కీరదోస తింటే... పాంక్రియాస్ పనిచేస్తుంది!
కీరదోసలో 96 శాతం నీరే. ఈ నీరు ఎండా కాలంలో దేహాన్ని డీహైడ్రేషన్ కు గురికా కుండా కాపాడు తుంది. దేహంలోని టాక్సిన్సన్ను బయటకు పంపేస్తుంది. కాబట్టి ఏడాదంతా తినవచ్చు.
• ఇందులో పొటా షియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్దీకరి స్తాయి. హైబీపీ అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోస కాయను తినడం చక్కటి మార్గం.
• ఇందులోని ' కె' విటమిన్ ఎమకలు కీళ్ల పనితీరును మెరుగుపరు స్తుంది. న్యూరాన్ల పనితీరును మెరుగుపరిచి అల్జీమర్స్ (మతిమ రుపు) సమస్యను నివారిస్తుంది.
• కీరదోస ... గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కడుపులో లద్దెపురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్య లను నివారిస్తుంది.
• ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీర దోస పరిష్కరిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు.
• బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు.
No comments:
Post a Comment