Wednesday, 28 June 2023

వాతం తగ్గాలంటే

*_#వాతం తగ్గాలంటే....._*
*****

*_జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే శుద్ధమైన వంట నూనెలు వాడాలి. శుద్ధమైన నూనె అంటే నాన్-రిఫైన్డ్ నూనె ( Refined Oil ) అని అర్ధం. అంటే నూనెలో ఏమి కలపకుండా గానుగ నుంచి సరాసరి తీసిన నూనెను వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది. బాగా జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి సువాసనగా ఉంటుంది._*

*_నూనెలో ఉండవలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధం మరియు ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెను రిఫిన్డ్ చేసినప్పుడు జిగురు, వాసన, చిక్కదనం పోతాయి. ఇంక అందులో ఉండేది  నూనె కాదు నీళ్ళు మాత్రమే. ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉండదు. మనం తీసుకొనే ఆహారం అలాగే నూనె నుండి మన శరీరంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది.  మనం శుద్ధమైన నూనె తీసుకున్నప్పుడు శరీరంలో లివర్ సహాయంతో మంచి కొలెస్ట్రాల్ (HDL) ఎక్కువ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలి. భారతదేశంలో 50సం" పూర్వం వరకు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ లేవు._*

*_రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసేటప్పుడు 6రకాల హానికరమైన కెమికల్స్ డబల్ రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసేటప్పుడు 13రకాల హానికరమైన కెమికల్స్ వాడతారు. ఈ ఆయిల్స్ మనం వాడటం వలన ముందు ముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ లో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన, ప్రోటీన్స్ ఏమి ఉండవు._*

*_పామోలిన్ ఆయిల్ కూడా చాలా హానికరమైన ఆయిల్. దీనిని వాడే వారికి మొదటగా మలబద్దకం వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలం. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేధించారు. వారు ఏ విధంగా కూడా ఈ పామోలిన్ వాడటంలేదు. ప్రపంచంలో ఒక్క భారతదేశంలో మాత్రమే ఉపయోగిస్తున్నారు. మనం మన సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏదైతే చేయాలో అది మాత్రమే చేయాలి. శుద్ధమైన నూనెను వాడితే మనం జీవితాంతం ఆరోగ్యంగా జీవించవచ్చును._*

*_"వాతాన్ని" నివారించడానికి శుద్ధమైన నూనె వాడాలి. "పిత్తాన్ని" నివారించడానికి దేశవాళీ ఆవునెయ్యి వాడాలి. మరియు "కఫాన్ని" నివారించడానికి బెల్లం మరియు తేనె వాడటం మంచిది. అలాగే కుస్తీ, జిమ్, రన్నింగ్ చేసేవారికి గేదె నెయ్యి మంచిది._*

*_ఇంక రోగాలకు రారాజు వాత రోగాలు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, పక్షవాతం, గుండె జబ్బులు మొదలగునవి మన శరీరంలో వాతం పెరగటం వలన వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే శుద్ధమైన వంట నూనెలు (వేరుశెనగ, కొబ్బరినూనె, నువ్వుల నూనె, కుసుమ నూనె) వాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది._*
      
*_"వంటలలో గానుగ నూనె వాడండి - జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి"._*

No comments:

Post a Comment