Thursday, 1 June 2023

కీళ్ళ నొప్పులకు --- తైలం

కీళ్ళ నొప్పులకు ---  తైలం             

ఆముదపు  వేర్ల పై బెరడు దంచినది అర కిలో
అల్లం       పావు కిలో
ఆముదం -____పావు కిలో
ఆవాలనూనే _____అరకిలో
మంచి నీళ్ళు ----- రెండు లీటర్లు

  ఒక పాత్రలో  , వేర్లను,అల్లం ముద్దవేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి అర కిలో కషాయం మిగిలే వరకు కాచాలి  దానిని వడకట్టి పాత్రలో పోసి దానిలో ఆముదం,ఆవనూనె పొయ్యాలి. కషాయం ఆవిరై నూనె మిగిలే వరకు కాచాలి. స్టవ్ ఆపి వడకట్టాలి.,

    వడకట్టిన కొంచెం  వేడిగా ఉండగానే 50 గ్రా ముద్ద కర్పూరం కలపి మూతపెట్టి .చల్లారినతరువాత సీసా లో భద్రపరచాలి.

 తైలాన్ని నొప్పుల మీద మృదువుగా మర్దన చేస్తే ఎటువంటి నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.స్నానికి గంట  ముందు చెయ్యాలి.

ఇది మడమశూల, సయాటికా, తుంటినొప్పి,మోకాలు, మోచేతి నొప్పులు అన్ని తగ్గుతాయి.మర్దన
తరువాత కాపడం పెట్టాలి.

కాపడం పెట్టె విధానం :-- పాత ఇటుక రాయిని పొడి చేసి,వేయించి గుడ్డలో వేసి కాపడంపెట్టాలి.ఇది తప్పనిసరి.. కాపడం పెట్టిన తరువాత వ్యాయామం చెయ్యాలి. ఆహార నియమాలు పాటించాలి

No comments:

Post a Comment