*వేసవిలో అతివేడి కు తగ్గడానికి ఆయుర్వేదం నవీన్_నడిమింటి_సలహాలు*
అతివేడి (వేసవి తాపం) నివారణకు బ్రహ్మఫల చూర్ణం
పైత్య (అతి వేడి) శరీరం తో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ వుంటారు, తేనె రంగు శరీరం తో వుంటారు వీళ్ళ శరీరం ఎక్కువ వేడి చేసి వుంటుంది. మొలలు వేసవి సమస్యలు మొదలగు వేడి సమస్యలతో బాధపడుతూ వుంటారు.
బాగా పండిన మర్రి పండ్లను ఎండబెట్టి దంచిన పొడి---- 100 gr
అతిమధురం పొడి ---100 gr
కలకండ పొడి ---- 100 gr
అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
10 గ్రాముల పొడిని కుండలోని నీటిలో కలిపి మూడు పూటలా తాగాలి.
దీనిని వాడడం వలన ముక్కు నుండి రక్తం కారడం, మొల్ల ద్వారా ఆసనం నుండి, మలము ద్వారా రక్తం పడడం నివారింప బడతాయి.శీఘ్ర స్ఖలన సమస్యలు, గర్భాశయ సమస్యలు,నపుంసకత్వం నివారింప బడతాయి,
పిల్లలు వాడితే పొడవు పెరుగుతారు, వృద్ధులు వాడితే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. నడవలేని వాళ్ళు దీనిని వాడితే సమస్య నివారింపబడి నడకలో వేగం పెరుగుతుంది.వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0rBPVNiyB66waxBuUzoDrquU2qUdj2y3BckNBoo2rDusa6qWhHdeHr5qZHXSpP5UKl&id=1536735689924644&mibextid=Nif5oz
*2.-అతి_వేడి --- నివారణ*
ఉష్ణము ఎక్కువైతే పైత్యం ఎక్కువవుతుంది. దీని వలన రక్తపైత్యము, అధిక రక్తపోటు చర్మ రోగాలు మొదలైనవి వస్తాయి. కావున వేడి శరీరం వున్నవాళ్ళు వేడిని తగ్గించే పదార్ధాలను వాడాలి. ముఖ్యంగా తీపిపదార్ధాలను ఎక్కువగా వాడాలి. ఆవుపాల పాయసాన్నము తినాలి.
పొన్నగంటి కూర, బచ్చలి, పెరుగు తోటకూర, కరివేపాకు మొదలైనవి వాడుకోవాలి.
ద్రాక్ష, బాదం, ఎండు ఖర్జూరం, కొబ్బరినీళ్ళు తరచుగా వాడాలి.
వేడి ఎక్కువైతే పైత్యము ఎక్కువవుతుంది. దీని వలన నోటిపూత, అరిచేతుల, అరికాళ్ళ మంటలు, శరీరమంతా వేడిగా వుండడం మొదలైన లక్షణాలుంటాయి.
కొబ్బరినూనె, ఆముదము శరీరాన్ని ఎంతో చల్లబరుస్తాయి. ఆముదాన్ని లోపలి సేవిస్తే వేడి చేస్తుంది. పై పూతగా వాడితే శరీరాన్ని చల్లబరుస్తుంది.
చెరువులోని బంకమట్టిని తెచ్చి ఎండబెట్టి, దంచి, జల్లించి, నీళ్ళు పోసి పిసికి శరీరం మొత్తానికి అరికాళ్ళతో సహా పట్టిస్తే వెంటనే శరీరం చల్లబడుతుంది.
వేడి ఎక్కువైతే మలము గట్టి పడి సమస్య ఏర్పడుతుంది.
*ఆహారం:--*
గుప్పెడు ఎండు ద్రాక్షను రాత్రి ఒక గ్లాసులో వేసి నీళ్ళు పోసి నానబెట్టాలి. దానిని ఉదయం బాగా పిసికి పానీయం లాగా చేసి తాగాలి. దీని వలన వేడి తగ్గి ఒక గంటలో సుఖ విరేచనమవుతుంది. రక్తంలోని మలినాలు తొలగించబడతాయి.
అలాగే ఆహారంలో మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి.
బార్లీ నీళ్ళు, చక్కర కలిపి ఉదయం, సాయంత్రం ఒక్కొక్క గ్లాసు సేవిస్తే వేడి తగ్గుతుంది.
వేడి గంజిలో పాలు, చక్కెర కలుపుకొని తాగితే వేడి తగ్గుతుంది. *3.-వేడి_తగ్గడానికి*
తులసి రసం ---- ఒక టీ స్పూను
నిమ్మ రసం ---- " " "
అల్లం రసం ---- " ' "
చక్కెర ----- ఒకటి లేక రెండు స్పూన్లు
అన్నింటిని కలుపుకొని ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు సేవిస్తే పైత్యం వలన కలిగే వాంతి, అన్నం చూస్తేనే వాంతి (అన్న ద్వేషం) ,అజీర్ణం, ఆకలి లేకపోవడం, కళ్ళు ఎర్రబడడం, గొంతులో మంట మొదలైనవి నివారంప బడతాయి.
దీని వలన కఫము, వేడి రెండు తగ్గుతాయి.
*చిన్న పిల్లలకు మోతాదు తగ్గించి వాడాలి.*
2. తులసి రసం ----- ఒక గ్లాసు
నువ్వుల నూనె ---- ఒక గ్లాసు
రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి.
తలలో పైత్యం ఎక్కువై మంటలు, చురుకు వున్నపుడు ఆ నూనెను తలకు పెట్టి సున్నితంగా మర్దన చెయ్యాలి.
*4.-అతి_వేడి_సమస్య --నివారణ*
దీని వలన పైత్యము ఎక్కువవుతుంది.
అతి మధురం పొడి --- ఒక టీ స్పూను
పాలు --- అర గ్లాసు
కలకండ లేదా చక్కెర --- ఒక టీ స్పూను
పాలు స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు రానిచ్చి, దించి వడపోసి గోరువెచ్చగా అయిన తారువాత చక్కెర గాని, కలకండ గాని, తేనె గాని కలుపుకొని తాగాలి. దీని వలన వెంటనే వేడి తగ్గుతుంది. ఇది ఇరవై రకాల వేడి సమస్యలను నివారిస్తుంది.
అతి వేడి నివారణకు అమృతాహారం
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు.
అతి వేడి వలన కళ్ళు మంటలు, కాళ్ళ మంటలు వుంటాయి.
ఉల్లి ---- 50 gr
నూనె లేక నెయ్యి ---- 50 gr
పెరుగు ---- ఒక కప్పు
ఉల్లి గడ్డలను సన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో పోసి నెయ్యి తో గాని నూనె తో గాని వేయించాలి. చల్లార్చి ఒక కప్పు పెరుగు కలపాలి. దీనిని ఉదయం గాని, సాయంత్రం గాని ఆహారంగా తీసుకోవాలి. వేడి ఎక్కువగా వుంటే రెండు పూటలా వాడుకోవచ్చు.
*శరీరంలోని_అతి_వేడి_తగ్గడానికి_తంగేడు_కాఫీ*
తంగేడు పూల పొడి --- 100 gr
పత్తి గింజల పొడి --- 50 gr
ధనియాల పొడి --- 50 gr
గులాబి రేకుల పొడి ---30 gr
శొంటి పొడి --- 20 gr
చిన్న ఏలకుల పొడి --- 20 gr
సుగంధ పాల వేర్ల పొడి --10 gr
తంగేడు విత్తనాల పొడ --10 gr
అన్ని పదార్ధాలను కలిపితే తంగేడు కాఫీ పొడి తయారవుతుంది.
కాఫీ ఫిల్టర్ లో పొడి వేసి డికాషన్ తయారు చేసి చక్కెర కలుపుకొని తాగితే శరీరం యొక్క వేడి తగ్గి, మెదడు చల్లబడుతుంది. మెదడుకు బలం చేకూరుతుంది.
*#అత్యుష్ణాన్ని_తగ్గించే_పానీయం*
సుగంధ పాల వేళ్ళపొడి ----- అర టీ స్పూను
ధనియాల పొడి ----- అర టీ స్పూను
వట్టి వేర్ల పొడి ---- పావు టీ స్పూను
కలకండ పొడి ----- ఒక టీ స్పూను
ఒక గ్లాసు నీళ్ళలో అన్ని పొడులను వేసి మరిగించి అర గ్లాసు కషాయానికి రానివ్వాలి, వడపోసి, చల్లార్చి కలకండను కలపాలి. చల్లారిన తరువాత తాగాలి.
దీని వలన పైత్య దోషము వలన వచ్చే తలనొప్పి ( లేదా అతి వేడి వలన వచ్చే తలనొప్పి ) తగ్గుతుంది.
*పిత్త సంహార ముద్ర :---* దీనినే ప్రాణ ముద్ర లేక శక్తి ముద్ర అని కూడా అంటారు.
బొటన వ్రేలి కొన, చిటికెన వ్రేలి కొన, ఉంగరపు వ్రేలి కొన లను కలిపి మిగిలిన రెండు వ్రేళ్ళను కిందికి పెట్టి ముద్ర వేసుకొని పద్మాసనంలో కూర్చోవాలి.
దీని వలన అత్యుష్ణము వలన వచ్చే సమస్యలు, సెగ గడ్డలు, పొక్కులు, తలనొప్పులు చాలా అద్భుతంగా తగ్గుతాయి
బార్లీ పేలాల పిండి
చక్కెర
రెండింటిని కలిపి తింటే అతి వేడి తగ్గుతుంది.
