*డియర్ పేరెంట్స్... మీ పిల్లలు కు అతిగా సెల్ ఫోన్ ఈ ఉచ్చుల్లో పడవద్దు వైద్య నిలయం సలహాలు*
❎ మీ పిల్లల స్నేహితులందరికీ సెల్ ఫోన్ ఉందని, మీ బిడ్డకు కూడా సెల్ ఫోన్ కొనిచ్చారా?
❎ మీ పిల్లలు హోంవర్క్ పుస్తకం మర్చిపోతే మీరు స్కూల్ కు వెళ్లి ఇచ్చి వస్తున్నారా?
❎ మీ పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కు కావాల్సిన మెటీరియల్ కోసం మీరు షాపుల చుట్టూ తిరుగుతున్నారా?
❎ మీ బిడ్డను చాలా యాక్టివిటీస్ లో చేర్పించడం వల్ల అసలు ఖాళీ సమయమే ఉండటం లేదా?
❎ మీరు పికప్ చేసుకోవడానికి వెళ్లేందుకు కాస్తంత లేటయితే వెంటనే మీకు మెసేజ్ వస్తుందా?
వీటిలో ఏ ఒక్కటి చేస్తున్నా మీరు పేరెంట్ ట్రాప్ లో చిక్కుకున్నట్లే.
తమలా తమ పిల్లలు కష్టపడకూడదనే భావనతో చాలామంది పేరెంట్స్ పిల్లలు అడిగినవన్నీ ఇస్తుంటారు. అలాగే పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ తో, టీచర్స్ తో వారికి ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులే పరిష్కరిస్తుంటారు.
ఇవన్నీ కలిసి పిల్లలు నేర్చుకునే అవకాశాన్ని, సమస్యలను పరిష్కరించుకునే అవకాశాన్ని, స్కిల్స్ సాధించుకునే అవకాశాన్ని కోల్పోతారు. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం ఇతరులవైపు చూసే, ఇతరులపై ఆధారపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటారు.
ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యే ప్రవర్తననే #parenttrap అంటారు.
సైకాలజిస్టులు, పేరెంటింగ్ కోచెస్ అలాంటి కొన్ని పేరెంట్ ట్రాప్స్ ను గుర్తించారు. అవేమిటో, వాటిని ఎలా గుర్తించాలో, వాటినుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.
https://fb.me/3r6TThB1W
*#Control #Trap:* తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను అతిగా నియంత్రించడం, వారి కార్యకలాపాల నుండి వారి సామాజిక జీవితాల వరకు ప్రతిదీ నిర్దేశించినప్పుడు ఇది సంభవిస్తుంది.
పిల్లల భద్రత, శ్రేయస్సు కోసం కొంత నియంత్రణ అవసరం. అయితే అతిగా నియంత్రించడం వల్ల పిల్లల్లో ఆందోళన, స్వీయగౌరవ సమస్యలు ఏర్పడతాయి.
*#Criticism Trap:*
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం విమర్శిస్తుంటారు, నిరంతరం వారిలో తప్పులను వెతుకుతుంటారు. ఇది వారి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.
*#Comparison Trap:* చాలామంది పేరెంట్స్ పిల్లలను తోబుట్టువులతోనూ, తోటివారితోనూ పోల్చుతుంటారు. నిరంతరం ఇతరులతో పోల్చడం వారి ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
*Giving Trap:*
ఇతర పిల్లలకు ఉన్నవి తమకు లేవని పిల్లలు బాధపడకూడదని తల్లిదండ్రులు భావిస్తారు. అందువల్ల వారు అడగకుండానే అన్నీ అమర్చిపెడతారు. దీనివల్ల పిల్లలకు అవసరంలేని వస్తువులను ఇచ్చే ఉచ్చులో పడతారు.
*Guilt Trap:*
పిల్లల అసంతృప్తికి తాము కారణం కాకూడదని పేరెంట్స్ భావిస్తారు. తమ బిడ్డ కలత చెందడానికి కారణం తామేనని తల్లిదండ్రులు విశ్వసించినప్పుడు అపరాధ భావనకు లోనవుతారు. దాన్ని అధిగమించేందుకు పిల్లలు కోరినవీ, కోరనివీ కొనిచ్చి తమ భారం దింపుకుంటారు.
*Hurried Trap:* తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ శక్తిమేరకు ప్రతిదీ చేయాలని కోరుకుంటారు. దీనివల్ల పిల్లల తమ అవసరాలు వెంటనే తీరతాయని భావిస్తుంటారు. తక్షణ తృప్తి (#instantgratification)కి అలవాటు పడతారు. అలా తక్షణ తృప్తి దొరకనప్పుడు తీవ్రంగా నిరాశ చెందుతారు, విపరీత నిర్ణయాలు తీసుకుంటారు.
*#Permissive Trap:*
కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసినా ఏమీ అనరు, ఏం చేయాలనుకున్నా అనుమతిస్తారు. పిల్లలతో సంఘర్షణ నివారించడానికి ఇది సులువైన మార్గంగా భావిస్తారు. కానీ దీనివల్ల పిల్లల్లో స్వీయ క్రమశిక్షణ లోపిస్తుంది, విచ్చలవిడితనానికి దారితీయవచ్చు.
*#Pressure Trap:* తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను పంచుకోవడం గర్వంగా భావిస్తారు. పోటీలో పిల్లలు ముందుంటే సంతోషిస్తారు, ఏమాత్రం వెనుకంజ వేసినా ఆందోళన పడుతుంటారు. ముందుకు దూసుకుపోవాలని పిల్లలను ఒత్తిడి చేస్తారు.
*#Rescue Trap:* తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలను చూసి బాధపడతారు. వాటినుంచి బయట పడేయడం ద్వారా వారిని ‘రక్షించాలని’ భావిస్తారు, బయటపడేస్తారు. పర్యవసానంగా కొన్ని పనులు జరగాలంటే వేచి ఉండటం ( #delayed_gratification) అవసరమనే విషయం పిల్లలకు ఎప్పటికీ అర్థం కాదు. అలాగే తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే అవకాశం ఉండదు.
ఉచ్చుల నుండి బయటపడాలంటే...
పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే ఎప్పటికప్పుడు తమ ప్రవర్తనను గమనించుకుంటూ, అంచనా వేసుకుంటూ, అవసరమైనమేరకు మార్చుకునేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి.
✅ ప్రతి బిడ్డ ప్రత్యేకమని, ఎవరి ప్రత్యేక సామర్థ్యాలు వారికి ఉంటాయని గుర్తించాలి.
✅ బిడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పోల్చకూడదు.
✅ సరిహద్దులను నిర్ణయించి స్థిరంగా అమలు చేయాలి. వాటి పరిధిలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛనివ్వాలి.
✅ కష్టమైన అంశాలపై మాట్లాడటానికి, అవసరమైనప్పుడు కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
✅ విమర్శించడం కంటే నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించడంపై దృష్టి పెట్టాలి.
✅ పిల్లల బలాలను, విజయాలను, సానుకూల ప్రవర్తనలను ప్రశంసించాలి.
✅ పిల్లలు తమ పనులు తాము చేసుకునేలా ప్రోత్సహించండి.
✅ తమకు కావాల్సినవి తాము కష్టపడి సాధించుకోవడం నేర్పించండి.
✅ తమ సమస్యలు తామే పరిష్కరించుకునేందుకు ప్రోత్సహించండి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/HelathTipsbyNaveen
No comments:
Post a Comment