Tuesday 11 April 2023

సుదర్శన క్రియ అంటే ఏమిటి?

*🌸సుదర్శన క్రియ అంటే ఏమిటి?*🌸

*🌺సుదర్శన క్రియ ఒక రహస్యము!*🌺

       మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండే ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన జీవితానికి ఒకే అద్భుత రహస్యం!
మనం పుట్టిన తర్వాత మొట్ట మొదటి సారి ఒక శ్వాస లోనికి తీసుకున్నాం.శ్వాస లో ఎన్నో రహస్యాలు దాగి వున్నాయి. సుదర్శన క్రియ అనేది ఒక లయలో శ్వాస తీసుకుని దీని ద్వారా మన శరీరాన్ని, మనసును మరియు భావోద్వేగాలను సామరస్యంగా తీసుకు రాగల ఒక సులభమైన, శక్తివంతమైన ఒక ప్రక్రియ. ఒత్తిడి ని నిర్మూలించి, అలసటని దూరం చేసి, కోపం, నిరాశ వంటి చెడు అనుభూతులనుంచి శరీరాన్ని, మనసును బయటకు తీసుకు రాగలదు. మన జీవనం యొక్క లోతైన రహస్యాలను సైతం బయటకు తీసుకు రాగలదు.

ప్రతి నిత్యం ఆరోగ్య కరమైన శ్వాస పీలుద్దాం!
శ్వాస మన జీవనానికి అన్నిటికన్నా ముఖ్య మైన మూలం. ప్రాణశక్తి శరీరానికి మనసుకు ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరమైనది. ఎప్పుడైతే ప్రాణశక్తి మనలో ఎక్కువగా వుంటుందో, మనకు ఏంటో ఆరోగ్యకరంగానూ, ఉత్సాహంగానూ,ఉషారుగానూ ఉండగలం. సుదర్శన క్రియ మనలోని 90% వ్యర్థాన్ని దానితో పాటు లోపల ఉన్న ఒత్తిడిని ఊపిరి ద్వారా వెలివేయడానికి ఉపయోగ పడుతుంది.

ప్రతినిత్యం  సుదర్శన క్రియ చేయటం వల్ల మనకు మంచి ఆరోగ్యం ఉండటమే కాక, వైద్యపరమైన చిక్కులను లేకుండా ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితం కలకాలం ఉండేలా చేస్తుంది.

శ్వాస సరిగ్గా పీలుద్దాం, జీవిత కాలం ఆనదంగా ఉందాం!
మీకు తెలుసా! సుదర్శన క్రియ యొక్క రహస్యమైన శక్తి మన చిరునవ్వును ఆనదాన్ని కలకాలం ఉంచుతుంది.
కోపం,చికాకు,నిరాశ మరియు భాధల నుండి  మనం ఎన్నో సార్లు  బయటకు రావటానికి ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే సుదర్శన క్రియ లోని శ్వాస ప్రక్రియ ద్వారా వివేకంగా వీటినుండి ఎలా బయటకు రావచ్చో   మనం చూద్దాం.ఈ ఇబ్బందులు మళ్ళీ మన జోలికి రావు.

కోపం,చికాకు,నిరాశ, భయం,ఈర్ష్య మొదలైనవి లేకుండా ఆనందం, చిరునవ్వు,ఆనదమయమైన్ జీవితం ఎల్లప్పుడూ ఉంటె ఎంత బాగుంటుందో ఒక సారి ఆలోచించండి! స్నేహంలో, బందుత్వాల్లో, వ్యాపారంలో,గృహస్త జీవితంలో ఉన్న ఆనందం అనేది మనయొక్క ఒక అంశం మాత్రమే, అయితే మనలో ఇంకా ఎన్నో విషయాలు ఇమిడి aఉన్నాయి.పూర్తి వైద్య సలహాలు లింక్స్ 
https://fb.watch/jRmfNxCCJV/?mibextid=Nif5oz

సుదర్శన క్రియ శ్వాస ప్రక్రియ చేసి చూడండి,మీ లో చిరకాలం నిలిచి ఉండే ఆనదాన్ని, చిరునవ్వును వెలికి తీసుకురండి!

*🌹సుదర్శన క్రియ లోని నిగూడత ఏమిటి!*

ప్రతి రాత్రి తరువాత ఒకే ఉదయం దాగి ఉంది. అలాగే ప్రతి చెట్టూ తన పాత ఆకులను రాల్చి కొత్త ఆకులతో మళ్ళీ వికసిస్తూ చూస్తున్నాం. ఇది ప్రకృతిలోని లయ.

మనం కూడా ఈ సంసారంలో ఒక భాగం కనుక, మనలో కూడా సరిగ్గా ఇలాగే ఒక లయ ఇమిడి  ఉంది- శరీరానికి, మనసుకు మరియు  భావోద్వేగాలతో కూడుకొన్న ఒక లయ. ఎప్పుడైతే ఒత్తిడి వల్ల గానీ లేదా అనారోగ్యం వల్ల గానీ ఈ జీవన లయ గాడి తప్పుతుందో, అప్పుడు మనము ఇబ్బంది కరంగానూ,అసంతృప్తి తోనూ సతమతమవుతూ ఉంటాం. అయితే సుదర్శన క్రియ మనలో ఆ లయను తిరిగి తీసుకువచ్చి శరీరం, మనసు లోని భావోద్వేగాలను తిరిగి దాని దారిలో పెడుతుంది.దీనితో మనం మళ్ళీ ప్రేమానురాగాలతో అందరితోనూ మంచి సంభందాలు కలిగి సంతోషమైన జీవనం తో ముందుకు వెళ్లగలము.

