ఉపకరిస్తుంది.

13. గాలి తాకిడికే కరిగిపోయే గుణం ఉండడం వల్ల, కర్పూరాన్ని కాల్చకుండానే దోమల్ని నివారించవచ్చు.

14. ఉదయం, సాయంత్రం గదిలో ఇరువైపులా రెండు బిళ్లలు ఉంచేస్తే చాలు. ముఖ్యంగా దోమలు, కర్పూరం బిళ్లలు పెడితే అవి పారిపోతాయి.

15. ఓ కప్పు నీళ్లల్లో కర్పూరం బిళ్లలు వే సి పడక గదిలో పెట్టేస్తే ఆ వాసనకు నిద్రాభంగం కలిగించే సూక్ష్మజీవులన్నీ లేకుండా పోతాయి. 

ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు,
సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కర్పూరం ఒక చక్కటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది కర్పూరం.

*🧊కర్పూరంలో అనేక రకాలు ఉన్నాయి.*

1. హిమకర్పూరం,
2. వర్ణ కర్పూరం,
3. శంకరా వాస కర్పూరం,
4. చీనా కర్పూరం,
5. పచ్చ కర్పూరం మొదలైనవి ముఖ్యమైనవి.

ఇన్ని ఔషధ గుణాలు కలది, అద్భుతమైంది కనుకనే కర్పూరంతో మంగళ హారతి ఇస్తారు.

💠💠

No comments:

Post a Comment