*#రకరకాల_కారణాల_వల్ల_ఈ_మధ్య_ఎక్కువ_మంది_డిప్రెషన్_కు_గురవుతున్నారు_కదా_ఇటువంటి_వారు_త్వరగా_ఎలా బయటికి రావాలి*
*#ఒత్తిడి_నివారణకు_ఆయుర్వేదం_లో Naveen Nadiminti #సలహాలు_అవగాహనా_కోసం_చిట్కాలివే..*
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడి, డిప్రెషన్ (మానసిక ఆందోళన)తో మెజారిటీ ప్రజలు బాధపడుతున్నారు. కొన్ని ఆయుర్వేద చిట్కలతో ఒత్తిడి సమస్యను నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. భారత ఆయుర్వేదానికి గణనీయమైన చరిత్ర ఉంది. గత 2వేల సంవత్సరాలుగా అనేక జబ్బులకు ఆయుర్వేద వైద్యం దివ్యౌషదంగా పని చేసింది. అయితే ఇటీవల కాలంలో జబ్బులు నయం కావడానికి ఆయుర్వేద వైద్యం చాలా సమయం తీసుకుంటుందని కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అపోహలకు దీటుగా ఆయుర్వేద నిపుణులు చక్కటి విశ్లేషణతో దీటైన కౌంటర్ ఇస్తున్నారు.
ఒత్తిడిని ఎదుర్కొనే ఆయుర్వేద వైద్యంపై విశ్లేషణ:
ఆయుర్వేద వైద్యంలో ఒత్తిడి సమస్యకు నాడీ వ్యవస్థ మూలమని భావిస్తారు. మానసిక సమస్యలను దోషా అనే ప్రక్రియ నియంత్రిస్తుంది. కాగా నరాల వ్యవస్థను బలంగా ఉంచే వాత ప్రక్రియ ద్వారా శారీరక, మానసిక సమస్యలను అధిగమించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. తీవ్ర ఒత్తిడి సమస్యను నివారించేందుకు పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పరిష్కార మార్గంగా నిపుణులు చెబుతున్నారు.
https://fb.watch/j7dVGOZdTU/
ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాచీన కాలం నుండి హెడ్ మసాజ్ ప్రక్రియ చాలా ప్రాచుర్యం పొందింది. అయితే తల, మెడ ప్రాంతాలను మసాజ్ చేయడం ద్వారా ప్రశాంతమైన నిద్రతో పాటు రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో పాటు చర్మం, జుట్టు సమస్యను నివారిస్తుంది. కాగా మసాజ్ చేయుటకు నారాయణ తైలా, బ్రాహ్మి నూనె వంటి సహజ నూనెలను ఉపయోగిస్తారు.పూర్తి వివరాలు కు
https://m.facebook.com/story.php?story_fbid=573971151196386&id=100057505178618
#డిప్రెషన్_లో_ఉన్నవారు_ఆ_డిప్రెషన్_నుండి_ఎలా_బయటపడాలి?
1. ఒక రోజు సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించ గలదని గుర్తించుకో !
4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
5. కక్ష కన్నా క్షమ గొప్పది
క్షమ కన్నా *జీవుల పట్ల కరుణ* గొప్పదని అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి. రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో !
9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో !
11. *మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో* *శాకాహారిగా* ఉండడం *ధ్యానం* చేయడం నేర్చుకో!
12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
15. *టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో* !
16. *పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో* !
17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !
18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో !
19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం చూడడం నేర్చుకో !
20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
22. నీ ఆందోళన వలన సమస్యలు త్వందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !
23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
24. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.
.శ్వాస మీద ధ్యాస తో ధ్యానం చెయ్యి.
25. సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన శారీరక , మానసిక సమస్యలు రెండూ వస్తాయి. శారీరకంగా మెడ నొప్పి, తలనొప్పి, ఊబకాయం, వినికిడి లోపం మొదలైనవి వస్తాయి. మానసికంగా నిద్ర లేమి, అంతర్జాల వ్యసనం, ఆందోళన, దిగులు, పిల్లల్లో మాట/భాష లోపాలు, ఏకాగ్రత కుదరకపోవడం, పని వాయిదా, అలసట ఇంకా చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. సెల్ ఫోన్ వాడకం సెల్ ఫోన్ లో డిజిటల్ వెల్ బీయింగ్ ద్వారా మనం ఎంత సేపు వాడుతున్నాం అన్నది చూసుకుని సెల్ ఫోన్ మొత్తం వాడకం రోజుకి ఒకటి రెండు గంటలు మించకుండా చూసుకోవాలి.
సమతుల్య ఆహారం ద్వారా ఒత్తిడి నివారణ
మనిషికి ఏం కావాలో శరీరం సిగ్నల్స్ ఇస్తుంది. అలాగే శరీరం కోరుకున్న సమయంలో ఆహారం తీసుకోవడం ద్వారా హార్మోన్ల సమస్యను నివారించవచ్చని తెలిపారు. కాగా విటమిన్ సీ, బీ, ఒమెగా, మాగ్నిషియమ్ కలిగిన ఆహారాలను తీసుకోవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఒత్తిడి సమస్యను నివారించేందుకు క్రమం తప్పకుండా యోగాను సాధన చేయాలని ఆయుర్వేద నిపుణులు నవీన్ రోయ్ సూచిస్తున్నారు
ధన్యవాదములు 🙏
మీ Naveen Nadiminti
*ఫోన్ -9703706660,*
No comments:
Post a Comment