 ఇది మనలోని శారీరక, మానసిక భావోద్వేగ మరియు సామాజిక ఆనందానికి దోహద పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల ప్రజలు సుదర్శన క్రియ యొక్క ప్రయోజనాలను పొంది, తమ జీవితాలను ఒక ఆనంద సాగరం లాగ మలుచుకొన్నారు.

సుదర్శన క్రియ ఎందుకు వెలకట్టలేనిది !
మనకు మంచి ఆరోగ్యము మరియు పరిపూర్ణ ఆనందము ఎలాగైతే వెలగట్టలేమో, అలాగే ఇది కూడా!
శ్వాస లో  మనకు అర్థం కానీ ఎన్నో రహస్యాలు ఇమిడి ఉన్నాయి.మనమందరం రోజూ 20 నిమిషాల విలువైన సమయాన్ని దీని కోసం వెచ్చిస్తాం!

శ్వాసలోని రహస్యాలు తెలుసుకొందాం!

మీరు మీ కోసం ఈ అవకాశం సద్వినియోగ పరచుకోండి!

మనకు మంచి ఆరోగ్యము మరియు పరిపూర్ణ ఆనందము ఎలాగైతే వెలగట్టలేమో, అలాగే ఇది కూడా!
శ్వాస లో  మనకు అర్థం కానీ ఎన్నో రహస్యాలు ఇమిడి ఉన్నాయి.మనమందరం రోజూ 20 నిమిషాల విలువైన సమయాన్ని దీని కోసం వెచ్చిస్తాం!

*శ్వాసలోని రహస్యాలు తెలుసుకొందాం!*

ఆత్మ విశ్వాసం పెరిగేందుకు ఇలా చేయండి ఆధునిక యోగ ప్రక్రియల్లో సుదర్శన క్రియ ఎంతో విశిష్టమైనది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో భాగంగా పండిట్ రవిశంకర్ ప్రపంచానికి పరిచయం చేసిన అరుదైన యోగ ప్రక్రియ ఇది. సుదర్శన క్రియ చేయడం వల్ల ఉత్సాహం, జ్ఞాపకశక్తి, ఆలోచనశక్తిని పెంచే ప్రక్రియగా దీనికి గుర్తింపు ఉంది. sudarshan kriya సాధనా ప్ర‌క్రియ‌ఉజ్జయి, భస్రిక, ఓంకార ఉచ్చారణ, క్రియ అంటే 4 ప్రక్రియల సమాహారమే సుదర్శన క్రియ. వాటి సాధనా ఎలా చేయాలో ఈ కింద తెలుసుకుందాం..ముందుగా నిటారుగా వజ్రాసనంలో కూర్చొని కళ్లు మూసుకొని గట్టిగా శ్వాస తీసుకోవాలి. తర్వాత ఎనిమిది అంకెలు లెక్కపెట్టి నెమ్మదిగా శ్వాస వదలాలి. మళ్లీ శ్వాస తీసుకొని 8 అంకెలు లెక్కపెట్టాలి. ఇలా పలుమార్లు చేయాలి. దీన్నే ఉజ్జయి అంటారు.రెండవది భస్రిక. అంటే.. వేగంగా శ్వాస తీసుకొని వదలడం. నిమిషానికి 30 సార్లు శ్వాస తీసుకొని వదలాలి. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ సార్లు శ్వాస తీసుకోవటం సాధన చేయాలి. రోజుకు 3 సార్లు ఓంకార ఉచ్చారణ.చేయాలి. ఆ ధ్వని బొడ్డునుంచి వచ్చేలా చూసుకోవాలి. ఇది మానసిక శుద్ధికి దోహదపడుతుంది.చివరిది క్రియ. ఇది శ్వాస యొక్క ఆధునిక రూపం. ఇందులో సుమారు 45 నిముషాల పాటు నెమ్మదిగా ఉచ్వాస నిశ్వాసలు తీసుకొంటారు.ప్రధాన ప్రయోజనాలుశారీరక ఒత్తిడి తగ్గి చురుగ్గా పనిచేయగలుగుతారు. రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.కంటినిండా నిద్రపడుతుంది.మానసిక అశాంతి, ఆందోళనల నుంచి విముక్తి లభిస్తుంది. క్రమబద్ధమైన జీవనం అలవడుతుంది.ఇంటా బయటా చక్కని మానవ సంబంధాలు ఏర్పడటమే గాక బలపడతాయి.ఇతరులను సరిగా అర్థం చేసుకునే సామర్ధ్యం, సహనం, ఆత్మవిశ్వాసం సిద్ధిస్తాయి. గమనిక:సుదర్శన క్రియను భోజనం చేసిన వెంటనే తప్ప ఏ సమయంలోనైనా సాధన చేయవచ్చు. కొత్తగా దీన్ని సాధన చేసేవారు గురు ముఖతా నేర్చుకోవటం మంచిది. గర్భిణులు,మద్యపానం, మత్తు పదార్థాలు తీసుకొనేవారు దీన్ని  చేయకూడదు.
*ధన్యవాదములు🙏*
 *మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
      మీరు మీ కోసం ఈ అవకాశం సద్వినియోగ పరచుకోండి! అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

No comments:

Post a Comment