Monday, 26 June 2023

ఎక్కిళ్ళును నివారించడానికి ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం

*ఎక్కిళ్ళును నివారించడానికి ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం*
           చాలామందికి ఎక్కిళ్ళు భోజనం చేసి సందర్భంలో గానీ లేదా ఏదో ఒక ఇతర కారణాలు గాని ఎక్కుళ్ళు తరుచుగా వస్తూ ఉంటాయి. ఎక్కిళ్ళు ఒకసారి వచ్చినాయి అంటే కొందరికి అయితే ఆ రోజంతా ఉంటాయి. ఎగ శ్వాస వచ్చి కొన్ని సార్లు బాగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది.


*అయితే ఎలా తగ్గుతాయి అంటే :*

1.-నీళ్లు కొద్దికొద్దిగా తాగడం వల్ల ఎక్కిళ్ళు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
2.- గాలిని బిగబట్టడం వల్ల కూడా ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది.
3.- చల్లటి నీళ్లు నోట్లో పోసుకొని కాస్త పుక్కలించి కొద్ది కొద్దిగా నీళ్లు తాగితే ఎక్కుళ్ళు తగ్గడానికి అవకాశం ఉంది.
4.-  గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా తేనె కలుపుకొని తాగి నోరు పుక్కిలించిన సరే కొంత తేడా ఉంటుంది.
5.- నోట్లో కాస్త పంచదార వేసుకొని చప్పరించడం వల్ల కూడా కొంత ఉపశమనం దొరుకుతుంది .
6.- నిమ్మరసం గానీ ఏదైనా పుల్లటి పదార్థాన్ని నాలుక మీద పిండి చప్పరించినట్టయితే కూడా ఎక్కుళ్ళు తగ్గుతాయి.
7.- అదే చంటిపిల్ల లేనట్టయితే పిల్లల్ని బోర్లా బండ పెట్టి వీపు మీద మెల్లగా రుద్దితే తగ్గే అవకాశం ఉంది.
8.- అది పెద్ద పిల్లలు అయితే గొంతుక కూర్చో బెట్టడం. మోకాళ్లు, ఛాతీ ఆనెలా కూర్చో పెట్టాలి.
9.- ఇంకా తగ్గకపోతే సొంటిలో బెల్లం కలిపి చిన్న ఉండలాగా చేసి మింగిస్తే కూడా ఉపశమనం ఉండవచ్చు.
10.- లవంగం బుగ్గన పెట్టుకొని రసాన్ని మింగుతా ఉంటే ఆగుతాయి.
11.- చెరుకు రసం ఐస్ లేకుండా తాగితే ఉపశమనం ఉంటుంది.
12.- గోరువెచ్చటి పాలలో పంచదార కలుగుతాయి మేలు జరగవచ్చు.
13.- జామ పండ్లు తింటే కూడా ఎక్కుళ్ళు తగ్గవచ్చు.
ఇక ఇంతకు తగ్గని సందర్భంగా వచ్చినట్లయితే డాక్టర్ గారిని సంప్రదించడం మంచిది.✍️
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*
(ఇటువంటి సలహాలు నా దగ్గర వచ్చే వాళ్ళు నుండి నేర్చుకున్న  కొంత నేర్చుకోవడం జరిగింది. అనేక పుస్తకాలు చదవడం ద్వారా కొన్ని తెలుసుకున్నాను. ఈ సలహాలు సూచనలు అందరికీ సరిపోతాయని చెప్పలేము. ఈ వైద్యపరమైన అంశాలలో ఎప్పుడైనా నిపుణుల సలహాలు పాటించడమే మంచిది.)
         This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment