Monday, 15 May 2023

సర్వికల్_స్పాండిలోసిస్_లంబార్_స్పాండిలోసిస్_బాధపడుతున్నారా

*సర్వికల్_స్పాండిలోసిస్_లంబార్_స్పాండిలోసిస్_బాధపడుతున్నారా?* *#సమస్య_పరిష్కారం_మార్గం_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు_*

                భుజాలు, మెడ ఒకటే నొప్పి...ఏ పని చేయాలన్నా కష్టమవుతుతోంది. ఎందుకిలా...అంటుంటారు చాలా మంది. మారిన జీవనశైలి, ఎక్కువ దూరం ప్రయాణించి ఉద్యోగాలు చేయడం, రోజులో 2-4 గంటల సమయం ప్రయాణానికి కేటాయించడం, ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్‌పై పనిచేయడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరిగి సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్యకు దారితీస్తుంది... సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి?.స్పాండి అంటే వెన్నెముక , లోసిస్ అంటే సమస్య అని అర్ధము . ప్రతి వెన్నుపూస నడుమ గల దూరము పెంచే లేదా తగ్గించే విధముగా అనుసంధానమై ఉండే కణజాలము సహజముగా క్షీణదశము రాగల , వెన్నుపూసను ప్రభావితము చేసే ఓ రకమైన ఆర్థ్రైటిస్ నే స్పాడిలైటిస్ లేదా స్పాండిలోసిస్ అంటారు . ఇది మెడభాగము లో అయితే సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య మెడనొప్పి. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కొంచెం ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారినపడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పకోవచ్చు. తలవంచితే మెడనొప్పులే...ముఖాన్ని నిటారుగా నిలబెట్టేది మెడ. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో మెడనొప్పి కూడా ఒకటి. నిరంతరం చేసే పనులు, కొన్ని సంప్రదాయ పద్ధతులు ఇందుకు ఎక్కువగా కారణం అవుతున్నాయి. మరికొన్ని కారణాలు: వెన్నెముకకు దెబ్బలు తగలటం, అధిక బరువును ఒక్కసారిగా ఎత్తడం, సరి అయిన డ్రైవింగ్ పద్ధతులను పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వలన వెన్నుపూసల మధ్య ఒత్తిడి అధికమై ఈ సమస్య వస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వలన కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన కూడా ఇది వస్తుంది. (ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్) క్షయవ్యాధి వెన్నెముకకు పాకడం వలన ఇది వస్తుంది. (Potts disease) .ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా కంప్యూటర్‌మీద పనిచేయడం వలన చిన్న వయస్సువారు కూడా స్పాండిలైటిస్ బారిన పడుతున్నారు.
పూర్తి వివరాలు కుం
https://www.facebook.com/1536735689924644/posts/3129804770617720/
*1.-#లక్షణాలు*
                    తల, మెడ నొప్పితో కండరాలు బిగుసుకొనిపోతాయి. మెడ నుంచి భుజాలు, చేతులకు నొప్పి, తిమ్మిర్లు వ్యాపిస్తాయి. చేతి కండరాలు బలహీనపడటం, కళ్లు తిరగడం, భుజాలు, చేతి వేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, అరుదుగా మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉంటుంది. మెడ బిగుసుకుపోయినట్లుగా కావడంతో నొప్పి ప్రారంభమవుతుంది. నొప్పి క్రమంగా భుజాలకు పాకుతుంది. తలను కదల్చలేకపోతారు. తీవ్రమైన ఒత్తిడిపడుతున్నట్లుగా ఉంటుంది. చెవుల్లో శబ్దాలు వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తలనొప్పి, బీపీ పెరిగిపోవడం జరుగుతుంది. నొప్పి క్రమంగా చేతులకు విస్తరిస్తుంది.
*2.- #నిరక్ష్యం_చేస్తే...*
        సర్వైకల్ స్పాండిలైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు మొదలయ్యే అవకాశంఉంది. దీర్ఘకాలిక మెడ నొప్పి, మల, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. సర్వైకిల్ స్పాండిలోసిస్ ను కొన్ని ప్రత్యేకమైన మెడికేషన్స్, లైఫ్ స్టైల్ మార్పులు మరియు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ తో తగ్గించుకోవచ్చు . మరి ఆ సింపుల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం..
*3.-#రెగ్యులర్_వ్యాయామం:*
          సర్వైకల్ స్పాండిలోసిస్ కు ముఖ్య కారణం వ్యాయామలోపం. కాబట్టి ప్రతి రోజూ కొన్ని సింపుల్ గా ఉండే ఫిజికల్ ఎక్సర్ సైజులు చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు. తలను ముందుకు వెనకకు, మరియు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేయడం మంచిది. లెఫ్ షోల్డర్ టు రైట్ షోల్డర్ కు రొటేట్ చేయడం మంచిది. ఇలా ప్రతి రోజూ రెండు, మూడు సార్లు చేస్తే మంచిది . ఇలా చేయడం వల్ల మెడనొప్పి నివారించుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు తాగడం మంచిదేనా? మీరు ఇంకా ఎప్పుడు తాగాలనుకుంటున్నారు?

*4.-#హాట్_అండ్_కోల్డ్_కంప్రెసర్:*
       మెడనొప్పి నివారించుకోవడానికి మరో సింపుల్ రెమెడీ ఇది. నొప్పి ఉన్న ప్రదేశంలో కోల్డ్ అండ్ హాట్ కంప్రెసర్ ను ఉపయోగించాలి. హాట్ కంప్రెసర్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది, సోర్ మజిల్స్ ను రిలాక్స్ చేస్తుంది. కోల్డ్ కంప్రెసర్ వాపును మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. వర్షాకాలంలో మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి
*5.-#ఎప్సమ్_సాల్ట్_బాత్ :*
 సర్వైకల్ స్పాడిలైటిస్ సమస్యతో బాధపడే వారు ఎప్సమ్ సాల్ట్ బాత్ ను రెగ్యులర్ గా చేసుకుంటే మంచిది . ఎప్సమ్ సాల్ట్ లో ఉండే మెగ్నీషియం శరీరంలోని పిహెచ్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది . ఇది మెడ, మరియు భుజాల యొక్క స్టిప్ నెస్ ను, ఇన్ఫ్లమేషన్, తగ్గిస్తుంది. ఎప్సమ్ సాల్ట్ లో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి తర్వాత స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
6.- #గమనిక(నవీన్ సలహాలు ):
     కిడ్నీ, హార్ట్ లేదా డయాబెటిస్ సమస్యలున్నవారు ఈ హోం రెమెడీని అనుసరించకూడదు.

మెడ నరాలు పట్టినప్పుడు మెడకింద తవ్వ పెట్టుకుని, నేల మీద పడుకుంటే, విశ్రాంతి గా చాలా వరకు తగ్గు తుంది.

వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటే ,నొప్పి తగ్గుతుంది.

ఆవ నూనె, లేదా యూకలిప్టస్ నూనె వ్రాయండి. తరువాత ,కాపడం పెట్టుకోవాలి.

వీలయితే తలను గుండ్రంగా తిప్పండి. కూడా నుండి,ఎడమ కు, ఎడమ నుండి కుడికి .

ఎక్కువ శ్రమ ఇవ్వకండి.నొప్పి అంటే శరీరం విశ్రాంతి కోరుతున్నది అని సంకేతం.

ముందు మనసును ప్రశాంతం గా ఉంచుకోండి.

మానసికంగా కృంగి పోయినప్పుడు కూడా మెడ నరాలు పట్టేస్తాయి.

మానసిక రోగాలు శారీరక రోగాలుగా మారతాయి.

అందువల్ల మానసిక అరోగ్యం సాధించండి.

*#వెల్లుల్లి:*
సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలను నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జిక్ లక్షణాలుండటం వల్ల మెడ, భుజం నొప్పి, వాపు, ఇన్ల్ఫమేషన్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. రెగ్యులర్ గా పచ్చి వెల్లుల్లి రెబ్బలను కాలీ పొట్టతో తిని, నీళ్ళు త్రాగాలి. గార్లిక్ క్యాప్సిల్స్ ను డాక్టర్ ప్రిస్క్రిప్సన్ తో తీసుకోవడతో నొప్పి నివారించుకోవచ్చు .
*B.- #పసుపు:*
     పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వల్ల సర్వికల్ స్పాండిలోసిస్ ను నివారించుకోవచ్చు. అంతే కాకుండా పసుపు బ్లడ్ సర్క్యులేషన్రుస్తుంది . ఇది మజిల్ స్టిప్ నెస్ మరియు పెయిన్ ను నివారిస్తుంది. ఒక టీస్పూన్ పసుపును పాలలో మిక్స్ చేసి తక్కువ మంట మీద 5 నిముషాలువ ేడి చేసి గోరువెచ్చగా మారిన తర్వాత తేొని రోజూ రెండు సార్లు త్రాగితే ఉపశమనం కలుగుతుంది.
*C.- #నువ్వులు:*
   మరో పాపులర్ ఆయుర్వక్ రెమెడీ, సర్వైకల్ స్పాండిలోసిస్ ను నువ్వులతో నివారించుకోవచ్చు . నువ్వుల్లో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్, ఫాస్పరస్ మరియు విటమిన్ కె మరియుడిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగె కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొద్దిగా గోరువెచ్చని నువ్వుూనెను నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేసి 10 నిముషాల తర్వాత హాట్ కంప్రెసర్ త మసాజ్ చేసుకోవాలి. ఇలా రోజూ మూడు నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
*D.- #అల్లం:*
         అల్లం మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. అల్లం ఒక ఆయుర్వేద మూలిక.ంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. దాంతో మెడచుట్టు, భుజాల వద్ద నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ప్రతి రోజూ జింజర్ టీని 3సార్లు త్రాగడం వల్ల గ్రేట్ గా పనిచేస్తుంది. వేడి నీటిలో అల్లముక్కలు వేసి ఉడికించి, ఆ నీటిని వడగట్టి, తేనె మిక్స్ చేతి తీసుకోవాలి. ఆపిల్ సైడర్ *E.- #వెనిగర్:*
        ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఉండే ఆల్కలైజింగ్ లక్షణాలు వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ ను నివారించడంలో చాలా మేలు చేస్తుంది . ఇది మెడీ మరియు భుజాల వద్ద చాలా ఎఫెక్టివ్ గా నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఒక కాటన్ టవల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్లో డిప్ చేసి మెడచుట్టు అప్లై చేయాలి . ఇలా రోజూ రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
*F.- #కేయాన్_పెప్పర్:*
        మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ కేయాన్ పెప్పర్. ఇందులో క్యాప్ససిన్ ఉంటుంది.ఇది అనాల్జిక్ లక్షణాలను, అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీల క్షణాలను కలిగి ఉంటుంది . ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఒక చెంచా కేయాన్ పెప్పర్ పౌడర్ ను గోరువెచ్చని నూనెలో మిక్స్ చేసి నొప్పి, వాపు ఉన్న ప్రాతంలో అప్లై చేసి బ్యాడేజ్ చుట్టాలి. కొన్ని గంటల తర్వాత దీన్ని శుభ్రం చేసుకోవాలి.
G.- #వేప:
   వేపలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నొప్పి నివారణ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇది నొప్పిని, ఇన్ఫ్లమేషన్ మరియు వాపును తగ్గిస్తాయి . ఒక చెంచా వేప పౌడర్ లో కొద్దిగా నీళ్ళు పోసి, పేస్ట్ ను వేడి చేయాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

*#భవిష్యత్తు_లో_మెడ_మోకాళ్ళనొప్పులు_రాకుండా_ఎలాంటి_ముందుజాగ్రత్తలు_తీసుకోవాలి?*
1. అధిక బరువు లేకుండా చూసుకోండి.

2. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం పూట లేత ఎండలో(8లోపు) కనీసం అరగంట అయినా ఉండేలా చూసుకోండి. దీని వల్ల శరీరానికి కావలసినంత డి విటమిన్ లభిస్తుంది. ఎముకలు బలంగా ఉండాలంటే డీ విటమిన్ చాలా అవసరం.

3. వీలైతే..వారానికి కనీసం నాలుగు రోజులైనా శీర్షాసనం వెయ్యండి. ఇలా చేస్తే భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పులు మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టవు.
*#ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
ఫోన్ -9703706660
   *సభ్యులకు విజ్ఞప్తి*
   ******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment