Monday 15 May 2023

సీమ_చింత_లేదిక

నమస్కారం...!
      మీకోసం ప్రతి రోజు ఈ శుభ సమయంలో ఒక్క ఆరోగ్య సూత్రం ... 

        #సీమ_చింత_లేదిక...

వేసవిలో సీమచింతకాయలు (గుబ్బకాయలు) బాగా వస్తాయి. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. అవేంటంటే...

బరువును అదుపుచేస్తాయి.
పోషకనిధులు, ఔషధ గుణాలు మెండు. అందుకే వీటిని మందుల తయారీల్లో వాడతారు.
వీటి చెట్టు బెరడు, ఆకులు, కాయలు, గింజలు ఆరోగ్య సమస్యలకు సంజీవినిలా పనిచేస్తాయి. పంటినొప్పులు, చిగుళ్లల్లో రక్తంకారడం, కడుపులో అల్సర్లను నివారిస్తాయి. ఆకుల నుంచి తీసిన పదార్థాలు గాల్‌ బ్లాడర్‌ సమస్యలను నిరోధిస్తాయి.
శరీరంపై రక్తస్రావాన్ని అరికడతాయి. గాయాలను మాన్పుతాయి.
రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
క్యాన్సర్లను అరికట్టే సుగుణాలు వీటిల్లో ఉన్నాయి.
మధుమేహవ్యాధిగ్రస్థులకు ఇవెంతో మంచివి.
బ్లడ్‌షుగర్‌, కొలెస్ట్రాల్‌లను ఇవి నియంత్రణలో ఉంచుతాయి.
వీటిల్లో చెడు కొలెస్ట్రాల్‌ ఉండదు. అందుకే ప్రతిరోజూ పావుకప్పు సీమచింతకాయల్ని ఆహారంలో చేరిస్తే మంచిది.
గర్బిణీలకు ఎనర్జీని అందిస్తాయి.
క్యాల్షియం కూడా అధికంగా ఉన్న వీటిని తినడం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
శరీరంలో వణుకు, నరాల అస్వస్థతను తగ్గిస్తాయి.
వీటిని తినడం వల్ల గుండె జబ్బులు దరిచేరవు.
లైంగికపరమైన అంటువ్యాధుల నివారణకు వీటిని వాడతారు.
విరేచనాల నివారణకు సీమచింతకాయల ఆకుల్ని ఉపయోగిస్తారు.
ఈ చెట్టు బెరడు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గుజ్జు దీర్ఘకాలిక డయేరియా, డిసెంటరీ, టిబి వంటి వాటికి వాడతారు.
గాయాలకు ఇవి యాంటిసెప్టిక్‌లా పనిచేస్తాయి.
చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
వెంట్రుకలు రాలకుండా కాపాడతాయి.
రకరకాల జ్వరాలను నిరోధిస్తాయి. మలేరియా, జాండి్‌సలను తగ్గిస్తాయి.
రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి.
నాడీ వ్యవస్థ బాగా పనిచేసేలా సహకరిస్తాయి.
నోటి అల్సర్లను తగ్గిస్తాయి.
మొటిమలు, యాక్నే రాకుండా నివారిస్తాయి. నల్లమచ్చలు పోగొడతాయి.
వీటిని ఆహారంలో చేర్చితే నిత్యయవ్వనుల్లా కనిపిస్తారు.
సహజసిద్ధమైన స్కిన్‌ మాయిశ్చరైజర్‌ కూడా.
వీటితో వంటలు కూడా చేస్తారు..

No comments:

Post a Comment