Tuesday 6 June 2023

రోజూ_ఉదయం_బాత్రూమ్‌తో_ఒకేసారి_పని_అయిపోవాలంటే_ఏం_చేయాలి?

*రోజూ_ఉదయం_బాత్రూమ్‌తో_ఒకేసారి_పని_అయిపోవాలంటే_ఏం_చేయాలి?*అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు*

       సుఖ విరేచనం అన్నది మన శరీరానికి మనం పెట్టే ఫంక్షనల్ టెస్ట్. అది గనుక పాసయితే చాలా రోగాలు మన దరిజేరవు. నేను ఇక్కడ చెప్పేదంతా సబ్జెక్టివ్… నా విషయంలో మాత్రం ఫలితం కనిపించింది అని ముందే తెలియజేస్తున్నాను.

1.-తగినంత నీరు తీసుకోండి   అంటే దాదాపు రెండు నుంచి రెండున్నర లీటర్లు. వాటిని రోజంతా తాగేలా చూసుకోండి ఒకేసారి కాకుండా…
2..-ప్రతిరోజూ ఉదయం ఒక అరగంటయినా నడవండి. షటిల్, లాన్ టెన్నిస్ లేదా ఇతర క్రీడలు ఆడితే ఇంకా మంచిది… (బాగా చెమట పట్టేలా చేసే ఏ ఆటయినా ఫర్లేదు… మోకాళ్ళ నొప్పులు ఉంటే, సైక్లింగ్ లేదా ఈత మంచిది.)
3.-మంచి నిద్ర పట్టేలా చూసుకోండి. (దాదాపు అయిదారు గంటలు)
4-పాల పదార్ధాలు, గోధుమలకు సంబంధించిన ఎటువంటి intolerance ఉన్నా గానీ, వాటిని మానేయడం ఉత్తమం. చాక్ లెట్లు, బిస్కెట్లు, మైదాతో చేసిన బేకరీ పదార్ధాలు మానేయండి. (నేను దాదాపు ఒక దశాబ్దం నుంచి వీటిని ఆహారంలో తీసుకోవడం పూర్తిగా మానేసాను. అవి మానిన తర్వాత నాకున్న రుగ్మత పూర్తిగా తగ్గిపోయింది.) పాలతో చేసిన కాఫీ, టీ లు మానేయండి. కావాలంటే బ్లాక్ కాఫీ, గ్రీన్ టీలు తీసుకోండి. బార్లీ తో చేసిన బీర్లు, మందు మానేయండి. సిగరెట్ల అలవాటు కూడా మంచిది కాదు.
5.- మాంసాహార భక్షణ -ఆల్కహాల్ దూరం చేయాలి. తేలికగా జీర్ణమగు ఆహారం -పండ్లు -పీచు (ఫైబర్ ) ఎక్కువ ఉండు ఆహారం, పలుచని మజ్జిగ , సమృద్ధిగా మంచి నీరు తాగుట. మంచి  మలవిసర్జన బలవంతపు వెడలగొట్టుట ఎన్నడూ చేయరాదు. ఇవి పాటిస్తే మలద్వార వాపు , తీపు , మల విసర్జన సమయమున నొప్పితో రక్తం స్రవించుట క్రమముగా తగ్గి ఉపశమనం మందులు -సర్జరీ అవసరం లేకుండా చేయ వచ్చును. మీకు అభ్యంతరం లేకుంటే
*Ficus Rel - Aesculas Hip* అను
 హోమియో మదర్ టింక్చర్స్ ఐదు డ్రాప్స్ కొద్దీ నీళ్లలో వేసుకుని రోజుకురెండు మార్లు పుచ్చుకోండి. తగ్గి పోవును.
6.-ఆనిమల్ ప్రోటీన్స్ విషయంలో కూడా మీకు ఇబ్బందిని కలిగించే వాటిని మానేయండి లేదా తక్కువ మోతాదులో తీసుకోండి. (కొందరికి పౌల్ట్రీ పడదు, మరికొందరికి చేపలు లేదా రొయ్యలు పడవు. మటన్ తీసుకోడం కూడా మలబద్ధకాన్ని పెంచుతుంది)
7.-మలబద్ధకాన్ని తగ్గించే ఆయుర్వేద ఉత్పత్తులు త్రిఫలా చూర్ణం, చ్యవన్ ప్రెష్ 
8.-నూనెల్లో దేవిన వంటకాలు, వేపుళ్ళు లాంటివి తక్కువ మోతాదులో తీసుకోండి.
ఉదయం మంచి అల్పాహారం తొమ్మిది లోపు, మధ్యాహ్నం ఒకటి లోపు లంచ్, సాయంత్రం ఏడు లోపు డిన్నర్ చేసేయండి. రాత్రి ఎంత ఎక్కువ లేటుగా అన్నం తింటే అంత ఎక్కువ ఇబ్బంది. రెండు భోజనాల మధ్యన చిరుతిళ్ళు వద్దు. అలానే
9.--కడుపును 14 నుంచి 16 గంటల పాటు ఖాళీగా ఉంచుకోండి. ఏది తిన్నా ఆ మిగిలిన ఎనిమిది / పది గంటల్లోనే…
10.-మీకు హైటస్ హెర్నియా లాంటి కండిషన్ ఉంటే తల వైపు మంచం ఎక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోండి.
11.-ఆహారాన్ని చిన్నగా నమిలి తినండి; గబగబా తినొద్దు. ఒకేసారి హెచ్చు మొత్తంలో కూడా భోజనాన్ని తీసుకోవద్దు. ఆవకాయ, మాగాయలు మానేస్తే ఉత్తమం.
12.-మీరు డెస్క్ టాప్ మీద ఎక్కువ పనిచేసే వాళ్ళయితే, ప్రతి గంటకీ ఒక అయిదు నిమిషాల పాటు సీటు మీద నుంచి లేచి అటూఇటూ నడవండి.
13.-ఇంకో ముఖ్య విషయం, చల్లటి ఐస్ క్రీమ్ లు, సాప్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ కూడా మానివేయండి. పచ్చిగా ఉన్న ఆహారపదార్ధాలు కూడా తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.
14కొన్నాళ్ళ పాటు రెగ్యులర్ గా ఫుడ్ చార్ట్ వ్రాసుకోండి. ఇవాళ విసర్జన సాఫీగా జరగలేదంటే నిన్న తిన్నవి ఏవో మీ శరీరానికి పడలేదని అర్థం. గ్యాస్, అసిడిటీ వచ్చినా సరే వాటిని మినహాయించి తీసుకోవడం ఉత్తమం.
         పైన చెప్పినవన్నీ అని కాదు గానీ… కడుపు ఎంత సెన్సిటివ్ గా ఉంటే అన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని పాటించడం మూలాన ఉదయాన్నే లేచిన వెంటనే కడుపు ఖాళీ చేయాల్సిన అవసరం ఉన్నట్లు శరీరం నుంచి సిగ్నల్ వస్తుంది. గ్యాస్ మరియు అసిడిటీ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. ఒకేసారి కడుపు పూర్తిగా ఖాళీ అయ్యిన ఫీలింగ్ వస్తుంది. వాష్ రూమ్ లో రెండు మూడు నిమిషాల్లోనే పని పూర్తవుతుంది. విరేచనం కడ్డీ లాగా కాకుండా సాఫీగా చిన్న చిన్న ముక్కలుగా జరుగుతుంది. ఈ తేడాని మీరు అతి త్వరగా తెలుసుకోగలుగుతారు. ఆల్ ద బెస్ట్….
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
*ఫోన్ - 097037 06660,*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://fb.me/4gjENyeVl
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment