వేసవిలో ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. చెమట రూపంలో ఎక్కువగా శరీరంలోని నీరు విసర్జన కావడంతో నీరసం వచ్చేస్తుంది. దీన్ని అధిగమించేందుకు ఎక్కువగా ద్రవహారం తీసుకోవాలి.
*మజ్జిగ* : రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ తాగుతుండటం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు, దగ్గును నివారించేందుకు మజ్జిగ దోహదం చేస్తుంది.
*పుదీనా* . ఇది వేసవిలో బాడీ టెంపరేచర్ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
*ఉల్లిపాయలు*: ఉల్లిపాయ కర్రీస్, సలాడ్స్, రైతాలు, చట్నీస్లో చేర్చుకోవడం వల్ల మీ శరీరాన్ని చల్లగా మార్చుతుంది . ఉల్లిపాయల్లో క్విర్సిటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక నేచురల్ యాంటీ అలర్జిన్ . వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది.
* పుచ్చకాయ* పుచ్చకాయ లో 90శాతం నీళ్లు ఉంటుంది . వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్లో ఉంచుతుంది.
*జామకాయ* : జామకాయలో విటమిన్ 'సీ' పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి వేసవిలో ఆరోగ్యంగానూ, శక్తిమంతం గానూ ఉంచు తాయి. జామకాయలో ఉండే ప్రోటీన్లు ఎక్కువ శక్తిని అందిస్తాయి.
*కొబ్బరి బోండాం*: శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి బోండాం నీరు దోహదం చేస్తుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చర్మ రుగ్మతలనుs పారదోలుతుంది. శరీరంలోని టాక్సిన్స్ను నివారిస్తుంది.
*నిమ్మకాయ* : శరీరంలోని విషాలను బయటకు పంపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
*కీరదోసకాయ* : కీరదోసకాయలో పోషక విలువలు సమృద్ధిగా లభ్యమ వుతాయి. వేసవిలో ఈ కాయను తీసుకోవడం చాలా శ్రేష్టం. దీనిని సలాడ్గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత తేమ అంది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.
*ఫైనాపిల్* : ఇందులో నీటితో కూడిన యాంటి ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉం టుంది. కాబట్టి ఫైనాపిల్ తరచూ తీసు కోవడం ఉత్తమం. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి
No comments:
Post a Comment