Thursday 25 May 2023

Causes for skinrash in babies

*చిన్న_పిల్లలు_చర్మానికి_రాషెస్‌_మరియు_ఇన్ఫెక్షన్_నివారణకు_నవీన్_నడిమింటి_సలహాలు ,*
*Causes for skinrash in babies*

      పాపాయిల చర్మానికి రాషెస్‌(Skin Rashes)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

*పాపాయిల చర్మానికి రాషెస్‌(Skin Rashes) #ఎందుకు_వస్తాయి?..............*
                  పసిపిల్లల చర్మానికి రాషెస్‌(rashes) రావటా నికి అనేక కారణలున్నాయి. దద్దులు ఎర్రబడి ,దురదగా ఉండడం వల్న పాపాయికి చిరాకు పుట్టి ఏడుస్తూ ఉంటుంది .
పాపాయి లకు ఉపయోగించే డైపర్స్‌ వల్ల రాషెస్‌ ఏర్పిడతాయి.
పాపాయి తడిపిన డ్రాయిర్లను, పొత్తి గుడ్డలను వెంటనే మార్చకపోతే చర్మానికి రాష్‌ ఏర్పడు తుంది.
పాపాయి తడిపిన బట్టలను ఉతకకుండా ఆరేసి వాడటం వల్ల, ఆ అపరిశుభ్రత వల్ల రాషెస్‌ ఏర్పడు తాయి.వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://fb.me/3sHmfsx4M
            పిల్లల చర్మానికి గాలి బాగ తగలక పోవడం స్వేదాన్ని పీల్చుకునే దుస్తులు కాకుండా, ప్లాస్టిక్‌ డైపర్స్‌ వాడటం, పాలియస్టర్‌ లాంటి డ్రాయర్లను, దుస్తులను వాడటం కూడా రాషెస్‌కు కారణమవుతుంది. పోతపాలు పట్టే పిల్లలకి పాలు పడక ఎలర్జి కలిగి రాషెస్‌ వస్తాయి.
చికెన్‌ ప్యాక్స్‌, మీజిల్‌ లాంటి వ్యాధులకు పాపాయి గురయినప్పుడు ఆ అనారోగ్య కారణంగా రాషెస్‌ వస్తాయి.
ఇన్‌డోర్‌ మొక్కలను పెంచేటప్పుడు, ఆ క్రోటన్స్‌ మొక్కల వల్ల కూడా పాపాయి లకు రాషెస్‌ కలుగుతాయి.
ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు పాపాయికి రాషెస్‌ వస్తాయి.

*#తీసుకోవలసిన_జాగ్రత్తలు :*
                  రాషెస్‌ ఏర్పడిన పాపాయి అసౌకర్యానికి గురయి ఏడుస్తుండటం, రాషెస్‌ ఏర్పరచే మంట, దురదలాంటి కారణాల వల్ల నిద్రపోకుండా ఏడవడం, నిద్రపోయినా మాటిమాటికీ లేస్తూండటం లాంటివి జరుగుతాయి. అందువల్ల పాపాయి లేత చర్మాన్ని బాధించే రాషెస్‌ ఏర్పడకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలి. పాపాయికి ఉపయోగించే పక్క బట్టలు, పొత్తిగుడ్డలు, ధరింపచేసే దుస్తుల విషయంలో పరిశుభ్రతను పాటించాలి. పాపాయి బట్టలు తడిపినప్పుడు వెంటనే వాటిని తీసేసి పాపాయి చర్మానికి తడిలేకుండా తుడిచి, బేబీ పొడరును అద్ది, ఆ తర్వాత మరో డ్రాయిర్‌ను తొడగాలి. రాత్రి సమయంలో పాపాయికి డైపర్స్‌ వాడకపోవడమే మంచిది. పాపాయి చర్మానికి గాలి ప్రసరించే కాటన్‌ దుస్తులను మాత్రమే వాడాలి. రాషెస్‌ను మృదువయిన బేబీ సోప్‌తో రుద్ది, పరిశుభ్రమయిన నీటితో కడగాలి. పాపాయి చర్మానికి బేబీ పౌడరును, మెత్తటి మృదువయిన టవల్‌ను మాత్రమే వాడాలి. వాతావరణం వేడిగా ఉండి, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పాపాయిని వాతావరణంలోని వేడి బాధించకుండా, పాపాయి ఉండే గది చల్లగా ఉండేలా చూడాలి. పాపాయి గోళ్ళు పొడుగు పెరగకుండా స్నానం చేయించిన వెంటనే వాటిని జాగ్రత్తగా తీసెయ్యాలి.

*#పాపాయికి_రాషెస్‌_ఏర్పడి_నివారణనవీన్ సలహాలు* _చర్యలు 
చేపట్టినప్పటికీ, 3,4 రోజుల వరకూ తగ్గకుండా చర్మం ఎర్రబడి పాపాయికి బాధకలుగుతుంటే డాక్టరును సంప్రదిం చాలి. రాషెస్‌ బాధవల్ల పాపాయి హాయిగా నిద్రపోలేక చిరాకుగా ఉన్నా పాపాయి నలతగా ఉండి ఏడుస్తున్నా, జ్వరం వచ్చినా వెంటనే డాక్టరుకు చూపించి తగిన సలహాలు పొందాలి. పాపాయి లేత చర్మానికి బాధ లేకుండా సంరక్షించాలి.
*చికిత్స :*
రాషెస్‌ ఏర్పడినప్పుడు వైద్య సలహాతో కాలమిన్‌ లోషన్‌ను పాపాయి చర్మానికి రాయాలి.
సిట్రజైన్‌ సిరప్ 2.5 మి.లీ. రోజుకు 2-3 సార్లు వాడాలి .
మరీ తీవ్రతమైన రాషెస్ కు డాక్టర్ సలహా పై ... ప్రెడ్నిషలోన్‌(kidpred) లేదా బీటామెథజోన్‌(బెట్నిసాల్) ఓరల్ డ్రాప్స్ వాడాలి .
నిద్ర పోవకపోతే .. క్లోర్ ఫినెరమైన్‌ మాలియేట్ (Avil syrup) సిరప్ వాడవచ్చును .

*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment