Monday 10 April 2023

చర్మం పై పులిపిర్లు నివారణకు_ఆయుర్వేదం

*చర్మం పై పులిపిర్లు నివారణకు_ఆయుర్వేదం_లో_నవీన్_నడిమింటి_సలహాలు* 
          
*1.-   #పులిపిర్లు_నివారణ*

       పులిపిర్ల మీద బాగా గీరి వాటి మీద ఉత్తరేణి రసం పూయాలి. కొద్ది రోజులు ఈ విధంగా చేస్తే నివారింప బడతాయి.
 
పుదీనా ఆకులు           --- 5
తులసి రసం                --- 5
నిమ్మ రసం                 --- 2, 3  చుక్కలు
 
     అన్నింటిని కలిపి నూరి పులిపిర్ల మీద పెడుతూ వుంటే రాలి పోతాయి.
 
 
 2.-   #ఇది_ఒక_సాధారణ_చర్మ_సమస్య .
 
1. ఆలు గడ్డను మధ్యకు కోసి 15, 20 సార్లు  రుద్దుతూ వుంటే చిన్న సైజు పులిపిర్లు తగ్గి పోతాయి.
 
2. వెల్లుల్లిని నలగగొట్టి పులిపిర్ల మీద మాత్రమే  ఉండేటట్లు పెడితే గుడ్డ కప్పితే వారం రోజుల్లో రాలి పోతాయి.
 
3. పచ్చి ఉసిరి ముక్క తో రుద్దితే కూడా ఎండి రాలి పోతాయి.
 
4. #ఆశ్వద్ద_త్వచ_భస్మం :--   రావి చెట్టు యొక్క బెరడును తెచ్చి బాగా ఎండబెట్టి కాల్చి భస్మం చెయ్యాలి.
దానికి సమానంగా తడి సున్నం, వెన్న కలిపి పులిపిర్ల మీద పెట్టి ఆరి పోయఎత వరకు వుంచి తరువాత   తుడిచేయ్యాలి.  వారం రోజులలో రాలి పోతాయి.
 
5. ఉత్తరేణి తో కూడా పై విధంగా చేస్తే తగ్గి పోతాయి.
 
6. రెడ్డివారి నానబాలు ( దుడ్డిక ) మొక్కను తున్చితే పాలు వస్తాయి. ఆ పాలతో పులిపిర్ల మీద అద్దాలి.
7. పులిచింతాకు సమూలం తెచ్చి నూరి పెట్ట వచ్చు.
 
8. కాశీసాది తైలం పూయాలి.
 
9. కేశ్వర గుగ్గులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి  పూటకు రెండు మాత్రల చొప్పున వాడాలి.
 
10. త్రిఫల గుగ్గులు
పూర్తి ఆరోగ్యం సమస్య కోసం వైద్య నిలయం లింక్స్
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0m1UsfGADt5D6cNtWmaHTAukUh4nnpNziK1QVJnCj5WgiJT6uWJ7Baq49KbiHrNeol&id=1536735689924644&mibextid=Nif5oz
*3.-   #ప్రధాన_కారణం_వైరస్*
 
1.వెల్లుల్లి పాయలను ఒలిచి పులిపిర్ల పైన రుద్దుతూ వుండాలి.
 
2. ఉల్లిపాయను సగానికి కోసి మధ్య భాగాన్ని తొలగించి మధ్యలో ఉప్పు నింపాలి. దీని నుండి వచ్చే రసంతో   నెల రోజుల పాటు రుద్దాలి.
 
3. ఉత్తరేణి మొక్కను కాల్చి బూడిద చేసి దానికి ఆరు రెట్లు నీళ్ళు కలిపి కాచాలి, చివరకు  ఉత్తరేణి క్షారం  అనే పొడి మిగులుతుంది.దీనికి తులసి ఆకు రసం కలపాలి. తరువాత ఆవ నూనె గాని, ఆముదం గాని    పులిపిర్ల మీద రుద్దాలి.

      ఇవి ముఖ్యముగా   ముఖము, మెడ, మోచేతులు, పాదాల మీద వస్తాయి . ఇవి వైరస్ ద్వారా వ్యాపిస్తాయి .

చిత్రమూలము  వేరు పొడి                  --- 5 gr
ఆముదం  లేక  వంటనూనె                 --- 5 ml
    
      రెండింటిని బాగా పేస్ట్ లాగా కలపాలి .దీనిని  గాజు కడ్డీతో గాని ,  చెంచా మొనతో గాని నెమ్మదిగా పూయాలి .
ప్రక్కన ఎక్కడా ఎంతమాత్రం తగలకూడదు . కాలుతుంది .

      ఈ విధంగా నలభై రోజులు చేస్తే రాలిపోతాయి . ఇది వైరస్ ను నివారిస్తుంది .

2. కొత్త సున్నాన్ని పులిపిర్ల మీద పెడితే రాలిపోతాయి .

3. అల్లం ముక్కను సన్నగా పెన్సిల్ ముక్క లాగా చెక్కి సున్నంలో అద్ది పెడితే కూడా రాలిపోతాయి .  ప్రక్కన
    తగలకూడదు . తగిలితే పుండు పడుతుంది .

*#నవీన్_సూచన :---*  పులిపిర్లు  అంటువ్యాధి  .  దానిమీ మీద రుద్ది ,  గిల్లి ఆ చేత్తో వేరే చోట తాకితే కొత్త పిలిపిర్లు ఏర్పడతాయి

నిమ్మ పండ్ల ముక్కలు             --- రెండు
వెనిగర  --- ఒక కప్పు
ఉప్పు    --- పావు టీ స్పూను
వెల్లుల్లి పాయ                        --- ఒకటి
  
      వెనిగర్ లో ఉప్పును వేసి కరగాబెట్టాలి . దానిలో నిమ్మ పండ్ల ముక్కలను వారం రోజులు నానబెట్టాలి . తరువాత
పులిపిర్ల మీద రుద్దాలి , తరువాత వెల్లుల్లి పాయతో రుద్దాలి .                                            ----
    పులిపిర్ల మీద గీరి  పుల్లతో పిందతైలాన్ని వాటి మీద పెట్టాలి .  ఈ విధంగా కొద్ది రోజులు చేస్తే పులిపిర్లు కరిగి రాలిపోతాయి .   ఇది స్వానుభవం .  చాలా మంది  ఉపయోగించి  నివారించుకున్నారు .

      పులిపిర్లు రావడానికి ప్రధాన కారణం వైరస్.      ఇవి  చేతి వేళ్ళ  చుట్టూ , కాళ్ళ చుట్టూ , ముఖం మీద , మెడమీద ,
జననాంగాల మీద వస్తుంటాయి           ఇది అంటువ్యాధి . జాగ్రత్త పడాలి .

పులిచింతాకు రసం                       ---- అర  టీ స్పూను
చాకలి సోడా                                ---- అర  టీ స్పూను
సున్నం                                      ---- అర  టీ స్పూను

    అన్నింటిని బాగా కలిపి పేస్ట్ లాగా చెయ్యాలి . దీనిని పుల్లతో పులిపిర్ల మీద మాత్రమె పెట్టాలి . పక్కన తగలకూడదు
మచ్చ ఏర్పడితే  తేనె , నెయ్యి  సమానం గా తీసుకొని కలిపి మచ్చ మీద పోయాలి .

తమలపాకు రసం                         ---- అర  టీ స్పూను
సున్నం                                      ---- అర  టీ స్పూను

    రెండింటిని బాగా కలిపి పేస్ట్ లాగా చేయాలి .  దీనిని పుల్లతో పులిపిర్ల మీద మాత్రమె పెట్టాలి .  
ధన్యవాదములు 🙏
మీ Naveen Nadiminti,
ఫోన్ - 097037 06660,        ************************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment