Tuesday 4 July 2023

తల్లి పాలను పెంచు కోవడం ఎలా ?

*తల్లి పాలను పెంచు కోవడం ఎలా ?వైద్య నిలయం సలహాలు* 
           
        మాతృత్వం మహిళకు దేవుడిచ్చిన వరం . మాతృమూర్తిగా మారాకే స్త్రీ పరిపూర్ణతను సంతరించు కుంటుంది . అమ్మ పాలు అమృతం . బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆరు మాసాలైన తల్లి పాపాయికి పాలివ్వాలి . 
# మారిన వాతావరణ పరిస్దుతుల మూలంగా , ఇంగ్లీషు మందులు వాడటం వలన , రసాయన ఆహార పదార్దాల వలన తల్లి పాలు 50 % తగ్గి పోయినాయి . 
*తల్లి పాపాయికి పాలు ఇవ్వడం వలన తల్లికి కలిగే ప్రయోజనాలు* : --- 
      తల్లి పాలు ప్రకృతి ప్రసాదం . దివ్య ఔషధం . పాపాయికి పాలు ఇస్తే తల్లి ప్రసవానంతర తర్వాత వచ్చిన బరువు తగ్గటకు దోహద పడుతుంది . గర్భాశయం యధా స్ధానంలో వస్తుంది . రక్త స్రవాం తగ్గుతుంది .  రొమ్ము క్యాన్సర్ , అండాశయ క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు రావు . తల్లి పాపాయికి పాలు ఎంత కాలము ఇస్తే ఇద్దరికి అంత మంచిది . పాపాయికి సమత్యుల ఆహారం లభిస్తుంది . 

*పాపాయికి కలిగే ప్రయోజనాలు* : --- 
       తల్లి పాలు త్రాగే పిల్లలకు శ్వాస కోశ వ్యాధులు , జీర్ణ కోశవ్యాధులు , చర్మ వ్యాధులు , చెవి సమస్యలు మొదలగునవి రావు . పెద్ద వయసులో అధిక రక్తపోటు , మధు మేహ వ్యాధులను రాకుండా కాపాడుతుంది .

*తల్లి పాలు పెరగాలంటే* : 
           తల్లి పౌష్టిక ఆహారం తీసుకొనవలెను . ఎల్లప్పుడు ఉల్లాసంగా , ఉత్సాహంగా  వుండి పాపాయిని గురించి ఆలోచించాలి . బాగ ఎక్కువగా నిద్రపౌవాలి . పాపాయికి పాలు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఉత్పత్తి జరుగుతుంది . 
https://t.me/vaidayanilayamNaveen
*ఆహార నియమాలు* : --- 
        ముడి బియ్యంని వాడండి . చక్కగా ఉడికిన అన్నం , తేలిగ్గా జీర్ణమయ్యే ఆకు కూరలు , పళ్ళ రసాలను తీసుకోవాలి . ఆయా ఋతువులలో వచ్చే పండ్లను తీసుకోవాలి . 
# ఎక్కువ కారం , పులుపు పదార్ధాలు , చల్లగా ఉండే పానీయాలు వంటివి తీసుకోకూడదు .
# సులువుగా జీర్ణం కాని పదార్ధాలను తీసుకోకూడదు .
# బాలింతలకు మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది మరియు మెంతులతో చేసిన పదార్ధాలను తినిపించ వలెను . 
# వెల్లుల్లి ( Garlic ) ని పచ్చిగ తినడం కంటే , పొడులలో చేర్చి ఇవ్వడం మంచిది . 
# కాకర కాయను ప్రసవం తర్వాత తీసుకోవడం వలన పాలు బాగా పడుతాయి . 
*బొప్పాయి* :--- బొప్పాయి కల్ప తరువు . దోరగా ఉన్న బొప్పాయిని కోరులా చేసి కూర వండుకొని తిన్నట్లయితే స్తన్య వృద్ధి జరుగుతుంది . 
*గమనిక* : -- తల్లి పాలు దోషయుక్తంగా ఉండి , బిడ్డకు వికారం , విరేచనాలు కల్గిస్తున్నపుడు , బొప్పాయి పండుని తీసుకోవడం మంచిది . 
*తులసి* ఆకులతో తేనె కలిపి తినడం వలన కూడా తల్లి పాలు బాగా ఉత్పత్తి అవుతాయి . 
*గ్రీన్ వెజిటబుల్స్ మరియు రెడ్ విజిటేబుల్స్ లలో ఎక్కువ ఫైబర్ వుంటాయి . ఇవి తల్లి పాలను పెంచడంలో సహకరిస్తాయి*
    *ఆకు కూరలు , బీన్స్ , స్వీట్ పొటాట మరియు దుంపలు పాలను పెంచడంలో చాలా ఉపయోగ పడతాయి . నల్ల ద్రాక్ష , కర్బూజ పండ్లు కూడ మంచివి* 
*# పాలకూర , జీలకర్ర , బార్లీ జావ , బొబ్బర్లు , ములగాకు ( మునగాకు) మొదలగు నవి చాలా మేలు చేస్తాయి* . 

