ఆలుగడ్డ(potato) ఏ కాలంలోనైనా లభిస్తోంది. ప్రతి ఇంట్లో వారానికి ఒక్కసారైనా ఆలు కర్రీ వండాల్సిందే. ప్రతి కార్యక్రమంలోనూ ఆలూ స్పెషల్ కర్రీ(Curry) ఉండాల్సిందే. అయితే..అంత ఇష్టంగా తినే ఆలుతో పెను ప్రమాదం కూడా ఉందండోయ్.. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. సాధారణంగా బంగాళదుంపలు(Potatoes) అంత తొందరగా పాడవవ్వు.. అందుకే చాలా మంది గృహిణీలు కేజీలుగా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. అయితే.. అలా నిల్వ ఉంచిన ఆలుగడ్డలకు మొలకలు రావడం చూసే ఉంటాం.. అయినా కూడా వాటిని కూర వండేసి తీనేసి ఉంటాం. కానీ.. అది చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన చిరుధాన్యాలు ఆరోగ్యానికి(health) ఎంతో మేలు చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
కానీ మొలకెత్తిన బంగాళదుంపలు తింటే మాత్రం మన ఆరోగ్యానికే పెను ముప్పు తెచ్చిపెడతాయి. బంగాళదుంపలపై వచ్చే మొలకలు విషపూరితమైనవని చెబుతున్నారు నిపుణులు. ఒక్కొసారి ఫుడ్ పాయిజన్ కి దారి తీసి ప్రాణాల మీదకు కూడా తెస్తుంది. బంగాళదుంపలపై ఏర్పడే మొలకల్లో బ్లేకో అల్కాయిడ్స్(Blaco alkaloids) అనే విషపూరితమైన రసాయన పదార్థాలు ఉంటాయని తెలింది. అంతేకాకుండా పాడైన బంగాళదుంపలు, ఆకుపచ్చ రంగులో మారిన బంగాళదుంపలు చేదుగా ఉండటంతో పాటు..వీటిలో హానికారపు టాక్స్ ఉంటాయి. ముఖ్యంగా మొలకెత్తిన బంగాళదుంపల్లో మాత్రం అధిక స్థాయిలో ఈ రసాయన పదార్థం ఉంటుంది. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి తిన్న కొద్దీ గంటలు లేదా ఒక్కరోజులోనే పలు అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడాల్సివుంటుంది.
అంతేకాకుండా లో బీపీ(BP), పల్స్ ఎక్కువగా కొట్టుకోవడం, జ్వరం, తలనొప్పి, మతిమరుపు.. కడుపులో నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు(Cardiac diseases), నాడీ వ్యవస్థ(nervous system) దెబ్బతినడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన ఆలుగడ్డలను గర్బణీలు తింటే పుట్టబోయో బిడ్డపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. బంగాళదుంపలను చల్లని, చీకటి ప్రదేశాల్లో నిల్వ ఉంచడం ద్వారా అవి మొలకెత్తడాన్ని నివారించవచ్చు. అలాగే ఉల్లిపాయలతో కలిపి ఉంచడం వల్ల ఆలు త్వరగా మొలకెత్తుతుంది. ఇలా చేయకుండా ఉండటమే మంచింది. ఇకపై అవసరం ఉన్నప్పుడు మాత్రమే అప్పటికప్పుడు తెచ్చుకుని తినడం మంచిది. పడేయడం ఎందుకని కక్కుర్తితో కడుపులో వేస్తే..అనవసరమైన రోగాలకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని గుర్తు పెట్టుకోండి.
No comments:
Post a Comment