*మూర్ఛలు (ఫిట్స్) #నివారణకు_తీసుకోవాలిసిన_జాగ్రత్తలు_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు - Epilepsy*
మూర్చ అనునది చాలా కాలం పాటు ఉన్న లేక దీర్ఘ-కాల మెదడు రుగ్మత, అసాధారణ మెదడు చర్య వలన ఏర్పడుతుంది, ఈ చర్య మూర్చలు, అసాధారణ అనుభూతులు మరియు స్పృహ కోల్పోవడం వంటి వాటికి దారితీస్తుంది. మూర్చ అనునది వయస్సు, లింగము, జాతి లేక జాతి నేపధ్యముతో సంబంధము లేకుండా ఎవరి పైన అయినా ప్రభావమును చూపిస్తుంది. మూర్చ యొక్క లక్షణాలు అనునవి ప్రారంభములో స్వల్పముగా ఉంటాయి, నిదానముగా అవయవాల యొక్క హింసాత్మక కుదుపులకు దారితీస్తాయి. తక్కువ-ఆదాయ మరియు మధ్య-అదాయ దేశాలలో 75% ప్రజలు తగినంత చికిత్సను పొందలేరు మరియు వీరు సామాజిక నిందకు గురవుతారు మరియు ప్రంపంచము లోని అనేక ప్రాంతాలలో దీనిపై వివక్ష ఉంది. మూర్చ యొక్క చికిత్స యాంటిపైలెప్టిక్ మందులను కలిగి ఉంటుంది, మరియు 70% మంది ప్రజలు ఈ మందులకు సానుకూలముగా స్పందించారు. మందులు ఉపశమనాన్ని అందివ్వడములో విఫలమయిన సందర్భాలలో, శస్త్ర చికిత్స అనునది మూర్చను నియంత్రించుటకు సహాయం చేస్తుంది. కొంత మంది వ్యక్తులు జీవితకాల చికిత్సను తీసుకోవాలి, వాటితో పాటు ఈ ట్రిగ్గర్ల కారకాలు తొలగించాలి, వాటిలో మెరిసే కాంతులు, పెద్ద శబ్దలు, నిద్ర లేమి మరియు అదనపు ఒత్తిడి అనునవి అత్యంత సాధారణ కారకాలువివరాలు కు లింక్స్ లో చూడాలి
https://m.facebook.com/story.php?story_fbid=2708565202741681&id=1536735689924644
*మూర్ఛలు (ఫిట్స్) అంటే ఏమిటి?*
మూర్చ అనునది ఒక సాధారణ నరాల రుగ్మత, ఇది ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తముగా 50 మిలియన్ల కంటే ఎక్కువ మంది జనాభాను ప్రభావితం చేస్తుంది. మధ్య నుండి తక్కువ-ఆదాయము గల ప్రాంతాలలో ఉన్న ప్రజలలో 80% కంటే ఎక్కువ మంది ప్రజలు మూర్చ చేత ప్రభావితం చేయబడుతున్నారు. ఇది ఈ విధముగా వర్గీకరించబడింది మూర్చలు, ఇది మొత్తం శరీరమును లేక శరీరము యొక్క కొంత భాగమును నియంత్రించలేని కుదుపులకు గురిచేస్తుంది, మరియు కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం మరియు మూత్ర నాళము పైన నియంత్రణ కోల్పోవడం మరియు విరేచనాలు వంటి లక్షణాలను కలిగిఉంటుంది. మూర్చ అనునది మెదడు కణాలలోని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ యొక్క అదనపు విడుదల కారణముగా ఏర్పడుతుంది
*మూర్ఛలు (ఫిట్స్) యొక్క లక్షణాలు*
లక్షణాలు అనునవి మూర్చ ఏర్పడుటకు కారణమైన మెదడు పాల్గొన్న ప్రాంతము పైన ఆధారపడుతుంది. లక్షణాలలో ఇవి ఉంటాయి:
స్పృహ లేకపోవడం
అయోమయము
ఒక బిందువు వద్ద మొదలుపెట్టుట
చేతులు మరియు కాళ్ళ చలనముల కుదుపు
చూపు, వినికిడి మరియు రుచి కలిగించు ఇంద్రియాలలో ఇబ్బందులు
భయం మరియు ఉత్కంఠ వంటి భావనా మార్పులు.
