Saturday 20 May 2023

గర్భసంచిలో ఈ గడ్డలేంటి? pcod ,cyst ,fibroids,hormone imbalance

గర్భసంచిలో ఈ గడ్డలేంటి? 
pcod ,cyst ,fibroids,hormone imbalance
×××××××××××××××××××××
                గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోననిభయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు.

                గర్భసంచిలో సిస్టర్ గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగాబయటపడుతుంటాయి.

                గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. హార్మోన్లు వీటిని ప్రభావితం చేస్తుందన్నది.

 అధిక రుతుస్రావం.. నొప్పి.. 
           సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.

చికిత్స ఏంటి? 

 ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు  హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి.

సైడెఫెకక్ట్స్:  
               అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి.సంతానంలేనివారికి పనికిరాదు అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల  ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు.  కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు. 

ఆయుర్వేదం చెప్పే కారణాలు:

ఇవిరావడానికి ప్రధాన కారణం  ఆహారపుటలవాట్లు కారణంగా భావించవచ్చు... సకాలంలో వివాహం ఐన స్త్రీలకు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కనిపించుటలేదు... నవీన నాగరికత ప్రభావం వలన వివాహం ఆలస్యం కావడం... ఆలోచనలను సినీమాలు ప్రేరేపించడం ... అలా ఏర్పడిన మానసిక వత్తిడే ఈసమస్యకు కారణమనిపిస్తోంది... యోగాభ్యాసం ధ్యానంచేయుటచేత ఇవి అదుపులోకిరావడం కనిపించింది..
అశోక, 
నాగకేసరాలు , 
భూమ్యామలక,
దూసరాకు (పైనపట్టుగావేయుట)
  కూడా సమస్యను తగ్గించడం గమనించడం జరిగింది... 
ఏదైనా చిట్కా వైద్యంవలన ఫలితం తాత్కాలికం.. సున్నితమైన ఆయుర్వేదమే చక్కని పరిష్కారం.
ఆయుర్వేదం అనే అత్యుత్తమ వైద్య విధానం:
            ఏ విధమైన సైడెఫెక్ట్స్ లేకుంకుండా కేవలం మందులతోనే సంపూర్ణంగా, శాశ్వతంగా నివారించవచ్చు. 
సూదులు, దబ్బళాలతో పొడవాల్సిన పని లేదు. గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా సంతానం కలుగునట్లు అత్యుత్తమ చికిత్స కలదు.

K. Hanmanthrao panthulu
 Ayurvedic physician:
Cell..9949363498

No comments:

Post a Comment