అతి వేడి వలన శరీరలో వచ్చే మంటలు --నివారణ
ఆవాలను మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసి పాదాలకు పూస్తే శరీరంలోని మంటలు తగ్గుతాయి.
శరీరం లోని అతి వేడిని తగ్గించడానికి మృత్తికా స్నా
ఈ ప్రక్రియ శరీరంలోని సకల మలినాలను తొలగిస్తుంది.
పూర్వం ఒండ్రుమట్టిని తెచ్చి పిసికి ఒంటికి తలకు మట్టి పూసేవాళ్ళు. కొంతసేపటికి తలమీద మట్టి పులిసేది.
ఒండ్రుమట్టి 5, 10 కిలోలు తెచ్చి ఎండబెట్టి నలగగొట్టి జల్లించి పట్టుకోవాలి.
వేపాకుపొడిని, తులసి ఆకుల పొడిని, ;పసుపు పొడిని కలిపి విడిగా కలిపి పెట్టుకోవాలి.
వేపాకు పొడి --- రెండు స్పూన్లు
తులసి ఆకుల పొడి --- రెండు స్పూన్లు
పసుపు పొడి --- రెండు స్పూన్లు
బాగా వేడి శరీరం వున్నవాళ్ళు కొద్దిగా ముద్దకర్పూరం కలుపుకోవచ్చు. ఈ చూర్నాల మిశ్రమాన్ని, మట్టిపొడిని తగినంత నీటితో కలిపి శరీరానికి, తలకు, ముఖానికి పట్టించి అర గంట తరువాత స్నానం చేయాలి.
దీని వలన శరీరంలో వుండే వేడి అంతా తగ్గిపోతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
అతి వేడి ( పైత్య) దోషాల వలన ఏర్పడే గుండె సమస్యల నివారణకు హృదయగుటికలు
ఎండుద్రాక్ష --- పది గ్రాములు
కరక్కాయల పొడి --- చిటికెడు
కలకండ --- అర టీ స్పూను
కలిపి తీసుకోవాలి.
మానసిక ఒత్తిడి , అతివేడి , తలతిరగడం తగ్గడానికి
1. రాత్రి ఒక చిన్న కుండ లో ఒక గ్లాసు నీళ్ళు పోసి వాటిలో కొన్ని ధనియాలను , కొద్దిగా ఎండు ఉసిరి ముక్కలను వేయాలి . ఉదయం ఆ నీటిని వడ కట్టుకొని దానిలో చక్కర కలుపుకొని తాగాలి దీని వలన
#తలలోని_అతివేడి_తగ్గడానికి
ఆముదం , నిమ్మరసం సమాన భాగాలుగా తీసుకొని కలిపి తలకు పట్టిస్తే వేడి తగ్గుతుంది . గంట తరువాత
తల స్నానం చేయాలి .
#శరీరంలో_అతివేడి --- నివారణ
కారణాలు:-- Hyper Metabolism, Hyper Thyroid , పిత్త ప్రకృతి ఆందోళన , విడాహక ఆహార సేవనము . వంటివి .
వీటివలన శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది . రక్తప్రవాహ వేగం పెరుతుంది .
1. ఒక టీ స్పూను మెంతులను పెరుగులో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ మెంతులను నూరి పెరుగుతో సహా తాగాలి .
2 ఒక స్పూను ధనియాలను నలగ గొట్టి రెండు కప్పు నీటిలో వేసి కాచి ఒక కప్పుకు రానిచ్చి వడకట్టి కలకండ కలుపుకొని
తాగాలి .
సూచన :-- పగలు ఎక్కువ భోజనం , రాత్రిపూట తక్కువ భోజనం సెవించాలి.
*వేడి తగ్గడానికి ---- #సుగంధ_పానీయం*
సుగంధపాల వెళ్ళు ---- ఒక కిలో
నీళ్ళు ---- 4 లీటర్లు
పటికబెల్లం ---- ఒక కిలో
సుగంధపాల వేర్ల ను ఒక రోజంతా లేదా ఒక రాత్రంతా గాని నీటిలో నానబెట్టాలి . దీనిని ఉదయం స్టవ్ మీద పెట్టి
ఒక లీటరు నీళ్ళకు వచ్చే వరకు కాచాలి . తరువాత ఆ నీటిలో పటికబెల్లం వేసి నీరు ఇంకి పోయి తీగ పాకం వచ్చే వరకు
కాచాలి . చల్లారిన తరువాత సీసాలో భద్రపరచుకోవాలి .
ప్రతిరోజు రెండు టీ స్పూన్ల పాకాన్ని గ్లాసులో వేసి దానికి కుండలో నీళ్ళు కలిపి తాగాలి .
దీని వలన వేడి తగ్గి రక్తశుద్ధి జరుగుతుంది . మూడు నెలల వరకు తాగితే శరీరంలో మెరుపు వస్తుంది .
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
No comments:
Post a Comment