Sunday, 23 April 2023

ఈ 10 ప్రధాన సంకేతాలు మూత్రపిండాల సమస్యను సూచించగలవు

*"ఈ 10 ప్రధాన సంకేతాలు మూత్రపిండాల సమస్యను సూచించగలవు''*
*******************************%
 *శరీరంలోని విష పదార్ధాలను, వ్యర్థాలను తొలగించడం మరియు రక్తపోటును నియంత్రించడం వంటి అనేక చర్యలు మూత్రపిండాల ఆద్వర్యంలో ఉంటాయి. అంతేకాకుండా, ఎలెక్ట్రోలైట్స్ సంతులనం చేయడం, మరియు ఎరిత్రోసైట్స్ (ఎర్ర రక్త కణాల) ఉత్పత్తిని ప్రేరేపించడం కూడా మూత్రపిండాల ప్రధాన చర్యలుగా ఉంటాయి. క్రమంగా మూత్రపిండాల ఆరోగ్యం మీదనే, ఇతర అవయవాల పనితీరు, శరీర జీవక్రియలు కూడా ఆధారపడి ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు.*


*అమెరికన్ కిడ్నీ ఫండ్ ప్రకారం, U.S. లోని మరణాలలో 9వ ప్రధాన కారణంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నాయని ఒక అద్యయనంలో పేర్కొంది.*


*మూత్రపిండాల వ్యాధికి గల అత్యంత సాధారణ కారణాలు : • నిర్జలీకరణం • హైపోవోలేమియా • తక్కువగా నీటిని తీసుకోవడం • డైయురేటిక్స్ వంటి కొన్ని మందులు • కణితులు • మూత్రాశయంలో అడ్డంకులు • చికిత్సకు నోచుకోని రక్తపోటు లేదా మధుమేహ సమస్యలు • మూత్రపిండాల్లో రాళ్లు • ప్రోస్టేట్ వ్యాధులు*


*అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడానికి, మూత్రపిండ వ్యాధి ప్రారంభ సంకేతాలను గుర్తించడం అత్యంత కీలకం అని మరువకండి.*

*1).  అతి మూత్ర విసర్జన : రోజువారీ తీసుకునే నీటి మొత్తాల మీదనే, మూత్రపిండాలు విసర్జించే మూత్ర స్థాయిలు అనుసంధానించబడి ఉంటాయి. మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయని ఎడల, మూత్రం ఉత్పత్తి తక్కువగా జరిగి, అనేక ఇతర జీవక్రియల మార్పులు సైతం సంభవిస్తాయి. క్రమంగా ఒలిగురియా లేదా పాలీయూరియా సమస్యలకు దారితీస్తుంది. అనగా, తరచుగా మూత్ర విసర్జన అనుభూతికి లోనవడం వంటివి జరుగుతాయి. మూత్ర విసర్జనలో అటువంటి మార్పులను గమనించిన ఎడల, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం ఉత్తమం.* 


*2).  మూత్రం రంగులో మార్పులు : ఆరోగ్యకరమైన మరియు డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) సమస్యలు లేని వ్యక్తులు లేత పసుపు రంగులో మూత్రాన్ని కలిగి ఉంటారు. కానీ, మీ మూత్రంలో రక్తం ఉన్నట్లయితే క్రమంగా, దాని సహజ రంగును కూడా మారుస్తుంది. ఇవి నారింజ, నలుపు, గోధుమ లేదా ఎరుపు రంగులు కావచ్చు. ఇది తీవ్రమైన మూత్రపిండ వ్యాధికి ప్రధాన సూచికగా ఉంటుంది.*

*3).  మూత్రం యొక్క వాసన : శరీరంలోని నీటి స్థాయిలు, శారీరక శ్రమ మరియు పోషణ వంటి కొన్ని కారకాలు మీ మూత్రం యొక్క వాసనను సైతం ప్రభావితం చేస్తాయి. మీరు అసాధారణ తీపి రుచి, లేదా దుర్గంధ భరితమైన వాసనను గమనించిన ఎడల, మీ మూత్రపిండాలలో సమస్య ఉందనే అర్ధం.*
 

