Saturday, 1 July 2023

ఆరోగ్యానికి అంజీర ఫలం

*"ఆరోగ్యానికి అంజీర ఫలం"*

*కొంచెం  వగరు..  కొంచెం  తీపి..  కాస్త  పులుపు ఉండే అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడి పండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరం చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర్ పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి.*

*"ఆరోగ్యానికి అంజీర ఫలం"*

*🟣 అంజీర పండులో కొవ్వు,  పిండిపదార్ధాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సంవృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల పదార్ధాలు పడని వారు వీటిని పది నుంచి పన్నెండు చొప్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి.*

*🟣 కడుపులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగుపూత, కడుపులో మంట, అజీర్తి సమస్యతో బాధపడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉపకరిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ పుష్టికి ఉపకరిస్తుంది.*

*🟣 అతి ఆకలితో బాధపడేవారికి, బరువు తగ్గాలనుకునే వారికి..  ఈ పండు చక్కటి ఆహారం. దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణం ఉంది. చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు.*

*🟣 నోటి దుర్వాసన గలవారు  భోజనం చేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడుపులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదపడుతుంది. వీటి పైతొక్క గట్టిగా ఉంటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేపు ఉంచి తొక్క తీసి తింటే మంచిది.*

*🟣 సూపర్ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అంజీర్ లలో మినరళ్లు అధికం. అవి మలబధ్ధాకాన్ని దూరం చేస్తాయి. తలనొప్పి, కీళ్ల నొప్పులు, కడుపులో మంట గలవారు పుల్లటి పండ్లను తీసుకుంటే  పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన పండ్లకు ప్రాధాన్యం ఇవ్వచ్చు.*

*🟣 దీనిలోని ట్రైప్టోఫాన్స్ చక్కగా నిద్ర పట్టడానికి సాయపడతాయి ఎలర్జీ, దగ్గు, కఫం గలవారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనిపిస్తుంది. మేడి పండు గొంతు ఇన్ఫెక్షన్, కఫాన్ని తగ్గిస్తుంది.*

*🟣 రక్తాల్పత, మొలలు గలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ పండులో ఉండే  'పెక్టిన్' అనే పదార్థం కొవ్వును అదుపులో ఉంచుతుంది.*

*🟣 ఒంటి మీద గడ్డలు, కురుపులకు ఈ పండు గుజ్జును   పూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి. సలపరింపు తగ్గుతుంది.*

*🟣 అన్ని మేడిపండ్లు ఒకే రుచిలో దొరకవు. మనకు విరివిగా లభించే అంజీర్ తరహా మాత్రం కొంచెం తీపి, వగరుగా ఉంటాయి. పులుపు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగా తీసుకోవాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్ పొర తగ్గుతుంది. మరీ ఎక్కువ తిన్నాం అనిపిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో వేసుకుంటే సరి.*
💠💠

No comments:

Post a Comment