త్రిఫల ఉపయోగాలు
*త్రిఫల చూర్ణం ఒక ముక్కలో చెప్పాలంటే ఈ చూర్ణం ప్రతి రోజు తీసుకుంటే డాక్టరుతో పని ఉండదు.*
*''మనిషి ఆరోగ్యం''.. వాత, పిత్త, కఫ, లక్షణాలు పెాచ్చు తగ్గులపైనే ఆధారపడి ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది.ఈ పెాచ్చు తగ్గులను సమతూకం చేయగలిగిన తిరుగులేని ఔషధమే త్రిఫల చూర్ణం.*
*#కరక్కాయ #తానికాయ #ఉసిరికాయల మిశ్రమమే* *త్రిఫల చూర్ణం.*
*త్రిఫల చూర్ణంలో ఒక భాగం కరక్కాయ రెండు భాగాలు తానికాయ నాలుగు భాగాలు ఉసిరికాయ చూర్ణం ఉండాలి.*
*కొంతమంది ఈ మూడింటిని సమభాగాలుగా కూడా వాడుతుంటారు. మార్కెటలోని కొన్ని కంపెనీలు ఈ మూడు కాయలను లోపల విత్తనాలతో సహ చూర్ణం చేసి అమ్ముతున్నారు. విత్తనాలు కాకుండా పై పెచ్చులతో చేసిన *త్రిఫలచూర్ణం* *ప్రభావవంతమైంది.*
*ఇది సమస్త రోగాలను తగ్గించే అద్భుతమైన శక్తి కలది.*
*జబ్బులు ఉన్నా లేకపోయినా ఒక నెల పాటు ఈ చూర్ణాన్ని రెగ్యులర్గా వాడి, మీ శరీరాన్ని గమనించండి. మీరు ఆశ్చర్య పోయే ఫలితాలు కనిపిస్తాయి. మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.*
*అంతేకాదు త్రిపల చూర్ణానికి శరీరంలో వేడిని తగ్గించే గుణం కూడా ఉంది.*
*అలాగే త్రిఫల చూర్ణం కంటిచూపును పెంచుతుంది. జీర్ణశక్తి,ని ఆకలిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గుతుంది, వాతం నొప్పులు తగ్గుతాయి, చర్మ సమస్యలను, లివర్, ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.*
*"ఉపయోగించే విధానం":-*
*ఉదయాన్నే పరిగడుపున అర గ్లాస్ గోరువెచ్చని నీటిలో చెంచా త్రిపల చూర్ణం వేసుకుని తాగాలి. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు కూడా తాగాలి.*
💠💠
No comments:
Post a Comment