మూర్ఛలు (ఫిట్స్) యొక్క చికిత్స
మూర్చ యొక్క చికిత్స ప్రధానముగా వీటిని కలిగి ఉంటుంది:
యాంటీ-ఎపిలెప్టిక్ మందులు
యాంటీ-ఎపిలెప్టిక్ మందులు అనునవి సాధారణముగా చికిత్స కొరకు ఎంపిక చేయబడినవి. 70% కేసుల కంటే ఎక్కువైన కేసులలో మూర్చలు లేక వాటి లక్షణాలను నియంత్రించడానికి లేక వాటి నుండి ఉపశమనమును పొందడానికి ఈ మందులు సహాయపడతాయని నివేదికలు చెబుతున్నాయి. మెదడు ద్వారా విడుదలచేయబడిన రసాయనాల మొత్తమును మార్చడము ద్వారా మూర్చ యొక్క తీవ్రతను తగ్గించడానికి ఈ మందులు సహాయపడతాయి.
*మూర్ఛలు (ఫిట్స్) #కొరకు_అలౌపతి_మందులు*
మూర్ఛలు (ఫిట్స్) నివారణకు కొన్ని అలౌపతి మందులు మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు మేరకు మాత్రమే వాడాలి లేకపోతే మెడిసన్ డోస్ మరియు సైడ్ ఎఫెక్ట్ రావచ్చు జాగ్రత్త
*#మూర్చ_వ్యాధి_నివారణ_ఆయుర్వేదం_లో_నవీన్_సలహాలు*
*మూర్చ వ్యాధి ---- నివారణ*
*మూర్ఛ_వ్యాధి – వైద్యం*
మూర్ఛ వ్యాధి అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకుసంబంధించిన పరిస్థితి. మూర్ఛవ్యాధిని మూర్ఛల అనారోగ్యం అని కూడా అంటారు. కనీసం రెండు మూర్ఛలు ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత సాధారణంగా రోగ నిర్ధారణ చేయబడుతుంది.మూర్ఛ వ్యాధి మెదడుకు ఏర్పడిన ఒక గాయంగా పరిగణించవచ్చు. కానీ చాలా సార్లు కారణం ఏమిటో తెలియదు. మూర్ఛ వ్యాధి ఏ తరహావి అన్నది లేదా అవి ఎంత తీవ్రమైనవి అని బయట ఎవరూతెలుసుకోలేరు.
*#మూర్ఛ_వ్యాధి_ఎవరికి_వస్తుంది…?*
ఒక వ్యక్తిలో మూర్ఛ వ్యాధి ఏ వయస్సులోనైనా రావచ్చు. 0.5 శాతం నుండి 2 శాతం వరకు ప్రజలలో తమ జీవిత కాలంలో మూర్ఛ వ్యాధి వృద్ది అవుతుంది. మన దేశంలో దాదాపు 10 మిలియన్ ప్రజలకు ఈ వ్యాధి ఉంది. దీని అర్థం ప్రతి 1000 మందిలో 10 మందికిఉందన్న మాట.
*మూర్ఛ_వ్యాధిని_కలిగించేది_ఏది…?*
మెదడులో విద్యుత్ కార్యకలాపాల ను ప్రారంభింపచేసే అంశాలకు, దానిని నియంత్రించే అంశాలకు మధ్య ఒక సున్నితమైన సమతుల్యంఉంది. విద్యుత్ కా ర్యకలాపాలను వ్యాపింపచేయడాన్ని పరిమితం చేసే వ్యవస్థలు కూ డాఉంటాయి. మూర్ఛ వచ్చిన సమయంలో ఈ పరిమితులు విచ్చి న్నమవుతాయి. దీంతో పాటు విపరీతమైనవిద్యుత్ విడుదలలు సం భవించవచ్చు. ఒక వ్యక్తికి కనీసం ఈ మూర్ఛలలో రెండు వచ్చినప్పుడు దానిని మూర్ఛ వ్యాధి అని అంటారు.
*#వ్యాధి_రావడానికి_కారణాల*
జ్వరం, పుట్టుకతోవచ్చే లోపాల (కష్టమైన ప్రసూతి) వల్ల మూర్ఛ వ్యాధి రావచ్చు. మెదుడలో లోపాలు లేదామెదడులో కంతులు, ఇన్‌ఫెక్షన్‌లు (మెనింజైటీస్), వేడి నీళ్లతో తలంటుకోవడం, మందుల పరస్పర చర్యల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా మద్యపానం, నిద్రలేకపోవడం, ఆకలితోమాడడం, తారుమారు చేసే ఉద్రిక్తత, రుతుక్రమాల సమయాల్లో లోపాల మూలంగా ఈ వ్యాధి వస్తుంది.
