Friday, 2 June 2023

తెల్ల_పొడ_సోబి_మచ్చలు_పోగొట్టే_ఆయుర్వేదం_లో Naveen Nadiminti సలహాలు

*తెల్ల_పొడ_సోబి_మచ్చలు_పోగొట్టే_ఆయుర్వేదం_లో Naveen Nadiminti సలహాలు* 

*#Vitiligo:*  చర్మవ్యాధులలో బొల్లి కూడా ఒకటి.. బొల్లి అనేది హానికరమైన సమస్య కాదు.. ఇది అంటువ్యాధి కూడా కాదు.. బొల్లి వచ్చిందంటే చర్మం అంతా పూర్తిగా తెల్లగా మారుతుంది.. అయితే ఇది సోకితే మాత్రం మానసికంగా కృంగిపోతారు.. తెల్ల మచ్చలకు, శోభి మచ్చలు కు, బొల్లి కి ఆయుర్వేదం లో అద్భుత చిట్కాలు ఉన్నాయి.. వీటిని తెలుసుకుని పాటిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి..!!

*#శోభి_మచ్చలు_నివారణకు_ఆయుర్వేదం_సలహాలు_నవీన్_నడిమింటి_సలహాలు*
*1.- శోభి మచ్చలు నివారణ*                            
 
       శరీరం మీద తెల్లటి మచ్చలు వుండడం దీని లక్షణం
 
   తులసి ఆకులు  ---- 20--౩౦
       దంచిన పసుపు పొడి     ----  ఒక టీ స్పూను.
 
      రెండింటిని కలిపి అవసరమైతే నీరు కలిపి మెత్తగా నూరాలి. స్నానానికి గంట ముందు శోభి మచ్చల మీద  సున్నితంగా మర్దన చెయ్యాలి. ఎండిపోయిన తరువాత సున్ని పిండి తో స్నానం చెయ్యాలి.
 
*#కడుపులోకి:--*              
   పసుపు             ----- 50 gr
   పాత బెల్లం        ----- 100 gr
 
       రెండింటిని బాగా కలిసి పోయేట్లు దంచి గాజు సీసాలో భద్ర పరచుకోవాలి. ప్రతి రోజు 5 గ్రాముల ముద్దను బుగ్గలో పెట్టుకొని చప్పరించి తిని ఒక గ్లాసు మజ్జిగ తాగాలి.
 
       దీని వలన రక్త శుద్ధి జరుగుతుంది.
 https://fb.me/1334n8rHN
  
 *2.-  శోభి (తెల్ల మచ్చలు లేక సిబ్బెం )*                       
 
కారణాలు :-- పదార్ధాలు కలుషితం కావడం, సున్ని పిండి వాడక పోవడం, తైలం రాయక పోవడం, సబ్బుల   వాడమ ఎక్కువకావడం,  మొదలైనవి.
 
      ఈ మచ్చలు ముఖం మీద శరీరం మీద చాతీ మీద మెడ మీద వస్తాయి.
 
      తైల మర్దన వలన మచ్చలు రాకపోవడమే కాక రక్త ప్రసరణ పెరుగుతుంది. జ్ఞాన ధారణ పెరుగుతుంది.
 
ఉత్సాహం  పెరిగి  ఉల్లాసంగా వుంటారు. అందు వలన చిన్నప్పటి నుండి తైల మర్దన చెయ్యాలి.
  
       "పత్తి గింజలు " కొన్ని ఒక గిన్నెలో వేసి రాత్రంతా నాన బెట్టాలి. ఉదయం వాటిని నూరి మచ్చలపై  రుద్దాలి. మచ్చలు చాలా త్వరగా మాయమవుతాయి.
*3.-  శోభి మచ్చల నివారణ*                                                
 
         100  గ్రాముల రేల చెట్టు యొక్క పచ్చి ఆకులను తెచ్చి కల్వంలో వేసి నిమ్మ రసం వేసి మెత్తగా నూరి  మచ్చలపై పట్టిస్తే శోభి తగ్గుతుంది.  తగ్గే వరకు వాడాలి.

        వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, పోషకాహార లోపం, మత్తు పదార్ధాలు ఎక్కువగా వాడడం, మధుమేహ వ్యాధి   వెంట్రుకల కుదుళ్ళకు చీము పట్టడం, చుండ్రు మొదలగు కారణాల వలన శోభి మచ్చలు ఏర్పడతాయి.
 
గంధకం  (మామూలు గంధకం)
ముల్లంగి రసం
అల్లం రసం
 
        గంధకాన్ని రెండు రసాలతో నూరి శోభి మచ్చలపై పూయాలి. క్రమంగా తగ్గుతాయి.
 
2. ముల్లంగి గింజలు
    ఉత్తరేణి మొక్క రసం
 
       రెండింటిని కలిపి నూరి పూయాలి.
 
3. తగరిస గింజల పొడి
    పుల్లటి గంజి
 
         కలిపి నూరి పూయాలి
 వైద్యం సలహాలు కోసం లింక్స్
https://fb.me/1334n8rHN
4. నల్ల ముళ్ళ గోరింటాకు రసం మచ్చలపై పూస్తే తగ్గుతాయి.
 
5. ముల్లంగి రసం, మజ్జిగ కలిపి పూయాలి.
 
6. ఉత్తరేణి  బూడిద  ఆముదం కలిపి పూయాలి,
 
7.-అరటి చెట్టు కాండం గికితే నీరు లా రసం వస్తుంది. దాన్ని తీసుకొని ప్రతిరోజు బొల్లి మచ్చల పై రాస్తే బొల్లి త్వరగా తగ్గుతుంది. అలాగే అరటి చెట్టు కాండం, ఆకులు తీసుకుని ఎండబెట్టాలి. వాటిని కాల్చి బూడిద చేయాలి. ఈ పొడిని భద్రపరుచుకోవాలి. అర స్పూన్ ఈ పొడికి అర చెంచా తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం, రాత్రి తాగాలి.

 8.-ఒక కేజీ భావంచలు తీసుకోవాలి. ఇవి ఏదైనా ఆయుర్వేదిక మందుల షాప్ లో దొరుకుతాయి. నల్లగా ఉన్న ఆవు మూత్రం లేదా నల్ల మేక మూత్రం తీసుకుని అందులో కిలో భావంచాలు వేసి మూడు రోజులు నానబెట్టాలి. అందులో అరకిలో భావంచాలు గింజలను తీసుకోవాలి. వీటిని ఎండబెట్టి మూత్రంలో కచ్చాపచ్చాగా దంచి, అందులో ఇంకా రెండు లీటర్ల గోమూత్రం పోసి సన్నని మంటపై కాయలి. 750 గ్రాములు అయ్యే వరకు మరిగించాలి తరువాత దించేయాలి. దీనిని వడ కట్టుకొని 250 గ్రాముల నల్ల నువ్వుల నూనె పోసి నూనె మాత్రమే మిగిలి వరకు సన్నని మంటపై మరిగించాలి. ఈ నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె ను ఉదయం, రాత్రి బొల్లి మచ్చల పై పూసి బాగా రుద్దాలి. ఇలా చేస్తే మీ బొల్లి మచ్చలు తగ్గి చర్మ రంగు లోకి వస్తుంది.

పైన అరకిలో భావంచాలు వాడగా మరో అరకిలో భావంచాలు ఉన్నాయి.. వాటిని ఎండబెట్టి మెత్తగా దంచి పొడి లా చేసుకోవాలి. వీటికి ఈ పొడికి అరకిలో నల్లబెల్లం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేరుశనగ అంత పరిమాణం లో ఉదయం, రాత్రి పాలు లేదా నీళ్లలో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వలన బొల్లి సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. దీనిని పాటించే టప్పుడు కచ్చితంగా పత్యం చేయాలి. పుల్లటి పదార్థాలు ఏవి తినకూడదు. గోంగూర, చేపలు, గుడ్లు, చికెన్, మాంసాహారం తినకూడదు. చల్లని పదార్థాలు, కూల్ డ్రింక్స్, చల్లని ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎండలో ఉంటే మంచి ఫలితం లభిస్తుంది.
*ధన్యవాదములు 🙏*
మీ Naveen Nadiminti,
*ఫోన్ 097037 06660,*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment