Sunday, 16 April 2023

నల్లమచ్చలు

🧏‍♀️🧏‍♂️🧏‍♀️🧏‍♂️🧏‍♀️🧏‍♂️🧏‍♀️
🧑🏻‍⚕️🧑🏻‍⚕️🧑🏻‍⚕️🧑🏻‍⚕️🧑🏻‍⚕️🧑🏻‍⚕️🧑🏻‍⚕️



*🧏‍♀️నల్లమచ్చలు🧏‍♂️*



సూర్యకిరణాలు చర్మానికి డైరెక్ట్‌గా తాకడం వల్ల.. చర్మంలో ఉండే మెలానిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మెలానిన్‌ శాతం తగ్గినప్పుడు ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ కింది చిట్కాలను పాటిస్తే మచ్చలు పోవడమే కాదు.. చర్మం కొత్త మెరుపును సంతరించు కుంటుంది.


1 అర స్పూన్‌ నిమ్మరసానికి కాస్తంత గ్లిజరిన్‌ జోడించి ఆ మిశ్రమాన్ని నల్లమచ్చలున్న ప్రాంతంలో రాస్తే తొందర్లోనే వాటి బాధ వదిలిపోతుంది.

2 చిటికెడు పసుపును రెండు మూడు గోరింటాకులతో కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాసినా మంచి ఫలితం ఉంటుంది.

3 కొంచెం పసుపు, కరివేపాకును కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై రాయాలి.

4 ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా కలుపు కోవాలి. దానికి కొంత పసుపు, రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లాగా చేసి రాస్తే నల్లమచ్చలు మాయమవడమే కాకుండా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

6 ఎండిన తమలపాకులను పొడి చేసి దానికి కొంచెం కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసినా ఉపయోగం ఉంటుంది.

7 రాత్రి పడుకునే ముందు కొంచెం నీళ్లలో చపాతీని నానబెట్టి మర్నాడు ఉదయం దాన్ని పేస్ట్‌లాగా చేసి ముఖానికి పట్టించండి. ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి.

8 కుంకుమపువ్వును పొడి చేసి దానికి కొంత తేనె కలిపి ముఖానికి రాసుకుంటే బ్లాక్‌హెడ్స్‌ తొందరగా మాయమవుతాయి.

9  మచ్చలను తొలగించడంలో సిట్రస్‌ జాతికి చెందిన పండ్లరసాలకు మించింది లేదు. కొంచెం నిమ్మరసాన్ని కాటన్‌తో తీసుకుని నల్లటి మచ్చలపై రాసి సుతిమెత్తగా మసాజ్‌ చేయాలి. దీనిలో ఉన్న విటమిన్‌-సి మచ్చలపై మంచి ప్రభావం చూపిస్తుంది.

10 కొంచెం దూదిపై పాలు లేదా మజ్జిగ చుక్కలు వేసి దాన్ని మచ్చలున్న ప్రాంతంపై రాసుకోండి. వీటిలో ఉండే ల్యాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.

11 మచ్చలున్న ప్రదేశంలో తేనెను రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. తేనెలో ఎన్నో చక్కటి ఔషధ గుణాలున్నాయి. అవి నల్లమచ్చలను తొలగించడంలో తోడ్పడతాయి.

12 విటమిన్‌-ఇ ఆయిల్‌ను రాత్రి నిద్రకు ముందు ముఖానికి రాసుకుని తెల్లారి లేచిన తర్వాత కడుక్కోండి.

13 వీటితోపాటు నిత్యం సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ముఖానికి రాసుకోవడం మర్చిపోవద్దు. 

14 బంగాళాదుంప ముక్కల్ని తీసుకుని ముఖం రుద్దుకున్నా... మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, వైట్ హెడ్స్ లాంటివి దూరమవుతాయి. 

15 దానిమ్మ పండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని  నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి నల్లమచ్చలున్న చోట రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా మచ్చలున్న చోట నిత్యం రాస్తుంటే మార్పు కనిపిస్తుంది. 

16 తాజా మెంతి ఆకులు  మెత్తగా రుబ్బి రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి. మర్నాడు గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేయడం వల్ల నల్లమచ్చలు దూరమవుతాయి. అలాగే గుప్పెడు మెంతి ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించి ఆ డికాషన్ చల్లారాక ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది.

17 గ్రీన్ టీ లో దూది ముంచి మచ్చలపై రోజూ రాసుకున్నా ,వంటనూనె, నిమ్మరసం  తీసుకొని మచ్చలున్న ప్రాంతంలో సున్నితంగా మర్దన చేయాలి. పది నిమిసాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు.

18  * ఒక చెంచా తేనె, ఒక గుడ్డు తెల్లసొనను బాగా కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల నల్లమచ్చలు, మృతకణాలు తొలిగిపోతాయి. 

19 * రెండు చెంచాల నిమ్మరసం, తగినంత దాల్చినచెక్క పొడిని బాగా కలుపాలి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, భుజాలు, వీపునకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారంలో నాలుగుసార్లు ప్రయత్నించవచ్చు.

20 * అలోవెరా మొక్క నుంచి తాజా జెల్‌ను ముఖానికి పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. 

21* ఒక చెంచా పసుపు, రెండు చెంచాల పుదీనా రసంలో కలుపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. 

22* తగినన్ని మెంతి ఆకులను పేస్టులా చేసుకొని ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 23* తాజా టమాట గుజ్జును రాత్రి
 నల్లమచ్చలపై రాయాలి. ఉదయం శుభ్రం చేసుకొంటే తర్వగా పరిష్కారం దొరుకుతుంది.

*ఎండిన తులసి ఆకులను పొడి వేపాకు పొడి, పుదీనా పొడీ కొంత పసుపు, రోజ్‌వాటర్ కలిసి పేస్ట్‌లాగా చేసి రాస్తే నల్లమచ్చలు మాయమవడమే కాకుండా చర్మం మెరుపును సంతరించుకుంటుంది. ఎండిన తమలపాకులను పొడి చేసి దానికి కొంచెం కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసినా ఉపయోగం ఉంటుంది*.

No comments:

Post a Comment