*ఈ క్రింది పద్ధతుల ద్వారా తల్లి పాలు పెరుగుతాయి* : ----

1. *మెంతులు* : ---
          రాత్రి 1 Tea Spoon  మెంతులను 1  గ్లాసు నీళ్ళలో నానబెట్టండి . 
ఉదయం మెంతులన ఆ నీళ్ళలోనే మరిగించండి . మెంతులను వడబోసి ఆ నీళ్ళను మాత్రమే త్రాగండి . *ప్రతి రోజు ఉదయం త్రాగండి . త్వరలో ఫలితం లభిస్తుంది* . 
2 . *సోపు ( సోంపు ) గింజలు*
       ( Fennel Seeds ) .
     1 Tea Spoon సోపు గింజలు +  1 గ్లాసు వేడి నీళ్ళలో వేసి , 1/2  గంట వరకు వుంచ వలెను . సోపు గింజలను వడబోసి త్రాగవలెను . ఆ విధంగా ఉదయం , రాత్రి త్రాగవలెను . 1 నెల రోజులు త్రాగ వలెను . 
3 . *శతావరి. ( పిల్ల పెసర గడ్డలు )* :--- 
   2 లేక 3 Tea Spoon ల శతావరి పోడి + 1 గ్లాసు వేడి ఆవు పాలు + చిటికెడు పిపిళ్ళ చూర్ణం ని కలిపి త్రాగండి . 
4 . *జీలకర్ర* : ----  
           2 గ్రాముల జీలకర్ర పొడి + 1 table spoon  దేశీయ ఆవు నెయ్యిలో కలిపి తీసుకొండి . 
5. *శొంఠి + బెల్లం* :---- 
     2 గ్రాముల సొంఠి పొడి + 4 గ్రాముల బెల్లంను కలిపి రెండు భాగాలుగా చేసుకొని , ఉదయం , రాత్రి తీసుకొనండి . 
6. *దాల్చిన చెక్క పొడి* : ---
    *రాత్రి భోజనము తర్వాత* 
   1 Tea Spoon దాల్చిన చెక్క పొడి +  తేన ను కలిపి తినండి . 
తర్వాత వేడి పాలు త్రాగండి . 
7 . *Beet root + Carrot juice* :---- 
  బీట్ రూట్ + క్యారట్ జ్యూసులను సమ పాళ్ళలో కలపండి . కొద్దిగా తేన కలిపి త్రాగండి . 
8. పాలు పడని బాలింతలు *రాగి*  జావ త్రాగితే క్రమంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది . 
*పై 8 పద్దతులలో ఏదో ఒక పద్దతిని ఆచరించండి*  
# బాలింతరాలు స్వచ్చమైన ఆవు పాలు , ఆవు నెయ్యిని ఎంత ఎక్కవగా వాడితే అంత ఆరోగ్యం . 
*గమనిక* : ----
   పండ్ల రసాలను ఉదయం బ్రేక్ ఫాస్ట తర్వాత త్రాగవలెను . మధ్యాహ్న  భోజనానికి 40  నిమిషాల ముందు తాజ పండ్లను తినవలెను . 
*Dear friends, this community group* created exclusively for health care related information only.Those who are interested can join with the above link.please note those who are already receiving messages from me directly can exit from this group. 
*As you all know that Prevention is better than cure and our aim is to spread awareness to as many as possible*. 
         https://chat.whatsapp.com/DabjdKoQbrI7yG3MWAAmsB

No comments:

Post a Comment