వంటింట్లో అందుబాటులో ఉండే దివ్యౌషదం అనారోగ్య సమస్యలకు విరివిగా ఉపయోగిస్తుంటారు. అల్లంలోని పోషకాలు అన్నీ ఇన్నీ కావండి. అవును.. మందులు నయం చేయలేని ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఒక చిన్న అల్లం ముక్క నయం చేస్తుంది. అందుకే ఆయుర్వేదం లో దీనికి ఉన్న ప్రత్యేకత స్థానం ఉంది. అల్లం ప్రతిదినం క్రమం తప్పకుండా వినియోగిస్తే కలిగే ప్రయోజనాలుఅనిర్వచనీయం. అల్లం (Ginger)మంచి యాంటి ఆక్సీడెంట్. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టనీయకుండా సహాయపడటంలో అల్లం పాత్ర ఎంతో కీలకమైంది. స్వతహాగా అల్లం ఘాటు ఎక్కువగా ఉండి మంట పుట్టిస్తుంది. అయితే దీన్ని తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్స్ వంటివి ఏర్పడవు. కడుపులో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పని చేస్తుంది. షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధం అల్లం. అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు బి3, బి6, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు తో పాటు ఇతర పోషకాలు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి.
దీనిలో జింజరాల్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇది ఒత్తిడిని దూరం చేసి మెదడును ప్రశాంతంగా ఉంచడంలో తోడ్పడుతుంది. నోటి దుర్వాసన పోగొట్టేందుకు అల్లం చక్కని విరుగుడుగా పనిచేస్తుంది. ఆకలిని పెంచే గుణాలు అల్లంలో పుష్కలంగా ఉంటాయి. అల్లం బుగ్గన పెట్టుకుంటే.. దీని రసం మెల్లగా లోపలికి వెళ్తూ వాంతులు వచ్చే భావన, వికారాన్ని తగ్గిస్తుంది. గొంతులో నస ఉన్నా అల్లంతో చెక్ పెట్టేయవచ్చు. జలుబు, దగ్గును దూరం చేస్తుంది. అదే విధంగా కఫం సమస్యను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడం(కేలరీలను బర్న్ చేసి)లోనూ అల్లం పాత్ర ఎంతో ఉంటుంది. అల్సర్, కీళ్ల నొప్పులు, అజీర్తి, మధుమేహం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఆడవారి రుతుస్రావ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించి, ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది.
No comments:
Post a Comment