Tuesday, 16 May 2023

కిడ్నీలో రాళ్లను సర్జరీ ద్వారా తొలగిస్తారు. అయితే, కొన్ని సహజ పద్ధుతుల్లో కూడా రాళ్లను బయటకు పంపేయొచ్చు. అదెలాగంటే..

కిడ్నీలో రాళ్లను సర్జరీ ద్వారా తొలగిస్తారు. అయితే, కొన్ని సహజ పద్ధుతుల్లో కూడా రాళ్లను బయటకు పంపేయొచ్చు. అదెలాగంటే..

నీరు ఎక్కువ తాగండి: నీరు ఎంత ఎక్కువ తాగితే కిడ్నీలకు అంత మంచిది. దీనివల్ల వల్ల ఖనిజాలు, ఇతర మలినాలను బయటకు పంపడం కిడ్నీలకు తేలికవుతుంది. కిడ్నీలకు హాని కలిగించే అనవసర వ్యర్థాలను బయటకు పంపేందుకు నీరు సహకరిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు నీరు తాగడం వల్ల మూత్రం ద్వారా రాళ్లు బయటకు వెళ్తాయి. రోజూ 7-8 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి.

ఆపిల్ సీడర్ వెనిగర్: ఇందులోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీ రాళ్లను చిన్న ముక్కలుగా విడగొడుతుంది. మూత్రాశయం గుండా రాళ్లు బయటకు వెళ్లేందుకు సహకరిస్తుంది. ఆపిల్ సీడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కిడ్నీల నుంచి ట్యాక్సిన్లు బయటకు వెళ్లి శుద్ధి అవుతాయి. రాళ్లు తొలగిపోయే వరకు రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్‌ను వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం మంచిది.

కిడ్నీ బీన్స్: కిడ్నీ బీన్స్ కూడా మూత్ర పిండాల్లో రాళ్లను బయటకు పంపేందుకు సహకరిస్తాయి. కిడ్నీ బీన్స్‌ను 8 నుంచి 12 గంటలు నీటిలో నానబెట్టి ఉడకబెట్టి తినండి. కిడ్నీ బీన్స్‌లో ఉండే ఫైబర్ మూత్ర పిండాల్లోని రాళ్లను బయటకు గెంటేస్తాయి. రోజులో ఒక్కసారైనా వీటిని తీసుకోండి.

ఎండబెట్టిన తులసి ఆకులు: ఎండబెడ్టిన తులసి ఆకులను పొడిగా నలిపండి. ఒక టేబుల్ స్పూన్ పొడిని నీటిలో కలిపి తేనీరు తయారు చేయండి. ఈ టీని రోజులో మూడు సార్లు తాగండి. ఇది కడుపులోని ఎసిటిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కిడ్నీలోని రాళ్లు సైతం విచ్ఛిన్నమై సులభంగా బయటకు పోతాయి.

మొక్కజొన్న పీచు (కార్న్ సిల్క్): మొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్‌ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ఉపయోగపడుతుంది

.’నిమ్మరసం, ఆలివ్ ఆయిల్: కిడ్నీలోని రాళ్లను బయటకు పంపడంలో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసం కిడ్నీ రాళ్లను ముక్కలుగా చేస్తే.. వాటిని సులభంగా బయటకు పంపేందుకు ఆలివ్ ఆయిల్ లూబ్రికెంట్‌లా ఉపయోగపడుతుంది.

దానిమ్మ: దానిమ్మ రసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కిడ్నీ రాళ్లను సహజంగా తొలగించడానికి దానిమ్మ రసం పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.

ముఖ్య గమనిక: ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించండి.

No comments:

Post a Comment