Saturday 24 June 2023

తాటిబెల్లంను_ఆయుర్వేదంలో_ఏఏ_జబ్బులను_నయం_చేయడానికి_ఉపయోగిస్తారు_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి సలహాలు

*తాటిబెల్లంను_ఆయుర్వేదంలో_ఏఏ_జబ్బులను_నయం_చేయడానికి_ఉపయోగిస్తారు_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి సలహాలు*

తాటి బెల్లం - ఇది మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే మనం రోజూ తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు.

తాటి బెల్లం లో దేవుడు ప్రసాదం సహజసిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు. ఉంటాయి మరియు తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు.

తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది.

*ఆహారాన్ని జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ఆహారాన్ని జీర్ణం చేయటానికి ఆహారాన్ని తీసుకున్న తరువాత చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తోంది మరియు పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది.*

తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది .ఇది మీ రక్తంలో హేమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది మరియు ఆస్తమా ని తగ్గిస్తుంది. మరో వైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నిమంత్రిస్తుంది. ఇదిలో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, మరియు భాస్వరం సమృద్ధిగా ఉంటాయి.

తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి మరియు వీర్య వృద్ధి కలుగును.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0ARmf9M2PZcajZQCjnaYo1PCL1BQoJfmHC8TtS719YA6GzBoCn1AHq1NwYMtJuMGGl&id=1536735689924644&mibextid=Nif5oz
తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు మరియు చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విషపదార్థాలను బయటికి పంపించి, ప్రేగు కాన్సర్ రాకుండా చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది!

తాటి బెల్లం లో ఫైబర్ల ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్స్ మలబద్ధకం మరియు అజీర్తి చికిత్సకు సహాయపడతాయి. శరీరంలో హానికర టాక్సిన్స్ ను బయటకి పంపిస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. వాస్తవానికి, ఇది పొడి దగ్గు . ఆస్త్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారింపబడుతుంది.

*మైగ్రెయిన్ అన్ని తలనొప్పికి చాలా బాధాకరమైనది. తాటి బెల్లం ఒక్క సహజ ఔషధ కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 tsp తాటి బెల్లం తీసుకుంటే మైగ్రెయిన్ తలనొప్పి తగ్గుతుంది.*

తాటి బెల్లం లో ఉండే పొటాషియం కొవ్వును కరిగించడంలో, అధిక బరువును తగ్గించడంలో మరియు బీపీ ని కంట్రోల్ చేయడంలో ఉపకరిస్తుంది. లివర్ కి స్నేహకారిగా ఉంటుంది. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అనీమియా(రక్తహీనత)సమస్యను నివారిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వేడిని తొలగిస్తుంది.

షుగర్ కంట్రోల్ ఉండే షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. దీనిని రోజు 25-30 గ్రాముల వరకు తీసుకోవచ్చు.

*తాటి బెల్లం కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కొనాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువ కల్తీ జరుగుతుంది* దీనిలో మామూలు చక్కెరతో చేసిన బెల్లం కలిపి అమ్ముతారు కాబట్టి మనకు తెలిసిన ఉన్న దగ్గర కొనుక్కోవడం మంచిది.

ఇది ఎక్కువగా గుంటూరు జిల్లా నిజామా పట్నం మండలం కాలిలో దొరుకుతుంది అలాగే గోదావరి జిల్లా నిడదవోలు,తాడేపల్లిగూడెం,చాగల్లు,కొవ్వూరు,పెదవేగి దేవరపల్లి,గోపాలపురం,భీమవరం,వీరవాసరం,తణుకులో ఎక్కువగా దొరుకుతుంది.

చివరగా ఒక స్నాక్ ఐటం -

తాటి బెల్లం నువ్వుల లడ్డు.

(1) 2 కప్పుల తాటి బెల్లం, (2) 2 కప్పుల నువ్వులు. తయారు చేయడానికి సమయం

5 నిమిషాలు.
*#విధానం:*

తాటి బెల్లం కోరి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఒక గిన్నెలో నువ్వులు తీసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి. వచ్చిన నువ్వులు మరియు తాటి బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ నుంచి మిశ్రమాన్ని తీసి చిన్న చిన్న ఉండలు కింద చేసుకుంటే తాటి బెల్లం ఉండలు తయారవుతాయి.

ఇవి చిన్న పిల్లలకు / ఎదిగే పిల్లలకు అమితమైన బలం ఇస్తుంది.
*ధన్యవాదములతో🙏*
Naveen Nadiminti 
*సెల్ -9703706660*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA

No comments:

Post a Comment