*లివర్_సిర్రోసిస్‌తో_బాధపడేవారికి_ఈ_ఆయుర్వద_మూలికలు_మేలు_చేస్తాయ్..!*
*అవగాహనా కోసం Naveen Nadiminti సలహాలు*
Liver Cirrhosis: లివర్ మన శరీరంలో ఓ చిన్నపాటి కెమికల్ ఫ్యాక్టరీ అని అనొచ్చు. మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం, పేంక్రియాస్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం జీర్ణం చేసిన తర్వాత హార్మోన్, ఎంజైమ్, ప్రోటీన్, కొలస్ట్రాల్‌ను తిరిగి శరీరానికి అందించే ఫ్యాక్టరీలా లివర్ పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ నిల్వలను ఉంచుకుంటుంది. రక్తంలో గ్లూకోజ్ మితిమీరకుండా చూస్తుంది. రక్తంలో కలిసే వ్యర్థాలను, విషతుల్యాలను బయటకు పంపిస్తుంది. ఇది సరిగ్గా పని చేస్తే..మనం మనుగడ సాధ్యం అవుతుంది. లివర్ సిర్రోసిస్ ఒక ప్రాణాంతక వ్యాధి. లివర్‌కు దానికి ఇన్‌ఫెక్షన్లు, హెపటైటీస్, మరికొన్ని రకాల జబ్బులు సోకవడంతో దెబ్బతింటోంది. లివర్ దెబ్బతిన్నప్పుడు, అది తనంతట తానుగా రిపేర్ చేసుకుంటుంది. కణజాలం మచ్చలు పదేపదే సంభవిస్తే.. అది సిర్రోసిస్‌గా మారుతుంది. సిర్రోసిస్‌లో.. లివర్ రాయిలా గట్టిగా మారుతుంది. ఈ సందర్భంలో కాలేయానికి ఉండే సహజ ఆకృతి, దాని సహజమైన రంగు దెబ్బతిని జిగురు జిగురుగా, పచ్చరంగుకు మారిపోవచ్చు. దాని తీవ్రమైన పరిణామాలను నివారించడానికి ఆయుర్వేద మూలికలు సహాయపడతాయని ఆయుర్వేదం నిపుణులు నవీన్ రోయ్ అన్నారు. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం.
*1.-#లివర్_సిర్రోసిస్_ఎందుకు_వస్తుంది..*
దీర్ఘకాలంగా మద్యం తీసుకోవడం, హైపటైటీస్ బీ. సీ వైరస్ కారణాలతో లివర్ పూర్తిగా దెబ్బతింటుంది. అది చేయాల్సిన పనులను ఏదీ చేయదు. దీన్నే సిర్రోసిస్ అంటాం.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02KQiS993KUu1dyov1E8Kk9MggkKYxhWazoJJKcs6DoKA3SN4kFWvnApSriM9BFdxzl&id=100057505178618&mibextid=Nif5oz
*2.-#ఎలాంటి_లక్షణాలు_ఉంటాయి..?*
పొట్ట కుడి వైపున నొప్పి, వికారం, వాంతులు ఉంటాయి.
కీళ్ల నొప్పులు వేధిస్తాయి.
ఒంటిపై భాగంలో రక్తనాళాలు సాలీడు ఆకృతిలో బయటకు కనిపించడం.
దీర్ఘకాలం పాటు ఆకలి లేకుండా బాగా నీరసంగా, నిస్సత్తువగా ఉంటుంది
పొట్టలో విపరీతంగా గ్యాస్ సమస్య వేధిస్తుంది
కళ్లు పసుపురంగులోకి మారతాయి.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌ను సంప్రదిస్తే అల్ట్రాసౌండ్ అబ్డామిన్, లివర్‌ఫంక్షన్ టెస్ట్ వంటివి చేసి, సమస్య ఉందా, లేదా అన్నది నిర్ధరిస్తారు.
*3.-#కలబంద_ఉసిరి..*
కలబం, ఉసిరి రసం.. సిర్రోసిస్ నుంచి కాలేయ నష్టాన్ని నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. లివర్ సిర్రోసిస్‌తో బాధపడే వారు.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 5-5 మిల్లీలీటర్ల కలబంద, ఉసిరి రసం తాగాలని డాక్టర్ శరద్ కులకర్ణి సిఫార్సు చేశారు.
*4.-#త్రిఫల..*
త్రిఫలాలు అంటే.. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. ఈ చూర్ణానికి యాంటీ ఏజింగ్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం. దీనిలోని ఔషధ గుణాలు.. కాలేయానికి మేలు చేస్తాయి. రోజూ రాత్రి గోరువెచ్చని నీళ్లలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకుంటే.. కాలేయం దెబ్బతినడం తగ్గుతుంది
*5.-#అర్జున_చెట్టు_బెరడు..*
అర్జున చెట్టు ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా అర్జున చెట్టు బెరడును అనేక అనారోగ్యాల చికిత్సలో వాడుతున్నారు. ఇది లివర్ సిర్రోసిస్ తీవ్రమైన లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఉదయం, రాత్రి.. అర గ్లాస్ అర్జున చెట్టు బెరడు టీ తాగితే.. లివర్ దెబ్బతినడం తగ్గుతుంది
*6.-#తులసి..*
తులసి ఆకుల్లో హెపాటో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కాలేయం దెబ్బతినకుండా కాపాడతాయి. లివర్ సిర్రోసిస్‌తో బాధపడే వారు తులసి ఆకు తిన్నా, తులసి టీ తాగినా మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
*7.-#ఈ_జాగ్రత్తలు_తీసుకోండి.*
లివర్ సిర్రోసిస్ స్టేజ్‌కు రాకుండా.. లివర్‌ను సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. *నివారించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.*
1.-వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ బరువును ఎప్పుడూ నియంత్రించుకోవడం.
2.-ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.
3.-మందులు వాడేటప్పుడు డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోవాలి. సొంతవైద్యం చాలా ప్రమాదకరం.
అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి.
4.-క్రమ పద్ధతిన ఆహారం తీసుకోవాలి.
5.-కొవ్వు పదార్థాలు తగ్గించాలి.
6.-గాలి, దుమ్ము, కలుషిత నీటితో వచ్చే ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండాలి.
*#గమనిక:*
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment