Monday 24 April 2023

చిట్కాలు

చిట్కాలు 

*_# తలనొప్పి ":_*


శొంఠి గంధం కణతలకు రాచినా తలనొప్పి పోతుంది.  వేడివల్ల తలనొప్పి వస్తే మల్లెపూలు, ఆముదపు ఆకులు తలకు కట్టాలి. శీతాకాలమైతే పారుడు మట్టి ఉపయోగం . గంధం తీసి ఫాలభాగానికి బాగా పట్టించుకున్నా, . వెల్లుల్లిని బాగా నలగగొట్టి నుదుట, కళ్ళకురెండు వైపులా రుద్దినా ఫలితం చూపిస్తుందని పల్లె పట్టుల్లో గట్టి నమ్మకం._*

*_# చెవి నొప్పి ":_*

*_తులసిరసం చెవిలో పొయ్యాలి. వెల్లుల్లి నూనెలో కాచిపోసినా  సరే.  సబ్జా ఆకురసమో . బంతి ఆకురసమో,చామంతి ఆకురసమోపోసినా, ఒక లవంగం వేసి కాచిన నువ్వులనూనె చెవిలో పోస్తే చెవిపోటు తక్కువవుతుంది. నిమ్మరసాన్ని నీళ్ళలో కలిపి కొంచెం వెచ్చచేసి చెవిలో బొట్టు బొట్టుగా వేసినా చెవిపోటు తగ్గుతుంది._*

*_# పళ్ళ నొప్పి ":_*

*_మిరియాలు, ఉప్పు మెత్తగా పొడిచేసి నొప్పిగా ఉండే పన్ను మీద కొంచెంసేపు ఉంచాలి. రెండు మూడు లవంగాలు మెత్తగా నూరి నిమ్మ కాయ రసంతో కలిపి చిగురుకు, పన్నుకు తాపిస్తే నొప్పితగ్గుతుంది. నీళ్ళలో ఉప్పుకరిగించి ఆ నీళ్ళతో నోరు పుక్కిలించినా పళ్ళనొప్పి తగ్గుతుంది._*

*_# గొంతునొప్పి ":_*

*_కొత్తసున్నం గొంతుకు పూయాలి. సున్నం, మునగాకురసం కలిపి గొంతుకు పూసినా నొప్పి తగ్గుతుంది. కఫం ఉంటే మీరియాలు పొదిగిన బెల్లం మింగితే పోతుంది. వెచ్చని నీళ్ళలో ఉప్పువేసి అది కరిగిన తర్వాత గొంతులో పోసుకొని మింగకుండా గుళుగుళుమని శబ్దం చేసి ఉమ్మివెయ్యాలి._*

*_# కడుపు నొప్పి ":_*

*_వాము, ఉప్పు కలిపి తినాలి బొడ్డు దగ్గర నొప్పిగా ఉంటే జిల్లేడుపాలు వేసి పసుపు అద్దుతారు. నీళ్ళలో చక్కెర కలిపి కొంచెం వెచ్చజేసి తాగినా పొట్ట ఉబ్బరంతో కూడిన కడుపు నొప్పి పోతుంది._*

*_# కళ్ళ నొప్పి ":_*

*_నందివర్ధనం పూలు, పొన్నగంటాకు కంటికి కట్టాలి. కలబంద, పచ్చకర్పూరం కలిపి పైన పెట్టుకోడం వల్ల కూడా పోతుంది._*

