*మధుమేహానికి చూర్ణం తయారీ విధానంఅవగాహనా కోసం వైద్య నిలయం సలహాలు*
1. పొడిపత్రి మధుమేహం చూర్ణంలో ఇదే ప్రథమం. ఈ చూర్ణం 100 గ్రాములు తీసుకోండి.
2. నేరేడు పండ్లు వీటిని లోపల విత్తనంతో సహా ఎండబెట్టి చూర్ణం చేయాలి. ఈ నేరేడు చూర్ణం 50 గ్రాములు తీసుకోండి.
3. తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది షుగర్ వల్ల అనేక సమస్యలను తగ్గిస్తుంది కనుక తులసి 50 గ్రాములు తీసుకోండి.
4. తిప్పతీగ గురించి చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని ఆయుర్వేదంలో అమృతంతో పోలుస్తారు షుగరకి చాలా అవసరం అందుకే తిప్పతీగ చూర్ణం 50 గ్రాములు తీసుకోండి.
*5. కాకరకాయలను చూడగానే ఇబ్బందిగా ముఖం పెట్టకండి అన్ని చూర్ణాలను కాంబినేషన్లో కలిపిన తర్వాత ఈ చూర్ణం మరీ అంత చేదుగా ఏమీ ఉండదు. అయినా తీపి రోగాన్ని తగ్గించాలంటే విరుగుడు చేదుగా అందుకే కాకరకాయ 50 గ్రాములు తీసుకోండి.*
6. నేలవేము షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తూనే మంచి బలాన్ని ఇస్తుంది ఈ చూర్ణం కూడా 50 గ్రాములు తీసుకోండి.
*7. వేప షుగర్ కంట్రోలకి మరో ముఖ్యమైన చూర్ణం. ఇది రక్తశుద్ధి కూడా చేసి చర్మరోగాలను తగ్గిస్తుంది 50 గ్రాములు తీసుకోండి.*
8.డయబెటిస్ను సహజంగా కంట్రోల్ చేసే ఔషధాల్లో మెంతు చూర్ణం ముఖ్యమైనది 50 గ్రాములు తీసుకోండి.
9.దాల్చని ఎన్నో ఔషధగుణాలను కలిగి ఉంది. షుగర్ వ్యాధిలో వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది 25 గ్రాములు తీసుకోండి.
*10. అడవి జిలకర లేదా చేదు జీలకర గా పిలిచే ఈ చేదు జీలకర 25 గ్రాములు తీసుకోండి ఇది షుగరను తగ్గించడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది.*
11. కస్తూరి పసుపు ఇదే రక్తశుద్ధి చేస్తూనే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఇది పనిచేస్తుంది ఈ చూర్ణం 25 గ్రాములు తీసుకోండి.
*12. త్రిపలాలు అంటే ఉసిరి కరక్కాయ తానికాయల ఈ మూడింటిని సమభాగాలుగా 50 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని తీసుకోవాలి.*
*#తయారు చేసే విధానం:-*
పైన చెప్పిన విధంగా ఈ 12 క్వాలిటీ కలిగిన చూర్ణాలను తీసుకుని వాటిని ఒక పాత్రలో వేసి అన్ని చూర్ణాలు సరిగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఏదైనా చూర్ణాలు దలసరిగా లేదా పీచు ఉన్నట్లు అనిపించినా మొత్తం చూర్ణాన్ని జల్లెడ పట్టుకొని ఆ చూర్ణాన్ని ఒక మంచి కాళీ సీసాలో నిల్వ చేసుకోవాలి.
*#తీసుకునే విధానం:-*
ఈ చూర్ణాన్ని మొదటి నెల ఉదయం ఒక చెంచా రాత్రి ఒక చెంచా భోజనానికి ముందు గోరువెచ్చని నీటిలో లేదా మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు 2నెల నుంచి షుగర్ ఎక్కువ ఉన్నవాళ్లు రెండు చెంచాలు తాగాలి.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి అనుకునేవారు ఇది ప్రకృతి ఇచ్చిన వరం.
నలుగురికి ఉపయోగపడే పోస్టులను షేర్ చేసి తెలియజేయండి
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://fb.me/a8WXRWTD6
No comments:
Post a Comment