Tuesday, 20 June 2023

థైరాయిడ్_కు_ఈ_సింపుల్_చిట్కా_తో_చెక్_పెట్టండి

*థైరాయిడ్_కు_ఈ_సింపుల్_చిట్కా_తో_చెక్_పెట్టండి..!!*
*అవగాహనా_కోసం Naveen Nadiminti సలహాలు* 
         ఇటీవల కాలంలో లో షుగర్, బీపీ లాగానే థైరాయిడ్ తో బాధపడేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వయస్సు తో తేడా లేకుండా చాలా మందికి వచ్చే సమస్య ఇది.. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో పోషక లోపం వలన లేదంటే హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం వలన ఇది వస్తుంది..
*1.-థైరాయిడ్లో_రెండు_రకాలు_ఉన్నాయి..*
     సాధారణంగా థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో ఉంటుంది. అది థైరాక్సిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఆ హార్మోన్ శరీరంలో జీవక్రియ రేటును నియంత్రిస్తుంది..

థైరాయిడ్ వ్యాధి లో మొదటిది హైపోథైరాయిడ్. దీనివలన శరీరానికి తగినంత మోతాదులో థైరాయిడ్ హార్మోన్లు అందవు ఫలితంగా జీవక్రియ రేటు తగ్గిపోతుంది. మీరు తిన్న ఆహారం అంత త్వరగా శక్తిగా మారదు. దానివల్ల బరువు ఎక్కువగా పెరిగి పోతారు. దానితో పాటు అలసట, నీరసం తోడవుతాయి. ఈ సమస్య తో బాధపడే వారు చక్కటి నవీన్ ఆయుర్వేద చిట్కా తో చెక్ పెట్టవచ్చు..!!
 2.-#థైరాయిడ్_కు_చెక్_పెట్టే_అద్భుతమైన_ఆయుర్వేద_మందు_తయారు_చేసుకునే_విధానం..!!
*కావలసిన_పదార్థాలు :.*
  మిరియాలు 20 గ్రాములు, సైంధవ లవణం 20 గ్రాములు, పిప్పళ్ళు 20 గ్రాములు, ఉసిరికాయ చూర్ణం 20 గ్రాములు, కొడిశ పాల చెట్టు బెరడు లేదా గింజలు 20 గ్రాములు.

ముందుగా వీటిని తీసుకొచ్చి శుభ్రపరుచుకుని అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసా లో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని ఉదయం రాత్రి నీటిలో లేదంటే గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వలన థైరాయిడ్ సమస్య త్వరగా తగ్గుతుంది. నీ ఈ చూర్ణం తీసుకునేటప్పుడు పత్యం పాటించాలి. బంగాళదుంపలు, బచ్చలికూర, బఠాణీలు, వేరు శెనగలు, మెంతికూర తినకూడదు. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఏవి తీసుకోకూడదు. చికెన్, మటన్ తినకూడదు. ఎక్కువగా చల్లగా ఉన్న పదార్థాలు, తీపి పదార్థాలు వంటివి తినకూడదు. ఈ చూర్ణం తో పాటు ఈ పత్యం పాటిస్తే త్వరగా ఫలితాలు కనిపిస్తాయి.పూర్తి ఆరోగ్యం సలహాలు కోసం వైద్య నిలయం లింక్స్
https://m.facebook.com/story.php?story_fbid=640321961227971&id=100057505178618&mibextid=Nif5oz
*హైపో_థైరాయిడ్స‌మ‌స్య_ఉందా_ఈ_ఆహారాల‌ను_తీసుకుంటే_మేలు_జ‌రుగుతుంది.*

ప్ర‌పంచ‌వ్యాప్తంగా థైరాయిడ్ స‌మ‌స్య‌తో అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. ఇందులో రెండు ర‌కాల థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఒక‌టి హైపో, రెండోది హైప‌ర్ థైరాయిడిజం. ఏది వ‌చ్చినా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో హైపో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంటుంది. హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

*1. #చేప‌లు*
చేప‌ల్లో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారికి మేలు చేస్తాయి. ఇవి వాపుల‌ను త‌గ్గిస్తాయి. థైరాయిడ్‌, నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌లను స‌రిగ్గా ప‌నిచేసేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

*2. ప్రొ_బ‌యోటిక్_ఆహారాలు*

పాలు, పాల సంబంధ ఉత్ప‌త్తులను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో థైరాయిడ్ గ్రంథులు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.
*3. #ఫైబ‌ర్*

నిత్యం ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే తాజా పండ్లు, కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. శ‌రీరానికి 30 నుంచి 40 గ్రాముల వ‌ర‌కు ఫైబ‌ర్ అందేలా చూసుకుంటే హైపో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

*4. #కొబ్బ‌రినూనె*

థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారిలో స‌హ‌జంగానే మెట‌బాలిజం క్ర‌మ‌బ‌ద్ద‌గా ఉండ‌దు. దీంతో ఒకేసారి బ‌రువు పెర‌గ‌డ‌మో లేదా స‌డెన్ గా బ‌రువు త‌గ్గ‌డ‌మో జ‌రుగుతుంది. అయితే కొబ్బ‌రినూనెను నిత్యం తీసుకుంటే అందులో ఉండే మీడియం-చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు మెట‌బాలిజంను మెరుగు ప‌రుస్తాయి. దీంతో అల‌స‌ట త‌గ్గుతుంది. అలాగే జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. వాపులు త‌గ్గుతాయి. ఫ‌లితంగా హైపో థైరాయిడ్ స‌‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది.

*5. మొల‌కెత్తిన_విత్త‌నాలు*

మొల‌కెత్తిన అవిసె గింజ‌లు, చియా సీడ్స్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ల‌భిస్తాయి. ఇవి హార్మోన్ల‌ను స‌మ‌తుల్యం చేసేందుకు స‌హాయ ప‌డ‌తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా ప‌నిచేస్తుంది.

*6. #యాంటీ_ఆక్సిడెంట్లు*
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండే పండ్లు, కూర‌గాయ‌ల‌ను తింటే వాపులు త‌గ్గుతాయి. థైరాయిడ్ స‌రిగ్గా ప‌నిచేస్తుంది.

*7. #సూప్*

చికెన్, మ‌ట‌న్ సూప్‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రొలైన్‌, గ్లైసీన్ అనే అమైనో ఆమ్లాలు అందుతాయి. ఇవి జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. అలాగే హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది.

*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
     Naveen Nadiminti
*ఫోన్ -097037 06660*
మన వైద్య నిలయం గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment