*అవిసె గింజలు(FLAX SEEDS)*
*అవిసె గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పచ్చివి మంచివా లేదా వేయించినవి మంచివా? ఒక వ్యక్తి రోజుకు ఎంత పరిమాణంలో అవిసె గింజలు తినాలి?*
*తెలుసుకుందాం.. 👇🏼*
●●●
*_అవిసె గింజలతో డైటరీ ఫైబర్స్, ఒమేగా (ఒమేగా -3,ఒమేగా -6) ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, విటమిన్స్: E, B1, B6 సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఈ గింజలలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియంలు కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి మన ఆహారంలో ఖనిజ లోపాలను పూరించడానికి సహాయపడతాయి._*
*_ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యకరమైన, అవసరమైన కొవ్వు రకానికి చెందినవి ,అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చేప ఒమేగా -3 కు అద్భుతమైన ఆహరం. శాఖాహారులు ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క లోపాన్ని అవిసె గింజలు తినడం వల్ల పూరించవచ్చు._*
*_ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA - Alpha Linolenic Acid) అని పిలువబడే ఒక రకమైన ఒమేగా -3 లో ఎక్కువగా ఉంటుంది, ఇది మెదడు ఆరోగ్యంతో బలంగా ముడిపడి ఉంది. ఈ ఫ్యాటీ యాసిడ్ లోపం వల్ల మెదడు లో వైకల్యాలు ఏర్పడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) లోపం పొరల నిర్మాణం మరియు పనితీరును మారుస్తుంది మరియు చిన్న మెదడు పనిచేయకపోవడాన్ని ప్రేరేపించడాన్న, జంతువులలో మరియు తరువాత మానవ శిశువులలో నిరూపించబడింది._*
*_అవిసె గింజలలో లిగ్నాన్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ ఇతర మొక్కల ద్వారా లభించే ఇతర ఆహరం కంటే 800 రెట్లు ఎక్కువ పుష్కలంగా దొరుకుతాయి. ఈ లిగ్నాన్స్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ (పర్యావరణ కాలుష్యం వలన కలిగే DNA దెబ్బతినడం మరియు వృద్ధాప్యానికి దారితీసే బలహీనమైన ఆహారాలు) నుండి రక్షణ కల్పిస్తాయి._*
*_"గుండె-రక్త నాళాల ఆరోగ్యం కోసం":_* *_(కార్డియోవాస్కులర్) , పెద్దప్రేగు మరియు ప్రోస్టేట్ ఆరోగ్యం మరియు క్యాన్సర్ కణితులను తగ్గించడానికి ఉపయోగపడుతాయి._*
*_రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో "అధిక స్థాయిలో మొక్కల నుండి లభించే లిగ్నన్ తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది" అని ఒక అధ్యయనం పేర్కొంది._*
*_ఒక అధ్యయనంలో టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంలో 10 గ్రా ఫ్లాక్స్ సీడ్ పౌడర్‌ని ఒక నెల పాటు తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయి 19.7% తగ్గినట్లు నిరూపించబడినది._*
*_అవిసె గింజలలోని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు జుట్టు, చర్మం మరియు గోరు పెరుగుదలను మెరుగుపరుస్తాయి._*
*_#క్లుప్తంగా అవిసె గింజల ప్రయోజనాలు" / Health Benefits Of Flax Seeds Briefly":_*
*1 . _మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది._*
*2. _బరువు తగ్గడంలో సహాయపడతాయి._*
*3. _కాన్సర్ ని నిరోధిస్తాయి._*
*4. _చర్మం, జుట్టు మరియు గోర్లను ఆరోగ్యవంతగా చేస్తాయి._*
*5. _రాత్రి మంచి నిద్రకు సహాయం చేస్తాయి_*
*6. _కాన్స్టిపేషన్ సమస్యకు చక్కని పరిష్కారం._*
*7. _రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి._*
*8. _టైపు-2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కర శాతాన్ని తగ్గిస్తాయి._*
*9. _జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి._*
*10. _మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి._*
*_"వేయించినా లేక ముడివా"?_*
*_సరిగా ముదరని (లేక పండని) మరియు ముడి(వేయించని లేదా ఉడకబెట్టని) అవిసె గింజలలో అధిక మోతాదులో హాని కలిగించే ఒక రకమైన విషా పదార్దాన్ని కలిగి ఉంటాయని చెబుతారు . ఆ విషాన్ని నాశనం చేయడానికి అవిసె గింజలను దోరగా వేయించు కొని తినడం మంచిదని అంటారు. ఎక్కువగా వేయించకూడదు , ఎక్కువగా వేయించడం వల్ల అవి వాటి సహజ గుణాలను కోల్పోతాయి. అవిసె గింజల్ని వేయించడం వల్ల వాటి రుచి కూడా పెరుగుతుందండోయ్._*
*_" అవిసె గింజల్ని రోజుకు ఎంత మోతాదు తీసుకోవాలి'?_*
*_ఒక వ్యక్తి రోజుకు 15 నుంచి 30 గ్రాముల( ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్) వేయించిన అవిసె గింజల్ని లేదా వేయించిన అవిసె గింజల పొడిని తీసుకోవచ్చు.అంతకంటే మించి తీసుకొంటే కడుపులో ఇబ్బంది కలుగుతుంది._*
*_"ఏ సమయంలో నైనా తినవచ్చు"?_*
*_రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు. అవిసె గింజలలో ఉండే అధిక ఫైబర్ కారణంగా భోజనానికి ముందు తినడం వల్ల మీ ఆకలి తగ్గుతుంది._*
*_# గమనిక ":_*
*_అవిసె గింజలను తింటున్న సమయంలో, పుష్కలంగా నీరు తాగాలి. అవిసె గింజల ఉపయోగించినప్పుడు తగినంతగా హైడ్రేట్ కాకపోతే, శరీరంలోని అదనపు ఫైబర్‌ను మన శరీరం సరిగా జీర్ణం చేసుకోదు. కడుపులో ఇబ్బంది మరియు మలబద్ధకానికి దారితీస్తుంది అని గుర్తుపెట్టుకొండి._*
*1. _"ముఖం పై ముడతల సమస్యను తగ్గిస్తుంది":__*
*_అవిసె గింజల్లో యాంటీ-ఆక్సిడెంట్స్ ఫైటోకెమికల్ లక్షణాలు ఉంటాయి. ఇది ముఖం చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. వీటిని తినడం వల్ల ముడతల సమస్య ఉండదు. చర్మం మెరిసేలా చేస్తుంది. దీంతో పాటు చర్మం మృదువుగా తయారవుతుంది._*
*2. _"గుండె జబ్బులను తగ్గిస్తుంది":_*
*_అవిసె గింజలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా అవిసె గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అవిసె గింజలు టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి._*
*3. _"ఊబకాయాన్ని తగ్గిస్తుంది":_*
*_అవిసె గింజలు బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది._*
*4. _"మధుమేహం అదుపులో ఉంటుంది":_*
*_అవిసె గింజలు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది._*
No comments:
Post a Comment