 *4).  కడుపు నొప్పి : మీరు ఇతర అనారోగ్య సంకేతాలతో పాటుగా, కడుపు నొప్పిని కూడా కలిగిఉన్న ఎడల, బహుశా మీరు కిడ్నీ సమస్యను కలిగి ఉండవచ్చు. దీనికి తక్షణ వైద్య చికిత్స అవసరం.*


*5).  శ్వాస తగ్గడం, వికారం మరియు వాపు : మీ మూత్ర పిండాల పనితీరు తగ్గిన పక్షంలో, శరీరంలో వ్యర్ధాలతో కూడిన నీటిని తొలగించడంలో సమస్యలు ఎదురవుతాయి. క్రమంగా మూత్రపిండాలలో నీరు నిలుపుదలకు గురై, వాపుకు దారితీస్తుంది. ఈ పరిస్థితి, శ్వాస వ్యవస్థ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. క్రమంగా, శ్వాసలో తగ్గుదల మరియు వికారం వంటి అనుబంధ సమస్యలను ఎదుర్కొనవచ్చు.*


*6).  మూత్రం సాంద్రతలో అసాధారణ మార్పులు : మీరు మీ మూత్రంలో చీము లేదా నురుగు గమనించినట్లయితే, మీ శరీరంలో తగిన శాతంలో నీరు లేదని, లేదా మీకు ఏదైనా తీవ్రమైన మూత్రపిండాల సంబంధిత వ్యాధి ఉందని అర్థం కావచ్చు.*


*7).  నిరంతరంగా అలసట : అలసట, శరీరంలో శక్తి తగ్గుదల, వంటివి కూడా మూత్ర పిండాల పనితీరు తగ్గుదలను సూచించగలవు. రక్తంలో మలినాలు మరియు విష పదార్ధాలు పెరగడం మూలాన కూడా సమస్యలు తలెత్తవచ్చు. మూత్రపిండ వైఫల్యం అనేది, రక్తహీనత మరియు బలహీనతకు కూడా దారితీస్తుంది.* 


*8).  మీ నోటిలో చెడు రుచి : మీ మూత్ర పిండాలు రక్తం నుండి విషాన్ని తొలగించలేని పక్షంలో, అవి మీ శరీరంలో పేరుకునిపోయి సంచితమవడం జరుగుతుంది. ఈ పరిస్థితి యురేమియా అని పిలుస్తారు మరియు అసాధారణంగా నోటిలో లోహపు రుచికి కారణమవుతుంది. మీరు ఆహారంలో భిన్న రుచులను కూడా గమనించవచ్చు.*


*9) . కాళ్ళలో నొప్పి : మీరు మీ కాళ్ళలో అధికంగా నొప్పిని అనుభవిస్తూ, క్రమంగా వెన్ను క్రిందు భాగానికి నొప్పి తరలుతున్న ఎడల, ఇది మూత్ర పిండాల వ్యాధికి సూచన కావొచ్చు. మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రపిండాల సంక్రమణ సమస్యల కారణంగా కాళ్ళల్లో నొప్పి కలిగే సూచనలు ఉంటాయి.*


*10).  దురదతో కూడిన దద్దుర్లు : శరీరంలో విషాల పెరుగుదల చర్మంపై దురద మరియు దద్దుర్లకు కారణమవుతుంది. పరిస్థితిని అంచనా వేయకుండా, చర్మ వ్యాధిగా అపోహ పడకండి. ఇటువంటి సంకేతాలు, మూత్రపిండ వ్యాధిని సూచిస్తాయి. ప్రాణాంతక పరిణామాలను కలిగి ఉన్నందున, ఈ సంకేతాలకు తక్షణ వైద్య సహాయం మరియు సరైన వైద్య చికిత్స అవసరం. పైన పేర్కొన్న సంకేతాలను ఏమాత్రం గమనించినా, తక్షణమే సంబంధిత వైద్యుడిని సంప్రదించండి.*
Cell. 9949363498

No comments:

Post a Comment