Saturday 6 May 2023

రణపాల ఆకులు

రణపాల ఆకులు 

ఈ మొక్క సాంకేతిక నామం బ్రయోఫిల్లం రణపాల ఆకు కాస్త దళసరిగా ఉండి రుచిలో వగరు,కాస్త పులుపు గా ఉంటుంది. ఆకు చుట్టూ డిజైన్ లాగా (మందార ఆకులాగా) ఉంటుంది.
ఈ మొక్క ఆకు ద్వారానే తిరిగి ప్రత్యుత్పత్తి కొనసాగిస్తుంది. అనగా ఆకు నాటడం ద్వారా తిరిగి మొక్క మొలుస్తుంది.
ఈ రణపాల ఆకులను నేరుగా తినవచ్చు,సలాడ్లలో కలుపు కుని తినవచ్చు, లేక కషాయం తయారు చేసుకుని తాగవచ్చు. ఈ రణపాల ఆకు ఉదయం రెండు రాత్రి రెండు ఆకులు తినడం ద్వారా కిడ్నీలో, గాల్ బ్లాడర్ లో ఏర్పడ్డరాళ్ళు కరిగి బయటకు పోతాయి.
ఈ ఆకు తినడం వలన రక్తంలో క్రియాటిన్ తగ్గి డయాలసిస్ రోగులకు మూత్రపిండాల పని తీరు మెరుగుపడుతుంది.
మధుమేహంకూడ కాస్తఅదుపు లో ఉంటుంది ఆకు తినడం వలన కడుపులో అల్సర్లు తగ్గుతాయి.తద్వారా అజీర్తి, మలబద్దకం తగ్గతాయి. కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయ ని అంటారు.ఈ ఆకు తినడం వలన జలుబు, దగ్గు, విరేచనా లను నయం అవుతాయి. ఈ ఆకులో యాంటీపైరేటిక్ గుణం ఉండటం వలన మలేరియా టైఫాయిడ్ లను తగ్గిస్తుంది.
ఈ ఆకు డియూరిటిక్ లక్షణం కలిగి ఉండటం వలన మూత్రం లో రక్తం,చీము వంటివి పోకుండా నయం చేయబడు తుంది.
జుట్టురాలటం, తెల్లవెంట్రుకలు రావడం లాంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంపై ఏర్పడే కొవ్వుగడ్డలు, వేడికురుపులకు ఈ ఆకును పేస్ట్ లా చేసి గడ్డలు,కురుపులమీద కట్టు కట్టడం వలన అవి తగ్గుతాయి. శరీరంలో వాపులు కలిగిన చోటు ఈ ఆకుల పేస్టును కట్టు కట్టడం ద్వారా వాపుతగ్గవచ్చు.
కామెర్ల వ్యాదిగ్రస్తులుఉదయం, సాయంత్రం ఈ ఆకు రసం తీసు కోవడం వలన వ్యాధి నయం అవుతుందని అంటున్నారు.

No comments:

Post a Comment