* # MUSK MELON / కర్బూజా"*
*_💥 వేసవి కాలంలో సహజంగానే చాలా మంది శరీరాన్ని చల్లబరుచుకునేందుకు రకరకాల పానీయాలను తాగుతుంటారు. కూల్ డ్రింక్స్‌తోపాటు కొబ్బరినీళ్లు, పండ్ల రసాలను ఈ సీజన్‌లో అధికంగా తీసుకుంటుంటారు. అయితే ఈ సీజన్‌లో తినాల్సిన ఆహారాల్లో కర్బూజాలు ఒకటి. ఇవి మనకు ఈ సీజన్‌లో అధికంగా లభిస్తాయి. అయితే వేసవిలో తర్బూజాలను తప్పకుండా తీసుకోవాల్సిందే. దీని వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక కర్బూజాలను తినడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.._*
*_1. 🍈 కర్బూజాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది హైబీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్తం పలుచగా మారుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి._ 🍈*
*_2. 🍈 కర్బూజాలలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే కంటి చూపు మెరుగు పడుతుంది. అలాగే కళ్లలో శుక్లాలు రాకుండా ఉంటాయి._*
*_3. 🍈 కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు వీటిని తింటే రాళ్లు కరిగిపోతాయి. అలాగే కిడ్నీలు ఏర్పడకుంటా ఉంటాయి. కనుక కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు వీటిని రోజూ తినాలి._ 🍈*
*_4. 🍈 మహిళలకు నెలసరి సమయంలో కొందరికి నొప్పులు అధికంగా ఉంటాయి. అలాగే కొందరికి రక్త స్రావం అధికంగా జరుగుతుంది. కానీ ఆ సమయంలో వారు తర్బూజాలను తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు హార్మోన్లు సమతుల్యం అవుతాయి._ 🍈*
*_5. 🍈 కర్బూజాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటే జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. గ్యాస్, మలబద్దకం, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ సీజన్‌లో జీర్ణ సమస్యలు తరచూ వస్తుంటాయి. కనుక కర్బూజాలను తింటే వాటి నుంచి బయట పడవచ్చు._ 🍈*
*_6. 🍈 వేసవిలో మన శరీరంలో ద్రవాలు త్వరగా ఖర్చయిపోతుంటాయి. కానీ తర్బూజాలను తింటే శరీరంలో ద్రవాలు చాలా సేపు అలాగే ఉంటాయి. దీంతో శరరీం చల్లగా ఉంటుంది. వేడి బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది. ఎండదెబ్బకు గురి కాకుండా ఉంటారు. ఇలా కర్బూజాలను ఈ సీజన్‌లో తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక వీటిని ఇప్పుడు కచ్చితంగా రోజూ తీసుకోవాలి._ 🍈*
*_🍈 ఇక కర్బూజాలను నేరుగా తినడం వల్ల చప్పగా ఉంటాయి. కనుక వాటిని ముక్కలుగా కట్ చేసి వాటి మీద కాస్త తేనె లేదా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినవచ్చు. లేదా జ్యూస్ తయారు చేసి కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం అనంతరం రెండు గంటల విరామం ఇచ్చిన తరువాత తర్బూజాలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది._ 🍈*
No comments:
Post a Comment