Sunday, 18 June 2023

షుగర్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఐది శాశ్వతంగా తగ్గిపోతుందా?

*షుగర్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఐది శాశ్వతంగా తగ్గిపోతుందా?వైద్య నిలయం సలహాలు*
డయాబెటీస్ వున్న వారు చాల వరకు షుగర్ వాడకం తగ్గించడం పై దృష్టి పెడతారు కాని ఉప్పు వాడకం పై నియంత్రణ మరచి పోతారు కారణం గా కళ్లు , మూత్ర పిండిలో, గుండె, మాయని గాయాల వల్ల పుండ్లు పడి గాంగ్రీన్ గా మారి శరీరంలోని ఆయా భావాలను తొలగించ వలసి రావటం. కనుక మధుమేహ రోగులు క్రమ బద్దమైన జీవితం గడపాలి. డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడటం, రోజూ కాలి నడక, టైమ్ కు ఆహారాన్ని తీసుకోవాలి. టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి.

(1) షుగర్ వ్యాది వున్న వారికి కొంత కాలం తరువాత బీ.పీ కూడా తోడవుతుంది కనుక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.

(2) నడకను వదలకుండా చేయాలి మినిమమ్ ఒక రోజుకు కనీసం 4,000 అడుగల నుంచి 8,000 అడుగులు మన వీలును బట్టి ఇన్ spells లో చేయాలి. ఇక నడక వేగం శరీరం పర్మిట్ చేసిన మేరకు చేయాలి.

(3) రెగ్యులర్గా టైమ్ ప్రకారం భోజనం చేయాలి.

(4) రైస్ ను అవాయిడ్ చేసి జొన్న, సజ్జ, గోదుమ రొట్టెలను మధ్యాహం మరియు రాత్రి తినాలి.

(5) మందులను రెగ్యులర్ గా వేసుకోవాలి.

(6) టీ మరియు కాఫీలను తీసుకోవడం మానాలి. వాటి స్థానంలో లెమన్ టీ, అల్లం టి 🍵 తీసుకోవడం మంచిది.

(7) నడక తో పాటు తేలికపాటి వ్యాయామాలను మన శరీరం సహకరించిన మేరకు చేయాలి.

(8) ఆయిల్ ఐటమ్స్ వడియాలు, అప్పడాల లాంటివి అవాయిడ్ చేయాలి.

(9) టెన్షన్ నుంచి వీలయినంత దూరంగా వుండాలి.

(10) ప్రతి వారానికి ఒకసారి ఇంట్లో గ్లూకోమీటర్ తో షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవలి, అలాగే బీ.పీని కూడా మానిటర్ చేసుకోవాలి.

(11) ప్రతి 3 నెలలకు మరియు 6 నెలల కొకసారి వైద్యుడని సంప్రదించాలి. (హెల్త్ చెకప్స్).

(12) తగినంత నిద్ర 💤 చాలా అవసరం.

నియంత్రణ, క్రమశిక్షణ వుంటే చాలు డయబెటీస్ ప్రమాదకారం కాదు. ఇది శాశ్వతంగా తగ్గిపోదు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి,
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://fb.me/2OtswwKUi

No comments:

Post a Comment