*ఫిషర్_సమస్య_ఉన్న_వాళ్లకు_తీసుకోవాలిసిన_జాగ్రత్తలు_నివారణకు_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహన_కోసం ,*
*Fissure in ano*
ఫిషర్ అంటే మలద్వారం చర్మంపై పొడవాటి పగుళ్లు ఏర్పడడమే . ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. ఇది రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలద్వారం పగిలి ఫిషర్ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి విపరీతమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చు. రక్తం ఒకటి, రెండు చుక్కలు మా త్రమే వస్తుంది. విరోచనాలు అయిన తర్వా త నొప్పి ప్రారంభమై మూడు, నాలుగు గం టల వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఫిషర్ మలద్వారానికి ముందు వైపు, వెనుకవైపున కూడా ఉంటుంది. మరికొన్నిసార్లు ఫిషర్‌తో పాటు చర్మం కూడా ముందుకు చొచ్చుకు వస్తుంది. దీన్ని సింటినైన్‌పైల్ అంటారు.
మలవిసర్జన సమయంలో నొప్పి వస్తే ఏమీ కాదులే అనుకుంటూ చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. సమస్య తీవ్రమైతే కానీ డాక్టర్ దగ్గరకు పరుగెత్తరు. మలద్వారానికి పగుళ్లు ఏర్పడే ఈ ఫిషర్ వ్యాధి ప్రమాదకరం కాకపోయినప్పటికీ రోజువారీ జీవితాన్ని మాత్రం నరకప్రాయం చేస్తుంది. నిర్లక్ష్యం చేస్తూ ఆ బాధను భరించడం కంటే వెంటనే తగిన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం. దీనికి ఆయుర్వేదంలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. మలద్వార ప్రాంతంలో రక్తసరఫరా తక్కువగా ఉండడం వల్లే అక్కడ పగుళ్లు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది.వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://m.facebook.com/story.php?story_fbid=2708585026073032&id=1536735689924644
*లక్షణాలు*
మలద్వారం కింది భాగం చాలా సున్నితమైనది. ఫిషర్ వచ్చిన వెంటనే ముందుగా మనకు కనిపించే లక్షణం, ఆ భాగంలో నొప్పిగా అనిపించడం. మల విసర్జన సమయంలో భరించలేనంత నొప్పి ఉంటుంది. ఈ నొప్పి గంట వరకూ అలానే ఉండి అకస్మాత్తుగా తగ్గిపోతుంది. ఒకవేళ ఫిషర్ తీవ్రంగా, చర్మంలోతు వరకూ ఉంటే మలద్వారంతోపాటు పెల్విస్‌లోనూ నొప్పి ఉంటుంది. అంతేకాదు మలవిసర్జన పూర్తి అయిన తర్వాత గంటల తరబడి ఆ నొప్పి అలాగే ఉంటుంది.
మలంలో రక్తం కనిపిస్తుంది. సమస్య తీవ్రమైతే వాపు, దురద కూడా ఉంటుంది.
*రకాలు*
ఫిషర్‌ను ఎక్యూట్, క్రానిక్ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. సమస్య ఆరువారాల కాలవ్యవధిలోపైతే దాన్ని సాధారణమైనదిగాను, ఆరువారాలు దాటితే ఉధృతమైనదిగాను పరిగణిస్తారు. సమస్య ఉధృతమైతే మలద్వారంలో పగుళ్లు చాలాలోతు వరకూ ఉంటాయి.
*కారకాలు*
మలబద్దకమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మలబద్దకం ఉన్న వాళ్లు మలవిసర్జన కోసం ఎక్కువగా కష్టపడడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరిగి చర్మం చిట్లిపోతుంది.
ఎక్కువ సార్లు గర్భం దాల్చడం, దీర్ఘకాలంగా లాక్సాటివ్ మందులు వాడడం కూడా ఈ సమస్యకు దారి తీయవచ్చు.
పైల్స్‌కు శస్త్రచికిత్స సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది.
కొన్ని సందర్భాల్లో అంతర్గతంగా ఉండే అల్సరేటివ్ కొలైటిస్, సుఖ వ్యాధులు, క్యాన్సర్ కూడా దీనికి కారణమవుతాయి.
*పాటించాల్సినవి_పాటించకూడనివి*
నీరు ఎక్కువగా తాగాలి. జంక్ ఫుడ్, ఉప్పు, కారం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
పడుకునే ముందు ఒకగ్లాసు వేడి పాలను తాగడం వల్ల మర్నాడు ఉదయం మలవిసర్జన సాఫీగా అవుతుంది.
మలబద్దకం ఉన్నవారు వేడి పాలలో కొంచెం ఆముదం కలుపుకుని తాగవచ్చు.
రోజులో మూడుసార్లు వేడినీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.
మలబద్దకం ఉన్నవారు తేలికగా జీర్ణమయ్యే పండ్లు, కాయగూరలు, సలాడ్లు, తాజా ఆహార పదార్థాలు తీసుకోవడం మేలు చేస్తుంది.
ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.్
*వ్యాధి నిర్ధారణ :*
చికి్త్సకు ముందు వ్యాధి నిర్ధారణ చాలా ముఖ్యము. దానికోసము -- ట్రాన్స్ యానల్ స్కాన్, ఫిస్టులోగ్రామ్, యం.ఆర్.ఐ.ఫిస్తులా, లాంటి పరీక్షలు చేసి ... కాన్సర్ కాదని బలపడిన తరువాత ముందుకు సాగాలి.
*చికిత్స :*
ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా హైరానా పడే వ్యక్తులో దురదలు పెట్టే వ్యాధులు ఎక్కువగానే కనిపిస్తాయి. చాలారకాల చర్మవ్యాధులు మానసి కంగా నలిగిన వ్యక్తుల్లో ఎక్కువగా బహిర్గతమవు తాయి. ఈ తరహా సమస్యలున్నప్పుడు కేవలం శరీరానికే కాకుండా మనస్సుకు కూడా చికిత్స చేయాల్సిఉంటుంది.
*అల్లోపతి :*
నొప్పిగా ఉన్నప్పుడు నొప్పినివారణ మాత్రలు (Nimsulide, Ibuprofen ,
diclofenac, aceclofenac) వాడాలి .
#ఇన్‌ఫెక్షన్_అయి_చీము_రసి_కారుతున్నప్పుడు ఫిస్టులా దరిదాపుపా శుభ్రము చేస్తూఉండాలి. . . యాంటీబయోటిక్స్
(ciprofloxin +ornidazole) వాడాలి.
*ఏమీ_చెయ్యకుండా_ఉండడము :*
రసి శుభ్రము చేస్తూ ఉండి విరోచనము సాఫీ గా అయ్యేటట్లు ఆహారనిమాలు మార్చుకోవాలి .
ఫిస్టులాని తెరచి ఉంచడం : మూసుకొని ఉన్న గాయాన్ని కట్ చేసి తెరచి ఉంచి క్లీనింగ్ చేస్తూ ఉండలి .. లోపనుంది మానుకుంటూ వస్తుంది . ఇన్‌ఫెక్షన్ అవకుండా యాంటీబయోటిక్స్ వాడాలి.
సర్జెరీ : మంచి శస్త్రచికిత్స వైద్యనిపుణుని సంప్రదించి తగిన సలహా , సహాయాన్ని పొందాలి .
*ఆయుర్వేదము_మందులు :*
దీనిలో ఔషధాలు లేపనం చేసి ఒక నూలు దారాన్ని మలద్వారంనుంచి ఫిస్టులా మార్గంలోకి పంపి బైటనుంచి ముడి వేస్తారు. దారం లోపలినుంచి కోసుకుంటూ గాయాన్ని మాన్పుతూ బైటకు వస్తుంది. ఈ విధానమే కాకుండా ప్రారంభావస్థలో జాత్యాదిఘృతం వంటి రోపణ ఔషధాలను ప్రయోగించి కూడా వ్యాధిని తగ్గించవచ్చు.
*తీసుకోవాల్సిన_జాగ్రత్తలు*
చేపలు, కారం, మసాలలను, వాడకూడదు,
మద్యం సేవించడం, ధూమపానం, పనికిరాదు,
మజ్జిగ, కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు వంటివి తాగాలి.
మలబద్దకం కాని కాయగూరలు, ఆకుకూరలు, ఎక్కువగా తినాలి.
ఎక్కువ ప్రయాణాలు ఎక్కువ సేపు కూర్చోవడం పనికిరాదు.
మనం కూర్చునే కుర్చి అడుగునుంచి గాలివచ్చేలా ఉండే కుర్చిలోనే కూర్చొవాలి.శరీరానికి చల్లగాలి అవస
*ధన్యవాదములు 🙏*
*ఫోన్ -9703706660*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
No comments:
Post a Comment