Wednesday 31 May 2023

నల్ల శనగలు

310523f0643.    010623-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀*మన ఆరోగ్యం..!

                *"నల్ల శనగలు"*
                   ➖➖➖✍️

```"నల్ల శనగలు"..  ఇవి  అందరి  వంటింట్లో  ఉండేవే  అయినా  వీటి  ప్రయోజనాలు  మాత్రం  పెద్దగా  పట్టుంచుకునే  వారుండరు.  నిజానికి  నల్ల శనగలు  అద్భుత  ఆరోగ్య  ప్రయోజనాలు  చేకూరుస్తాయట.``` 

```వీటిని  ఉడికించుకుని..  వేయించుకుని  రకరకాల  రుచికర  ఆహార  పదార్ధాలను  తయారు  చేసుకోవచ్చు.  ముఖ్యంగా  రాత్రి  నానబెట్టి  ఉదయాన్నే  తినడం  వల్ల  మంచి  ఫలితం  ఉంటుందంటున్నారు  నిపుణలు.```


*"నానబెట్టిన  నల్ల  శనగలు  తినొచ్చా" *

```"ప్రోటీన్, ఐరన్ అందుతాయి:" ```

 ```శాకాహారులు  సాధారణంగా  ప్రొటీన్  లోపంపై  ఆందోళన  చెందుతుంటారు.  అలాంటి  వారు  నానబెట్టిన  నల్ల శనగలు  తీసుకోవడం  మంచిది.  అలాగే  రక్తహీనత తో  బాధపడుతున్న  వారికి  కూడా  బాగా  ఉపయోగపడతాయి.  వీటిలో  సమృద్ధిగా  లభించే  ఐరన్..  శరీరంలో  హీమోగ్లోబిన్  స్థాయిని  పెంచేందుకు  సహాయపడుతుంది.```


*"అరుగుదలను  పెంచుతాయి" :*

```నానబెట్టిన  నల్ల శనగల్లో  ఫైబర్  పుష్కలంగా  ఉంటుంది.  ఇది  జీర్ణ వ్యవస్థను  మెరుగుపరుస్తుంది.  శరీరంలోని  హానికరమైన  విష పదార్ధాలను  బయటకు  పంపి,  జీర్ణ వ్యవస్థను  ఆరోగ్యంగా  ఉంచుతుంది.  వీటిని  క్రమం  తప్పకుండా  తినడం  వల్ల  మలబద్ధకం,  జీర్ణ సమస్యలు  దూరమవుతాయి.```


*"గుండెను  ఆరోగ్యంగా  ఉంచుతాయి" :*


```నానబెట్టిన  నల్ల శనగల్లో  యాంటీఆక్సిడెంట్లు, ఫైటో  న్యూట్రియెంట్లు  ఉంటాయి.  ఇవి  రక్తనాళాలను  ఆరోగ్యంగా  ఉంచడంతో  పాటు,  రక్తం  గడ్డకట్టడాన్ని  నిరోధించే  అవసరమైన  ఖనిజాలను  కలిగి  ఉంటాయి.  ఫలితంగా  గుండె  ఆరోగ్యంగా  ఉంటుంది.```


*"బరువు  తగ్గేందుకు  సహాయపడతాయి" :*

```యాంటీఆక్సిడెంట్లతో  నిండిన, నల్ల శనగల్లో  ఫైబర్  ఉంటుంది.  అది  మిమ్మల్ని  ఎక్కువసేపు  నిండుగా  ఉంచుతుంది.   ఆనారోగ్యకరమైన  అల్పాహారాలను  అతిగా  తినడం  లేదా  అతిగా  తినకుండా  నిరోధిస్తుంది.```


*"కొలెస్ట్రాల్  స్ధాయిని  తగ్గస్తుంది" :*

```వీటిలోని  కరిగే  ఫైబర్  పిత్త ఆమ్లాలను  బంధించడంలో  సహాయపడుతుంది.  దీంతో పాటు  శరీరంలోని  కొలెస్ట్రాల్  స్థాయిని  తగ్గిస్తుంది.  నల్ల శనగల్లోని  డైటరీ  ఫైబర్  ఆరోగ్యానికి  మేలు చేస్తుంది.```


*"కురులను  కాపాడుతుంది" :*

```నల్ల  శనగలు  జుట్టు  ఆరోగ్యానికి  విటమిన్లు,  ఖనిజాలను  అందిస్తాయి.  ఇందులో  ప్రొటీన్  పుష్కలంగా  ఉంటుంది.  ఇది  జుట్టు  కుదుళ్లను  బలంగా  ఉంచి,  జుట్టు  రాలడాన్ని  నివారిస్తుంది. నానబెట్టిన  నల్ల  చనాలను  క్రమం  తప్పకుండా  తీసుకుంటే  జుట్టు  తెల్లబడటాన్ని  నివారించవచ్చట.```


*"శక్తికి  గొప్ప  మూలం" :*

```ఉదయాన్నే  నానబెట్టిన  నల్ల శనగలను  తిననడం  వల్ల  మీకు  రోజంతా  శక్తి  ఉంటుంది.  క్రమం  తప్పకుండా   తీసుకోవడం  మిమ్మల్ని  బలంగా  చేస్తుంది.  శరీర  బలహీనతను  నివారిస్తుంది.```


*"క్యాన్సర్  ప్రమాదాన్ని  తగ్గిస్తుంది" :*

```వీటిలోని  ఫైటో  న్యూట్రియెంట్స్,  యాంటీఆక్సిడెంట్లు  రొమ్ము క్యాన్సర్,  పెద్దప్రేగు  క్యాన్సర్  ప్రమాదాన్ని  తగ్గించడంలో  సహాయపడతాయి.  గర్భిణులకు,  బాలింతలు  తీసికుంటే  ఐరన్  సమృద్ధిగా  లభిస్తుంది.```


*"చర్మం  మెరుస్తుంది" :*

```ముఖం మీరు  తినేదానికి  ప్రతిబింబం,  నానబెట్టిన  నల్ల శనగలు  తినడం  వల్ల  చర్మ  సమస్యలకు  దూరంగా  ఉండొచ్చు.  ఇది  మీ  చర్మాన్ని  సహజంగా  మెరిసేలా  చేస్తాయి.```


*"రక్తంలో  చక్కెరను  నియంత్రిస్తుంది" :*

```నల్ల శనగలను  నానబెట్టుకుని తీసుకుంటే  రక్తంలో  చక్కెర స్థాయి  నియంత్రించబడుతుంది.  దీనిలోని  సంక్లిష్ట  పిండి పదార్థాలు  జీర్ణక్రియను  ఆలస్యం  చేస్తాయి.  వీటిలోని  పిండి పదార్థాలు  రక్తంలో  చక్కెర  శోషణను  నియంత్రించడమే  కాక,  చక్కెర స్థాయిని  తగ్గిస్తాయి.  టైప్ -2  డయాబెటీస్  ప్రమాదాన్ని  కూడా  తగ్గిస్తాయి.```✍️
                        … సేకరణ.
.

No comments:

Post a Comment