*చికిత్సా_సమయంలో_ముందు_జాగ్రత్తలు…*
వ్యాధి గురించి డాక్టర్‌కు సవివరంగా సమాచారాన్ని తెలియ జేయాలి.పుట్టుకతో గాయం, తలకు గాయం, నరాల వ్యవస్థ, కుటుం బచరిత్ర గురించి సమాచారాన్ని అందజేయాలి. మూర్ఛ వ్యాధిగల వ్యక్తికి ఒక రకం కన్నఎక్కువ మూర్చలు ఉండవచ్చు. మూర్ఛ వ్యాధి నియంత్రణకు, మూర్ఛలను గుర్తించడం, వైద్యపరమైన
చికిత్సలు జరిపించడం ఎంతో ముఖ్యం. డాక్టర్ సలహా ప్రకా రం మందులు తీసుకోవాలి.మందులను ఇంట్లో పెట్టుకొని నిర్దేశించిన మోతాదుల ప్రకారం వాటిని వాడాలి. ఏ బ్రాండ్‌మందులు బాగా పనిచేస్తాయో అవే మందులను వాడడం మేలు. ఇతర బ్రాండ్ల మందులను వాడకూడదు.మూర్ఛలు వచ్చే సమయాన్ని, ఇతర
పరిశీలనను ఒక డైరీలో ఎప్ప టికప్పుడు రాసుకోవాలి. కనీసం మూడు ఏళ్ల పాటు మూర్ఛలురాకుండా ఉండాలంటే మందులను క్రమం తప్పకుండా తీసు కోవాల్సి ఉంటుంది. డాక్టర్‌ఆమోదంతో వ్యాధిగ్రస్తులు టివి చూడవచ్చు. క్రీడలు, వినోదకార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.
చెయ్యకూడనివి…
మందుల వాడకంతో ఏర్పడే దుష్ర్పభావాలు లేదా మందును సహించకపోవడం వంటివాటిని వెంటనే డాక్టర్‌కు తెలియజేయాలి. ఉన్నట్లుండి మందులను ఆపివెయ్యకండి. ఇది ఒకనరాల సంబంధిత అత్యవసర పరిస్థితిని, స్టేటస్‌ఎపిలెప్టికస్‌ని తొందరగా తీసుకురావచ్చు. ఏకకాలంలో ఏవైనా ఇతర కొన్ని వ్యాధులు
ఉన్నప్పుడు, గర్భిణీగా ఉన్నప్పుడు లేదా ఇతరత్రా మందులను నిలిపివేయడం గానీ తగ్గించడం గానీ చెయ్యకండి. ఇవి నియంత్రించలేని మూర్ఛవ్యాధికి సామాన్య కారణాలు. మరీ కాం తివంతమైన దీపాలకు, బిగ్గరగా ఉండే ధ్వనుల నుండి తప్పించుకోండి. మూర్ఛ వ్యాధిఉంటే ప్రాణ హాని కలిగించని ఉద్యోగాల్లో చేరాలి. సరైన సురక్షిత ఉపకరణాలను ధరించండి.వాహనాలను నడపడం, స్వి మ్మింగ్ చేయకూడదు.ఎత్తులకు ఎక్కడం లేదా ఎత్తయిన చోట్ల పని చేయడం మంచిది కాదు. భారీ యంత్రాలతో లేదావిద్యుత్ ఉపకర ణాలతో పనిచేసే సమయంలో మూర్ఛ వస్తే హాని కలిగించవచ్చు.
*మూర్ఛ_వచ్చినప్పుడు_ఏం_చేయాలి…*
మూర్ఛను ఆపే ప్రయత్నం చెయ్యకండి. మూర్ఛ వచ్చిన సమయంలో బల వంతంగానోట్లోకి ఏమీ కుక్కకండి. తగినంత గాలి ఆడేవిధంగా చూడాలి. వాంతిని మింగకుండాఉండేందుకు పక్కకు తిరగాలి. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధి ఉన్నవారు వైద్యుని సలహా మేరకు అన్నీ పాటించవలసిన అవసరం ఉంటుంది.
#అపోహ
-మూర్ఛ వ్యాధి సాధారణం కాదు.
-మూర్ఛ వ్యాధి అంటువ్యాధి
-మూర్ఛ వచ్చిన వ్యక్తిని పట్టుకొని ఉండాలి
-మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మూర్ఛ వ్యాధితో పుట్టి ఉండాలి.
-మూర్ఛ వ్యాధి తెలివితేటలు లేనివారి చిహ్నం
-ఈ రోగులను దేవుడు ఆవహించి ఉంటాడు. వారిని పూజించాలి
-మూర్ఛ వ్యాధి ఉన్న వ్యక్తి కుటుంబంలో ఉండడం ఒక కళంకం కనుక ఈనిజాన్ని దాచి ఉంచాలి.
