Thursday 1 June 2023

సోరియాసిస్‌_సమస్యకు_సరైన_వైద్యం_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు

*సోరియాసిస్‌_సమస్యకు_సరైన_వైద్యం_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు* 
        
        ఏ వయస్సు వారినైనా ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ప్రభావం ముఖ్యంగా చర్మంపై ఉంటుంది. దీనిలో చర్మం ఎర్రగా మారి, ఆపై క్రమంగా వెండి రంగు పొలుసుల రూపంలో రాలిపోతుంది. సోరియాసిస్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అంటువ్యాధి మాత్రం కాదు.
 
*సోరియాసిస్‌_రకాలుప్లేక్‌ సోరియాసిస్‌:*
ఇది సాధారణంగా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. దాదాపు 80ు సోరియాసిస్‌ బాధితుల్లో ఈరకం వారే ఎక్కువగా ఉంటారు. దీనిలో చర్మంపై ఎర్రటి మందపాటి ప్యాచ్‌లు ఏర్పడి తదుపరి అవి వెండి రంగు పొలుసులుగా మారిపోతాయి.
 
#గట్టేట్‌_సోరియాసిస్‌: దీనిలో చర్మంపై తక్కువ పరిమాణపు ఎర్రని మచ్చలు ఏర్పడతాయి. ప్లేక్‌ సోరియాసిస్‌ తదుపరి స్థాయిలో ఇది కనిపిస్తుంది.

#ఇన్వర్ప్‌_సోరియాసిస్‌: ఇది చర్మపు మడతలలో (ఛాతీ కింది భాగంలో, చంకలలో) కనిపిస్తుంది. దీనిలో చర్మం ఎక్కువ ఎరుపుగా, మృదువుగా మెరుస్తున్నట్లుగా ఉంటుంది.

#పస్టులార్‌_సోరియాసిస్‌: దీనిలో చర్మంపై చీముతో నిండిన పొక్కులు ఏర్పడి, వాటి చుట్టూ ఉండే చర్మం ఎర్రగా ఉంటుంది.

*ఎరిత్రోడెర్మిక్‌_సోరియాసిస్‌:*
            ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. దీనిలో చర్మం కాలిపోయినట్లుగా ఉండి, ఎక్కువ పరిమాణం గల పెద్ద పొలుసులుగా రాలిపోవడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన సమస్యగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిని కూడా కలుగజేసేదిగా ఉంటుంది.వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://m.facebook.com/story.php?story_fbid=2765137637084437&id=1536735689924644
*కారణాలు*
ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు లేవు. కానీ జన్యుపరమైన అంశాలు మరియు పర్యావరణ కారణాల సమ్మేళనంగా ఈ వ్యాధి ఏర్పడుతోందని అనుభవపూర్వకంగా తెలుస్తోంది. అధిక మానసిక ఒత్తిడి, వంశపారంపర్యత, రోగనిరోధక వ్యవస్థలోని అసమతుల్యతల కారణంగా కూడా ఈ వ్యాధి కలుగుతుంది.
 
*లక్షణాలు*
ఈ వ్యాధి లక్షణాలు వారు గురయిన సోరియాసిస్‌ రకాన్ని బట్టి కొన్ని రోజులు అధికంగాను మరికొన్ని రోజులు స్వల్పంగాను ఉంటాయి. సోరియాసిస్‌- తల, మోకాళ్లు, అరిచేతులు, అరిపాదాలు, ఉదరంపై చర్మాన్ని ప్రభావం చేస్తుంది. చర్మం ఎర్రబడటం, సాధారణం నుంచి అతి తీవ్రమైన దురద, చర్మం దళసరిగా మారడం, తదుపరి వెండి రంగు పొలుసులుగా ఊడిపోవడం జరుగుతుంది. తలలో ఏర్పడితే జుట్టు రాలిపోవడం, అరిచేతులు, అరిపాదాల చర్మం పొలుసులుగా ఊడిపోవడం, చర్మంపై పగుళ్లు ఏర్పడటం వలన తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సోరియాసిస్‌ గోళ్లను ప్రభావితం చేయటం జరిగితే అవి పెళుసుబారి దృఢత్వాన్ని కోల్పోయి త్వరగా విరిగిపోతాయి.
 
#నిర్ధారణ_పరీక్షలు
చర్మపు బాహ్య లక్షణాలను పరీక్షించడం ద్వారా సోరియాసిస్‌ వ్యాధిని కొంతవరకూ నిర్ధారించవచ్చు. స్కిన బయాప్సీమరియు ఇతర వ్యాధులేవైనా ఉన్నాయా- లేవా అనే విషయాన్ని కూడా నిర్ధారించవచ్చు.

 #స్కాల్ప్(#తలపై_చర్మము) #సోరియాసిస్_నివారణకు 
             ఒక 50 ఏళ్ళ మహిళ, తల వెనుక భాగంలో స్కాల్ప్ సోరియాసిస్ (తెల్ల పొరలు) సమస్యతో గత పదేళ్ళగా భాధపడుతోంది. ఈమెకు ఈ *కింద వ్రాసిన మందులు ఇవ్వడం జరిగింది:*
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis…TDS in water

#2. CC21.10 Psoriasis …TDS in water పై పూతకు

మూడు రోజుల తర్వాత కొద్దిపాటు ఉపశమనం మాత్రమే కలిగింది. అందువల్ల #1 మోతాదును పెంచడం జరిగింది - ప్రతిరోజు, ఒక గంట వరకు, పది నిమిషాలకు ఒక డోస్. ఈ విధంగా ఒక వారం రోజులు మందు తీసుకోవడంతో, ఈమెకు సోరియాసిస్ 90% వరకు తగ్గింది. #1 మరియు #2 ఒక నెల వరకు TDS మోతాదులో తీసుకోవడం జరిగింది. ఈ విధంగా తీసుకోవడంతో ఈ పేషంటు కున్న సోరియాసిస్ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. అందువల్ల #2 మందును ఆపివేయడం జరిగింది. 2015 ఆగస్ట్ కి ఈమె ఈ మందును రోగ నివారణ కొరకు రోజుకొకసారి (OD) తీసుకుంటోంది.
*ధన్యవాదములు 🙏*
మీ నవీన్ నడిమింటి
 ఫోన్.-9703706660
    *సభ్యులకు విజ్ఞప్తి*
   ******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment