Sunday 30 July 2023

అందమైన_ముఖాన్ని_పై_నల్లని_మచ్చలనే_మంగు_మచ్చలని_నివారణకు_పరిష్కారం_మార్గం_నవీన్_నడిమింటి సలహాలు

*అందమైన_ముఖాన్ని_పై_నల్లని_మచ్చలనే_మంగు_మచ్చలని_నివారణకు_పరిష్కారం_మార్గం_నవీన్_నడిమింటి సలహాలు* 
 
*#కారణాలు*
శరీరతత్వాన్ని బట్టి బొబ్బలు, మొటిమలు వ్యాపించటం.. చర్మానికి తగిలిన గాయాలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు, పుట్టు మచ్చలు మొదలైనవి కారణాలుగా చెప్పవచ్చు. వంశపారంపర్యం గానూ, హార్లోన్లలో సమతుల్యత లోపించడం వల కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను పోగొట్టడానికి నవీన్ రోయ్ గారి సులభ చికిత్స లేంటో తెల్సుకుందాం.
 1.-గేదె పాలను చిలికి తీసిన వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే మచ్చలు తగ్గుతాయి. 
 2.-పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి గేదె పాలల్లో నూరి రాస్తుంటే మంగు మచ్చలు తగ్గి చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి.
 3.-జాజికాయను మేక పాలలో అరగదీసి రాయడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది.
 4.-పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది.
 5.-పావు టీ స్పూన్‌ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 6.-టొమాటోల గుజ్జుతో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటిలో కడగాలి. వ్యంగ మచ్చలు తగ్గి శరీర కాంతి కూడా వస్తుంది.
 7.-కలబంద గుజ్జును తీసి మచ్చలపై పూయాలి. ఆ మచ్చలపై తడి ఆరిపోయాక చల్లని నీటితో శుభరం చేసుకోవాలి. దీని వల్ల మచ్చలు తగ్గిపోతాయి. దీంతో పాటు ముఖంపైన ఉండే మొటిమల మంట, వాపు తగ్గుతుంది. పూర్తి వివరాలు కు
https://www.facebook.com/1536735689924644/posts/3048263418771856/
 *8.- 1 టీ స్పూన్‌ టొమాటో రసం, 1 టీ స్పూన్‌ గంధం పొడి కలిపి, 2 టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.*
 9.-రోజ్‌ వాటర్‌, కీరా దోస రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెలలో చక్కని మార్పు వస్తుంది.
10.- ఆలుగడ్డపై ఉన్న పొరను తొలగించి సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి రసం తీయాలి. దానిలో దూది నానబెట్టి మచ్చలపై పూసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే మచ్చలు తొలిగిపోతాయి.
 *ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
*ఫోన్ -9703706660*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA

No comments:

Post a Comment