Wednesday 14 June 2023

మజిల్ క్రాంప్ (కండరాలు పట్టివేత)కు కారణాలు.. తీసుకోవల్సిన జాగ్రత్తలు👩🏽‍⚕️

మజిల్ క్రాంప్ (కండరాలు పట్టివేత)కు కారణాలు.. తీసుకోవల్సిన జాగ్రత్తలు👩🏽‍⚕️*



 *మజిల్ క్రాంప్. నరాలు పట్టేయడం. ఇది ఒక సాధారణ సమస్య. సాధారణంగా ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ బాధ మాత్రం చాలా ఎక్కువే. రాత్రి సమయంలో నిద్రలో ఉన్నట్టుండి పిక్కలు, కండరాలు పట్టేయడం చాలామందికి బాధాకరమైన అనుభవం. మండుటెండలో చెమట పట్టేలా కష్టపడుతున్నప్పుడు ఉన్నట్లుండి తొడ కండరాలు పట్టేసి విపరీతమైన బాధతో కుంటుతూ నడిచారా? బాగా చలిలో వేళ్లు కొంకర్లు పోయినట్లుగా అయిపోయి మీరెంత ప్రయత్నించినా నొప్పితో అవి అలాగే బిగుసుకుపోయి అతి తీవ్రమైన బాధను అనుభవించారా? పై అనుభవాల్లో ఏదో ఒకటి మీకు ఎదురయ్యే ఉంటుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలోనైనా అనుభవించే బాధ ఇది. దీనికి గల కారణాలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలను తెలుసుకుందాం.. మజిల్ క్రాంప్ కు కారణాలు: మజిల్ క్రాంప్స్‌కు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి కొన్ని..*

*"ఎండలో పనిచేసినప్పుడు":*

*ఎండలో తీవ్రమైన శారీరక శ్రమ చేసినప్పుడు చెమట రూపంలో శరీరం నుండి ఖనిజ లవణాలు (అందులోనూ ప్రధానంగా సోడియం) తగ్గిపోవడం. ఎండలో శ్రమ పడటం వల్ల చెమట రూపంలో శరీరంలో నీటి పాళ్లు తగ్గడం (డీ-హైడ్రేషన్) శరీరంలో క్యాల్షియమ్ తగ్గడం హైపోథైరాయిడిజమ్ మయోసైటిస్ చలికాలంలో కండరాలు సంకోచించడం ఎక్కువగా జరగడం.*

 *"సోడియమ్(ఉప్పు) తగ్గడం వల్ల" :*

*మనం శారీరక శ్రమ చేసినప్పుడు చెమటతో పాటు ఉప్పు రూపంలో సోడియమ్ పరమాణువులను కూడా చాలా వరకూ కోల్పోతాం. సోడియమ్ తగ్గడం వల్ల శరీరంలోని కండరాలు...ముఖ్యంగా పిక్క, తొడ, భుజం కండరాలు పట్టేసినట్లుగా నొప్పికి గురవుతాయి. అందుకే చాలామందికి ఎండాకాలంలో తరచూ ఈ సమస్య ఎదురవుతుంది. వేసవికాలంలో క్రికెటర్లు ఈ సమస్యకు గురవుతుంటారు. ఇంకా కొందరిలో విరేచనాలు, వాంతులు ఎక్కువగా అయినప్పుడు కూడా సోడియమ్‌ను కోల్పోతారు. అలాంటివారిలో కూడా ఒంటిలో నొప్పులు రావడం, నీరసపడిపోవడం జరుగుతుంది.*

*"క్యాల్షియమ్ కోల్పోవడం వల్ల" :*

*క్యాల్షియమ్ తగ్గడం వల్ల మజిల్ క్రాంప్స్ రావడం అన్నది మహిళల్లో కాస్త ఎక్కువ. దీనికి రెండు కారణాలు. మహిళల్లో చాలా మంది క్యాల్షియమ్ అధికంగా ఉండే పాలు, పెరుగు, గుడ్లు, ఆకుకూరలు వంటివి చాలా తక్కువగా తీసుకుంటారు. వారు కుటుంబ సభ్యులకు తినిపించడంపై ఎక్కువగా శ్రద్ద తీసుకుంటారు అయితే వారు తినడానికి రెండో ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంది.*

 *"హైపోథైరాయిడిజమ్" :*

*మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గడం వల్ల వచ్చే వ్యాధిని హైపోథైరాయిడిజమ్ అంటారు. హైపోథైరాయిడ్ ఉన్నవారికి మజిల్ క్రాంప్స్ ఎక్కువగా వస్తుంది. ఇది ఏ వయస్సు వారికైనా రావచ్చు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే ఎక్కువ దూరం పరుగెత్తలేరు. మహిళలకైతే రాత్రి సమయంలో పిక్కలు నొప్పిపెడుతుంటాయి. మగవారు కూడా ఎక్కువ దూరం నడవలేరు. కొద్దిదూరం నడిచాక మళ్లీ నడవడానికి కొంత సేపు విశ్రాంతి తీసుకోవాల్సిందే. అంతేకాదు...ఈ సమస్య ఉన్నవారికి బరువుపెరగడం, ఎక్కువగా నిద్రపోవడం, ఆకలి మందగించడం, చలికి తట్టుకోలేకపోవడం, మలబద్దకం, బీపీ పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.*

 *"మయోసైటిస్" :*

 *ఇది సాధారణంగా పిల్లల్లో (ఐదేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు వారికి) ఎక్కువగా కనిపించే వ్యాధి. అయితే ఇది ఏ వయసువారికైనా రావచ్చు. దీనిలో పిల్లలు ఒక కాలు నొప్పిగా ఉందని చెబుతుండటం, కుంటుతూ నడుస్తుండటం సాధారణంగా కనిపిస్తుంటుంది. మరికొందరిలో రెండు కాళ్లూ నొప్పిగా ఉండి అసలు నడవలేని పరిస్థితి కనిపిస్తుంటుంది.*

*"శరీరం ద్రవాలు కోల్పోవడం (డీ-హైడ్రేషన్)" :*

*సాధారణంగా మన శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల కండరాలు అకస్మాత్తుగా బిగుసుకుపోతాయి. వాంతులు, విరేచనాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ముందుగా చెప్పుకున్నట్లు ఎండలో ఎక్కువగా తిరగడం, శారీరక శ్రమ అధికంగా చేయడం వల్ల కూడా ఇలా కావచ్చు.*

*"చలి వల్ల వచ్చే మజిల్ క్రాంప్స్" :*

*మజిల్ క్రాంప్స్ చలికాలంలో శరీరంలోని కండరాలు ఎక్కువగా సంకోచిస్తాయి. ఇది చాలా సాధారణం. ఐతే కొందరిలో ఈ సంకోచించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో కండరాలు బిగుసుకుపోయి విపరీతమైన నొప్పి వస్తుంది.*

*ఒత్తిడి'' :* 

*ఒత్తిడికి గురైనప్పుడు వాళ్ల శరీరంలో అయనిక్ క్యాల్షియమ్ పాళ్లు తగ్గి మజిల్ క్రాంప్స్‌కు దారితీస్తుంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా మజిల్ క్రాంప్స్ ఎక్కువగా వస్తుంటాయి. పని ఒత్తిడి, రోజూ ఉండే టైట్ షెడ్యూల్డ్, సాధించాల్సిన టార్గెట్స్ వంటి అంశాలతో... తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు గాలి ఎక్కువగా పీల్చుకోడం వల్ల ఈ మజిల్ క్రాంప్ సమస్య అధికంగా ఉంటుంది.*

 *"పొగత్రాగడం" :*

*ఎక్కువగా సిగరెట్ తాగే వారిలో ఈ మజిల్ క్రాంప్ కనిపిస్తుంటుంది. ఈ సమస్య ఎదురైనప్పుడు పొగత్రాడం పూర్తిగా మానేయాలి.*

 *మద్యపానం" :*

*ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలోనూ ఇది కనిస్తుంటుంది. ఆల్కహాల్ వల్ల కండరాలు ఎక్కువగా ఉత్తేజితం కావడం వల్ల కూడా మజిల్ క్రాంప్స్ వస్తాయి.*

*"నివారణ''  :*

*1. వేసవిలో వచ్చే మజిల్ క్రాంప్స్(నరాల పట్టివేత) నివారణ కోసం ఎండలో ఎక్కువగా కష్టపడకుండా జాగ్రత్త పడాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం నుండి ద్రవాలను కోల్పోకుండా చూసుకోవడం. ఒకవేళ ఎక్కువగా ద్రవాలను కోల్పోయే పరిస్థితి ఉంటే ఉప్పు కలుపుకున్న లెమన్ జ్యూస్ లేదా మంచి నీరు తాగడం. ఇంకా కొబ్బరినీళ్లు, శుభ్రమైన మంచినీరు తాగడం. తాజాపండ్లు ఎక్కువగా తినడం... పై జాగ్రత్తల వల్ల శరీరం కోల్పోతున్న సోడియమ్ తిరిగి పొందడానికి వీలవైతుంది.*

*2. క్యాల్షియమ్ లోపం వల్ల మజిల్ క్రాంప్స్ వస్తుంటే క్యాల్షియమ్ సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. దానికి మనం తినే ఆహారంలో పాలు, పాల ఉత్పాదనలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.*

*3. చలి కారణంగా వచ్చే మజిల్ క్రాంప్స్‌ను నివారించడానికి ఉన్ని దుస్తులు ధరించాలి. చలికి ఎక్కవగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.*

*4. పొగతాగడం, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయాలి.*

*5. ఒత్తిడి వల్ల కూడా మజిల్ క్రాంప్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి కారణాలను కనుగొని ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.*

*6. హైపోథైరాయిడిజమ్ వల్ల వచ్చే మజిల్ క్రాంప్స్‌ను తగ్గించడానికి తగిన చికిత్స తీసుకోవాలి.*

 *7. ఇలా జరిగినప్పుడు ఆందోళనకు గురికాకుండా... పట్టేసిన పిక్కల్లో కండరాలు వదులయ్యేలా చేతితో మసాజ్ చేస్తున్నట్లుగా రాస్తూ.. JB. మెల్లగా నడవడం వల్ల దూరం చేయవచ్చు. అలా చేస్తూ మెల్లమెల్లగా నడవడానికి ప్రయత్నిస్తే కాసేపట్లోనే పరిస్థితి చక్కబడుతుందిమె.*

*8. పొటాషియమ్ ఎక్కువగా ఉండే ఒక అరటిపండు తింటే ఆ సమస్య వెంటనే రాదు.*

💠💠

No comments:

Post a Comment