Tuesday 7 March 2023

కొత్తి మీరతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను ఒక జాబితాగా రాస్తే అది బారెడంత పొడవు

కొత్తి మీరతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను ఒక జాబితాగా రాస్తే అది బారెడంత పొడవు. కొత్తిమీరతోమ నకు సమకూరే లాభాల్లో ఇవి కొన్ని మాత్రమే...

• కొత్తిమీరలో విటమిన్-ఏ పుష్కలంగా ఉండటం వల్ల అది కంటి చూపును మెరుగుపరుస్తుంది. మాక్యులార్ డిజనరేషన్ వంటి కంటివ్యాధులను నివారిస్తుంది.

• ఇందులో విటమిన్-బి కాంప్లెక్స్కు చెందిన బి1, బి2, బి3, బి5, బి6 వంటి అనేక విటమిన్లు కూడా ఎక్కువే. ఇవన్నీ మనకు మంచి వ్యాధినిరోధక శక్తిని ఇస్తాయి.

• విటమిన్-సి కూడా కొత్తిమీరలో పుష్కలంగా ఉండటం వల్ల అది శక్తిమంతమైన యాంటీఆక్సి డెంట్ గా పనిచేసి ఎన్నో రకాల క్యాన్సర్లను నివా రిస్తుంది.

• కొత్తిమీరలో విటమిన్-ఇ పాళ్లు కూడా ఎక్కువే. మేనికి మంచి నిగారింపును ఇవ్వడానికి, చర్మంపై ముడతలను తొలగించడానికి ఇది బాగా తోడ్పడు తుంది. దీర్ఘకాలం యౌవనంగా ఉంచడానికి కొత్తి మీర ఎంతగానో సహాయం చేస్తుంది.

• కొత్తిమీరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీ నతతో బాధపడేవారు... తాము తినే అన్ని పదా ర్థాలను కొత్తిమీరతో గార్నిష్ చేస్తే... రుచికరమైన రీతిలో తమ అనీమియా సమస్యను తగ్గించుకో వచ్చు. • ఇందులోని పొటాషియమ్ రక్తపోటును నివారి

స్తుంది. తద్వారా గుండెజబ్బులను అరికడు తుంది.

• కొత్తిమీర కిడ్నీ సమస్యలను సమర్థంగా నివారి స్తుంది.

• మెగ్నీషియమ్, జింక్ వంటి ఖనిజాలు కొత్తిమీ రలో చాలా ఎక్కువే. అందుకే జుట్టు మంచి మెరు పుతో నిగనిగలాడేందుకు కొత్తిమీర బాగా ఉప యోగపడుతుంది.

• కొత్తిమీరలో క్యాల్షియమ్ కూడా ఎక్కువ. అందుకే అది ఎముకలను పటిష్టంగా మార్చి, వాటి ఆరో గ్యానికి బాగా దోహదపడుతుంది

No comments:

Post a Comment