#నిజం
– మనదేశంలో ప్రతి 100 మందిలో 10 మందికి మూర్ఛ వ్యాధి ఉంది.
-మూర్ఛ వ్యాధి మరే వ్యక్తికి గాలి, ఆహారం, నీరు మరే మార్గం ద్వారా సంక్రమించదు.
– వ్యక్తిని నిర్భధించే ప్రయత్నం చేయ్యకండి. ఇది గాయం కలిగించవచ్చు. గట్టి, పదునైనవస్తువులను వేటినీ దగ్గరలో ఉంచకండి.తలకింద ఏమైనా మెత్తని వస్తువుని ఉంచాలి.
– ఎవరిలోనైనా గానీ ఏ సమయంలోనైనా మూర్ఛ వ్యాధి వృద్ధి కాగల అవకాశం ఉన్నప్పటికీ సాధారణంగా మొదట పిల్లల్లోనూ, యువకులలో ఇది కనిపిస్తుంది.
– మూర్ఛ వ్యాధి ఒక శారీరక స్థితేగానీ ఒక మానసిక వ్యాధిగానీ లేదాలోపంగానీ కాదు. మూర్ఛ వ్యాధి అసాధారణమైన తెలివితేటలు కలిగిన ప్రముఖ వ్యక్తులకున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
– మూర్ఛవ్యాధికి సంబంధించిన మూర్ఛ వచ్చినప్పుడు రోగులను అదుపులో పెట్టలేని విధంగాప్రవర్తిస్తారు. అయితే ఇది మానవాతీత శక్తికాదు. వారికి వైద్య చికిత్సలు జరిపించి అందరిలాగే చూడాలి.
– దురదృష్టవశాత్తు మూర్ఛ వ్యాధి ఉన్న వ్యక్తులు, కుటుంబాల పట్ల చిన్నచూపుచూస్తారు. ఇది సరైనది కాదు.
వెల్లుల్లి రేకల ముద్ద ---- 20 gr
నల్ల నువ్వుల పొడి ---- 20 gr
రెండింటిని కల్వంలో వేసి మెత్తగా మాత్ర కట్టుకు వచ్చేట్లు నూరాలి.
చిన్న పిల్లలకు ---- జొన్న గింజంత
పెద్ద పిల్లలకు ---- శనగ గింజంత
పెద్దలకు ---- బటాణి గింజంత
ఇవి ఎంత కాలమైనా నిల్వ వుంటాయి. ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వాడాలి
సమస్య ఎక్కువగా వుంటే పూటకు రెండు మాత్రలు వాడవచ్చు. ఎండా కాలంలో ఒకటి, వర్షా కాలంలో రెండు చొప్పున వాడవచ్చు.
21 జాజి కాయలు తెచ్చి మధ్యలో రంధ్రం చేసి దారం గుచ్చి రోగి మేడలో వేయాలి. ఈ వాసన పీలుస్తూ వుంటే మూర్చ వ్యాధి రాదు.
ఉత్తరేణి గింజల పొడిని నశ్యం లాగా పీల్చాలి. బొటన వేళ్ళను నొక్కి ఉంచాలి.
కఫం పెంచే పదార్ధాలు,, ఫ్రిజ్లోని పదార్ధాలు, పాలు,పెరుగు అసలే పనికి రావు.పాలు తాగవలసిన తప్పని పరిస్థితులలో పాలలో అల్లం, కలకండ కలుపుకొని తాగాలి. మజ్జిగలో అల్లం వేసి వాడుకోవచ్చు.
నువ్వుల నూనె మర్దన ముఖ్యముగా అరికాళ్ళకు ప్రతి రోజు తప్పనిసరి.
*మూర్చ --Fits -- నివారణ*
ప్రతి రోజు రెండు గ్రాముల వస పొడిని పాలల్తో గాని, తేనెతో గాని , నెయ్యితో గాని ఇస్తే రెండు నెలలలో మంచి అద్భుతమైన ఫలితం కనిపిస్తుది.
కూష్మాండ స్వరాసాన్ని తాగించాలి. శరీరం మీద వాపుల మీద గంధం పూస్తే తగ్గుతాయి.
నవీన్ సలహాలు -1
నాలుగైదు చుక్కల మునగాకు రసాన్ని ముక్కులో వేస్తే వెంటనే కోలుకుంటారు.