*_చిన్న చిన్న గాయాలకు సున్నం పూయడమే పరమౌషధంగా భావిస్తారు పల్లెల్లో . ఆముదంలో రంగరించిన సున్నమైతే శ్రేష్ఠం. చిన్నచిన్న గుల్లలుంటే ఎర్రమట్టి పూస్తారు. గోడలకుండే ఎర్రమట్టి మీద కొంచెం నీళ్ళు చల్లి చేతితో ఎర్రమట్టితీసి దాన్ని గుల్ల మీద వేస్తే అవి ఎండగానే గుల్ల పగిలి చీము బయటికి వచ్చేస్తుంది. శాంతరసాకు ఉప్పువేసి సూరి కట్టినా గాయాలు మానుతాయి గడ్డలు మొదలైన వాటికి పసుపు, గుడ్డ పేలిక, వేప ఇగుళ్ళు దంచి కడ్తారు. కుళ్ళి వాసన కొడ్తుండే పుండయినా వెల్లుల్లిని వెన్నలో బాగా చాది తేపిస్తే నయమవుతుందట. ఎండిన మామిడి ఆకుల్ని బూది చేసి ఈ బూదిని గాయాలమీద వేస్తే నెత్తురు కారుతుంటే వెంటనే నిలిచి, గాయంకూడా త్వరగా మానుతుంది. కాలిన గాయాలకు మంచినూనె పూసినా, కొబ్బరినూనె పూసినా మంచిదే.మంచి తేనె పూసినా మంటతగ్గి గాయం త్వరగా మానుతుంది. దానిమ్మ ఆకులను నున్నగా నూరి కాలిన గాయానికి లేపించినా మంట తగ్గు తుంది, కాలిన గాయం వల్ల ఏర్పడిన మచ్చలు పోవాలంటే నేరేడు నున్నగా నూరి పూస్తూ వుండాలి._*

*_# పాము, తేలు కాటుకు ":_*

*_పాముకరిస్తే ఆ భాగానికి పైన గట్టిగా గుడ్డనుగాని, దారాన్ని గాని బిగించాలి. రెండు మూడు చోట్ల కడితే మంచిది. కరిచిన చోట కోసి రక్తం బయటికి వచ్చేట్లు చెయ్యాలి. పాముకరవగానే గుడ్డకట్టి, అక్కడ గాయం చేయాలి. కోడిని పట్టుకొని దాని గుదద్వారం దగ్గర కొన్ని రెక్కలు పీకి అక్కడ గాయంచేసి దాన్ని గాయం దగ్గర పెట్టాలి. ఆ కోడి చనిపోతుంది. ఇట్లా రెండు మూడు కోళ్ళను చేస్తే విషమంతా పోతుంది._*

*_తేలుకాటుకు ఎర్రగడ్డగాని, తెల్లగడ్డగాని నలగగొట్టి గాయమైన చోట కట్టాలి. తేలుకుట్టగానే ఎర్రగడ్డ, బెల్లం నమిలి తినాలి. ఎర్రగడ్డ రసాన్ని కుట్టిన చోట పూయాలి. తేలుకుట్టగానే కుట్టిన తేలునుగాని, మరో తేలునుగాని పట్టుకొని దాని కొండిని కాల్చాలి. కాల్చేటప్పుడు వచ్చే పొగను కుట్టినచోటికి పట్టాలి. కొండీని కాల్చి, వచ్చిన భస్మాన్ని కూడా అదే చోట పూయాలి._*

*_తేనేటీగలు కరిస్తే మంచి తేనెపూస్తే మంటతగ్గుతుంది అంటారు. ఎర్రగడ్డను సగానికి కోసి దాన్ని తేనెటీగలు కరిచిన చోట రుద్దితే మంట తగ్గుతుంది._*

*_పిచ్చికుక్క కరిస్తే చాలా ప్రమాదం. కుక్కలాగే అరిచి అరిచి చచ్చి పోతారంటారు. రాబిస్ రాకుండా ఇంజక్షన్లు తీసుకోడం అవసరం. కాని జాన పదులకు ఇంజక్షన్లు ఎక్కడినుంచి వస్తాయి? వాళ్ళుచేసే వైద్యమిది. ఉత్త రేణి చెట్టును వేళ్ళతో సహా పీకి తెచ్చి రోట్లో వేసి బాగాదంచి రసం తీస్తారు. దాన్ని వడబోసి, రసానికి కొంచెం నీళ్ళుకలిపి ప్రతిదినం పొద్దున లోటా వంతున వారంరోజులు తాగాలి. పిచ్చికుక్క కరవగానే ఈ వైద్యం ప్రారంభించాలి. మనిషి కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ప్రారంభించిన తర్వాత వైద్యం చేస్తే ఏమీ లాభంలేదు._*

*_# చర్మ వ్యాధులకు " :_*

*_ముఖంలో మొటిమలుంటే ఎర్రమట్టిని వెచ్చజేసి వేస్తే పోతాయంటారు. దాల్చిన చెక్కను నిమ్మరసంలో చాది మొటిమలకు పూయాలి. కాలిమడమ పగిలిఉం టే నలగగొట్టిన ఎర్రగడ్డను కడితే ఫలం కనిపిస్తుంది. ముఖంలో అక్కడక్కడ పగుళ్ళు కనిపిస్తే పాలమీగడలో కొన్నిబొట్లు నిమ్మకాయరసం వేసి చర్మంమీద మృదువుగా అద్దాలి. కాలుగంట తర్వాత ముఖం చల్లని నీళ్ళతో కడగాలి. చర్మం బిరుసుగా ఉంటే పచ్చికొబ్బరి తురిమి బాగా పిండి పాలు తియ్యాలి. దానిలో గ్లిసరిన్ వేసి కలిపి పూసుకోవాలి. ప్రతిరోజు సున్నిపిండితో బాగారుద్ది నీళ్లు పోసుకుంటే చర్మంమీది మచ్చలు పోతాయి. బొప్పాయి పండు చెక్కులతో చర్మాన్ని రుద్దుతూ ఉన్నా మచ్చలు పోతాయి._*

*_గజ్జి, దురద, దద్దులు మొదలై నవి చర్మరోగాలు, చర్మానికి సంబంధించిన ఎలాంటి దురదలుగాని, గజ్జిగాని పోవడానికి గరికను, పసుపును గోమూత్రంలో చాది పూసుకోవాలి. అరగంటతర్వాత వేపాకులు వేసిమరిగించిన నీటితో స్నానంచెయ్యాలి. దురద, గజ్జి పోవాలంటే చింతాకుల్ని నున్నగానూరి పూసుకోవాలి, నిమ్మకాయరసంలో గంధకం పొడిని కలిపి పూసుకుంటే దురదలు పోతాయి. వాము, పసుపుపొడిని సమంగా తీసుకొని నీటిలో బాగాకలిపి వేపించినా గుణంకనిపిస్తుంది. చర్మవ్యాధులేమున్నా తేనెపూస్తే తగ్గు తాయి. సముద్రస్నానంచేస్తూ ఉంటే కుళ్ళికంపుకొడుతున్న గాయాలు కూడా మానుతాయి._*

*_# జలుబు. దగ్గు, జ్వరం ":_*

*_మామూలుగా మనకు పట్టుకునేవి జలుబు-దగ్గు-జ్వరమే. ఏం  చేసినా మరీ తగ్గని దీర్ఘకాలిక వ్యాధులైతే తప్ప మామూలు జలుబులకు దగ్గులకు జాన పదులు కషాయాలు, పూతలు, పథ్యాలతోనే పొద్దుపుచ్చుతారు. జలుబుకు కరక్కాయ తాడికాయ, ఉసిరిగ వరుగు కలిపి కషాయం చేసుకొని తాగుతారు. శొంఠి మిరియాలు, పిప్పళ్ళు, బెల్లంవేసి కషాయంచేసి తాగినా జలుబుకు గుణం కనిపి స్తుంది. ముక్కు దిబ్బడకు పసుపు నిప్పులమీదవేసి వాసన చూస్తారు. మిరియాలు కాల్చి వాసన చూడడం కూడా ఉంది. ముద్దకర్పూరంగాని గుడ్డలో ఉంచుకొని అప్పుడప్పుడు వాసన చూస్తూ ఉన్నా ముక్కు దిబ్బడ తగ్గుతుంది._*

*_దగ్గు ఎన్నోకారణాలవల్ల రావచ్చు. మామూలు దగ్గుచిన్న చిన్న వైద్యాల వల్ల తగ్గుతుంది. తాళిసపత్రికషాయం దగ్గుకు మంచిది. మూమాలు దగ్గుకు ఉప్పు, కరక్కాయ బుగ్గన పెట్టుకొన్నా చాలు, రసం మింగుతూ ఉంటే దగ్గు తగ్గుతుంది. పొడిదగ్గయితే పెద్ద ఎర్రగడ్డ ఒకటి తీసుకొని, కొంచెం బెల్లం చేర్చి, పొద్దున-మధ్యాహ్నం రాత్రిపడుకునేటప్పుడు తినాలి. నెయ్యితో ఎర్ర గడ్డను వేయించి తిన్నా మంచిది. కఫంతోకూడిన దగ్గయితే ఉప్పు, మిరియాలు, తెల్లగడ్డచేర్చి, దంచి కొంచెంసేపు నోటిలో ఉంచుకొని, గొంతువరకు తీసుకు వెళ్ళాలి._*

*_జ్వరం ఎన్ని విధాలుగానైనా రావచ్చు. నిజానికి అసలు జ్వరానికి కారణమేమిటో తెలియకుండా ఏదో ఒక మందు తీసుకోకూడదు. అయినా అన్నిటికీ కషాయాలే ఇవ్వడం జానపదులకు తెలిసిన వైద్యం.  'లంఘనం పర మౌషధం' కాబట్టి ఉపవాసంకంటే మంచివైద్యంలేదు. జ్వరానికి ఉపవాసమే మంచిమందు. జ్వరం చాలా ఎక్కువగా ఉంటే చల్లనీటిలో తడిపిన గుడ్డలను మడతవేసి నుదుటవెయ్యాలనేది జానపద వైద్యానికేకాక, ఇంగ్లీషు వైద్యానికి కూడా సమానమే. దీనివల్ల ఎక్కువగా ఉండే జ్వరం తగ్గుముఖంపడుతుంది.చలిజ్వరమయితే అడివి జీలకర్రను తీసుకొని బాగా పొడిచేసి, నెయ్యి కలిపి నీటిలో మరగపెట్టాలి. సగానికిసగం నీళ్ళు ఇంకిపోయేవరకు మరిగించాలి. దానిలో అదేకొలత ఆవుపాలు చేర్చి తీసుకోవాలి. ఈ విధంగా దినానికి రెండు సార్లు తీసుకుంటూ ఉండాలి._*

*# _అజీర్ణం–వాంతులు– బేదులు ":_*

*_అజీర్ణం అనేక రకాల వ్యాధులకు మూలం. ఇదే వాంతులు భేదులు. జ్వరం, తలనొప్పి-ఇంకా ఎన్నో రోగాలకు కారణం కావచ్చు. నీళ్ళలో నిమ్మకాయ రసాన్ని చేర్చి తాగితే అజీర్ణం తగ్గుతుంది. శొంఠి, జీలకర్రబాగా పొడిచేసి, మరిగే నీళ్ళలో ఈ పొడివేసి ఐదునిముషాలు ఉంచి. వడబోసి తాగితే అజీర్ణంపోతుంది. శొంఠిబదులు అల్లాన్ని కూడా వాడవచ్చు. ఎర్రగడ్డను గాని, తెల్లగడ్డనుగాని కాల్చితింటే అజీర్ణం పోతుంది. పొదిన ఆకుతో కషాయం చేసుకొని తాగినా అజీర్ణం తగ్గుతుంది. పొట్టఉబ్బరం కూడా తగ్గుతుంది._*

*_భోజనం ఎక్కువై పొట్ట ఉబ్బరిస్తే వెచ్చని నీటిలో చక్కెర, నెయ్యి వేసుకొని తాగితే తగ్గుతుంది. ప్రతిదినం ఆహారంలో తెల్లగడ్డ (వెల్లుల్లి) వాడుకుంటే జీర్ణశక్తి ఎక్కువవుతుంది._*

*_పసిపిల్లలు పాలుకక్కుతుంటే పాలలో కొంచెం లేత కొబ్బరినీళ్ళుకలిపి ఇవ్వాలి. వాంతులు ఎవరికైనా నిమ్మకాయర సం మంచిది. ఈ రసంలో చక్కెర కలుపుకోవచ్చు. లేదా జీలకర్ర, నాలుగయిదు ఏలకులు పొడిచేసి కలుప వచ్చు. నలిపిన ఎర్రగడ్డను వాసన చూస్తూ ఉంటే వాంతి తగ్గుతుంది. కొంచెం చింతపండు, జీలకర్రకలిపితింటే వాంతి వచ్చేటట్లుండడం తగ్గుతుంది._*

*_వాంతులు బేదులు అపుతుంటే దోసకాయ తురిమి శుభ్రమైన వస్త్రంలో ఉంచి పిండి రసంతియ్యాలి. దానిలో కొంచెం నిమ్మరసంకలిపి దినానికి రెండుసార్లు తీసుకోవాలి. అజీర్ణంవల్ల విరేచనాలవుతుంటే జాజికాయ చూర్ణాన్ని అరటిపండుతోబాటు తినాలి. నీళ్ళభేదులకు మంచినేరేడు పళ్ళు తెచ్చి నీళ్ళలో పిండి దానిలోకొంచెం ఉప్పువేసి తాగితే తగ్గుతాయి. అతిసారం ఒక్కొక్క సారి ప్రాణాంతకం కావచ్చు. అతిసారానికి జానపద ఔషధాలు బోలెడన్నిఉన్నాయి. వీటిలో చాలామందులు చక్కగా పని చేస్తాయి కూడా. లేత జామకాయ కషాయం చేసి మజ్జిగతోబాటు తీసుకోవాలి. ఏ కషాయమూ చేసే ఓపికలేకున్నా మెంతులు నోట్లో వేసుకుని మజ్జిగ తాగితే రక్తవిరేచనాలు, బంక విరేచనాలు కూడా కట్టుకుంటాయి. దానిమ్మచెక్కుతో కషాయం తయారుచేసి దానితోబాటు మెంతుల కషాయంతో కలిపి సేవించినా మంచిది. నిమ్మకాయరసాన్ని బాగా మాగిన ఆరటిపండు తేనె కలిపి తింటే మంచిది._*

*_# మరి కొన్ని వ్యాధులకు మంచిమందులు ":_*

*_జుట్టురాలిపోతుం టే దాసానిపువ్వులు కాగే కొబ్బరి చమురులో వేసినూనె తయారుచేసుకొని దాన్ని పూసుకోవాలి. నిమ్మకాయ, నువ్వులనూనె కలిపిపూసుకుంటే చుండ్రుపోతుంది. ప్రతిదినం నల్లవేప ఆకులను మూడునెలలవరకు తింటూ ఉంటే మధుమేహం నయమవుతుందంటారు. నేల ఉసిరిగ ఆకులను కాయలతో సహానలగగొట్టి, పసరుతీసి మజ్జిగలో తీసుకుంటే పచ్చకామెర్లు నయమవుతాయి. 
లేత వేపాకు నూరి, కొంచెం పసుపు, జీలకర్ర, మిరియం వేసి ఉండలుగా చేసి మింగించడం ప్రతిపల్లెటూర్లో, ప్రతిఇంట్లో ఉన్నదే, దీనివల్ల కడుపులోఉండేకొన్నిరకాల పురుగులు వగైరా నాశనమవుతాయి. బొప్పాయి కాయ పైన తోలుతీసి, సన్నసన్న బద్దలుగా కోసి చక్కెరకలిపి తింటే కొన్ని రకాల పురుగులను సంహారం చెయ్యవచ్చు. 
మూలవ్యాధికి  అప్పుడేపిండిన ఆవుపాలు నురగతోసహా కొంచెం నిమ్మపండు పిండుకొని తాగితే మంచిది._*

*_అమ్మవారు అనే పేరుతో పిలిచే అన్నిరకాల సాంక్రమికరోగాలకూ వేప ఆకులను, ఇగుళ్ళను, పువ్వులను వైద్యంగా వాడడంలో జానపదుల అనుభవం తెలుస్తున్నది. నేటికీ వేపచెట్టే చక్కని రోగనిరోధకశక్తిగల సాటిలేని ఔషధంగా పనికివస్తున్నది._*

No comments:

Post a Comment