మీగడ తీసిన నాటు ఆవు పెరుగు
చిక్కని ఆవు పాలు
గోమూత్రం
గోమయ రసం
ఆవు నెయ్యి
ఒక్కొక్క పదార్ధాన్ని ఐదేసి గ్రాముల చొప్పున తీసుకుని గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఉదయం, సాయంత్రం ఆహారానికి ముందు సేవించాలి. ప్రతి రోజు ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు :-- నిప్పుకు నీటికి దూరంగా వుండాలి. ప్రక్కన ఎవరో ఒకరు తోడుండాలి. నిప్పును, నీటిని చూచినపుడు వాళ్ళ మెదడులో నాడులు ప్రకోపించి ప్రమాదాలు జరగవచ్చు.
నవీన్ సలహాలు -2 ప్రతి రోజు వస చూర్ణాన్ని తేనెతో తింటూ పాలు, పెరుగు ఎక్కువగా వాడుకుంటూ వుంటే క్రమేపి తగ్గిపోతుంది.
*#మూర్చ_వచ్చి_పడిపోతే_వెంటనే_స్పృహ_రావాలంటే*
రెండేసి చుక్కల ఉల్లిపాయల రసాన్ని ముక్కుల్లో వేయాలి.
*మూర్చ వ్యాధి --- నివారణ*
దోరగా వేయించిన శొంటి పొడి ---- చిటికెడు
" " జిలకర పొడి ---- "
నిమ్మ రసం ---- 5 టీ స్పూన్లు
కలిపి తీ సుకొవాలి.
2. పది, పదిహేను తులసి ఆకుల తో రసం తీయాలి. దానికి చిటికెడు సైంధవ లవణం కలపాలి.
దీనిని రెండు చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే లేచి కూర్చుంటారు
3. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని కలిపి కషాయం కాచి
దానికి బెల్లం కలుపుకొని తాగాలి .
4. త్రిఫల చూర్ణం --- అర టీ స్పూను
అతి మధురం చూర్ణం --- అర టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
పై మోతాదు చొప్పున ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు సేవించాలి .
5. సర్వాంగాసనం, మత్స్యాసనం వేయాలి.
మూర్చ రోగాలు ---నివారణ
ఉత్తరేణి గింజల బియ్యం ---- 100 gr
ఈ బియ్యాన్ని గోమూత్రం లో నానబెట్టాలి . ఉదయం ఎండబెట్టాలి . బాగా ఎండిన తరువాత దంచి వస్త్రగాయం
పట్టి నిల్వ చేసుకోవాలి . దీనిని చిటికెడు పొడిని ముక్కు పొడి ( నశ్యం ) లాగా పీల్చాలి . తరువాత రెండవ ముక్కుతో
కూడా పీల్చాలి .
#ఉపయోగాలు :-- ఉన్మాదం , పిచ్చి , పళ్ళు కొరకడం , వస్తువులు విసిరికోట్టడం వంటివి నివారింపబడతాయి .
వసకోమ్ముల పొడి --- 100 gr
దీనిని బాణలి లో వేసి స్టవ్ మీద పెట్టి నల్లగా , బూడిదలాగా మారేవరకు వేయించాలి . చల్లారిన తరువాత జల్లించి
పొడిగా వున్న సీసాలో నిల్వ చేసుకోవాలి .
వయసును బట్టి
పిల్లలకు ---- ఒకటి నుండి నాలుగైదు చిటికెలు
పెద్దలకు ---- ఐదు చిటికెల నుండి ఒక టీ స్పూను
వరకు వాడాలి . దీనిని నీటిలో కలుపుకొని తాగావచ్చును లేదా తేనెతో కలిపి సేవించవచ్చును .
#ఉపయోగాలు :--- దీనివలన సడన్ గా పడిపోవడం , పళ్ళు కొరకడం వంటి మూర్చ లక్షణాలు నివారింపబడతాయి .
మూర్ఛ వ్యాధి నివారణకు
. ఫిట్సు వచ్చి పడిపోయి , నోటినుండి నురుగు కారుతూ , పళ్ళు కోరుకుతూ , కింద పది గిలగిలా కొట్టుకుంటూ ఉంటే
సీతాఫలం చెట్టు యొక్క ఆకులను నలిపి వాసన చూపిస్తే సమస్య నివారింపబడుతుంది .
వాత ప్రభావం వలన అవయవాలు పట్టుకు పోవడం నరాలు బలహీన పడినపుడు
మిరియాలను నానబెట్టి బాగా మెత్తగా నూరి చచ్చుబడిన భాగం పై రుద్దితే యధాప్రకారము తయారవుతుంది . ఈ
విధంగా కొంతకాలం చేయాలి .
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
No comments:
Post a Comment