Thursday, 20 July 2023

కండ్ల_కలక_వస్తే_ఇలాంటి_జాగ్రత్తలు_తీసుకోండి అవగాహనా కోసం Naveen Nadiminti సలహాలు

*కండ్ల_కలక_వస్తే_ఇలాంటి_జాగ్రత్తలు_తీసుకోండి అవగాహనా కోసం Naveen Nadiminti సలహాలు* 

*Hs for Conjunctivitis :*
 ఈ సీజన్​లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కండ్ల కలక. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయి అంటున్నారు నిపుణులు. వర్షాల కారణంగా వాతావరణంలో జరిగే మార్పులు దీనికి ప్రధాన కారణ అంటున్నారు. అయితే ఈ ఇన్ఫెక్షన్​కు గురైనా.. ఇంట్లోనే దీనిని తగ్గించుకోవచ్చు అంటున్నారు  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరైనా కండ్లకలక లక్షణాలలో ఒకదానినైనా గుర్తిస్తే.. వారు వెంటనే సమీపంలోని కళ్ల వైద్యుడిని సంప్రదించాలి. అంతేకానీ.. ఓవర్-ది-కౌంటర్ డ్రాప్స్‌తో స్వీయ వైద్యం చేసుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అవి దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయని తెలిపారు.

*కండ్ల_కలక_సమయంలో_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు*
1.-మీ ఫ్యామిలీ డాక్టర్ సూచించిన విధంగా కంటి చుక్కలు లేదా లూబ్రికెంట్లను ఉపయోగించండి. ఓవర్-ది-కౌంటర్ ఉత్పత్తులను ఉపయోగించడం అస్సలు మంచిది కాదు.

2.- మీ కళ్లను చేతులతో తాకకండి. చేతులలోని బ్యాక్టిరీయా ఈ సమస్యను మరింత పెంచే అవకాశముంది. మీ కళ్లను నీళ్లు చిమ్మరిస్తూ.. శుభ్రం చేసుకోండి.

3.- ఎక్కువ నీరు తాగితూ.. హైడ్రేటెడ్​గా ఉండండి.

4.- కండ్లకలక సులువుగా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి.. కండ్లకలక ఉన్నవారు ఒంటరిగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

5.- కాంటాక్ట్ లెన్సులు వాడటం మానేయాలి. బయటకు వెళ్లాల్సి వస్తే.. కళ్లకు షేడ్స్ పెట్టుకుని వెళ్లండి.

6.- కండ్లకలక సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోతుంది కాబట్టి కంగారు పడCoే.. వైద్యుని సూచనలు కచ్చితంగా
*#వ్యాధి_లక్షణాలు*

           వ్యాధిగ్రస్తుల కళ్ళు ఎరుపెక్కి, నీరు కారుతూ ఉంటాయి. కంటిరెప్పలు ఉబ్బి ఉండవచ్చును. కళ్ళలొ మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి. వెలుతురు చూడటం కష్టం. కళ్ళలో పుసులు పడతాయి. ఈ లక్షణాలు ఒక కంటిలో ప్రారంభమై రెండవ కంటికి వ్యాపించవచ్చును. నిద్ర తరువాత కళ్ళరెప్పలు అంటుకొని తెరవడం కష్టమౌతుంది. ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెంది ఎపక్ రూపం దాలుస్తుంది. పొంగు వ్యాధిలోను, సుఖవ్యాధులతోను బాధపడే గర్భవతులకు పుట్టిన బిడ్డలకు కూడా కండ్లకలక సోకే అవకాశాలున్నాయి.

*నవీన్ రోయ్ చెప్పిన జాగ్రత్తలు*

1.= కండ్ల నుండి కారే నీటిని, స్రావాన్ని శుభ్రమైన తడిబట్టతో శుభ్రపరచాలి.
2.- రోగి వాడే బట్టలు, పక్క బట్టలు, తువ్వాళ్ళు మొదలైన వాటికి కళ్ళ రసి అంటి వాటిని ఇతరులు వాడితే వ్యాధి వారికి సోకుతుంది. కనుక రోగి బట్టలను ప్రతిరోజు నీటితో ఉడికించి క్రిమిరహితం చెయ్యాలి.
3.- రోగి కళ్ళను శుభ్రపరచిన దూది లేక బట్ట ముక్కలను వేరే పోగుచేసి కాల్చివేయడం మంచిది.

4.-కండ్ల కలక ముఖ్యంగా వైరస్ ద్వారా, బాక్టీరియా ద్వారా కళ్ళకి కలిగే ఇన్ ఫెక్షన్. ఇది ఒక అంటువ్యాధి, చేతి రుమాలు, తువ్వాలు ఒకళ్ళు వాడినవి ఇంకొకళ్ళు వాడడం వలన, వ్యాధి సోకిన వారు ఇతరులతో చాలా దగ్గరగా ఉండడం వలన తొందరగా వస్తుంది.వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02KbJvaWAm3skqx9TDBas9WqHSjhcdBoQ8pW331hQf8KYhfGgP5UarvQwn9PKSJEr7l&id=100057505178618&sfnsn=wiwspmo&mibextid=RUbZ1f
*#చికిత్స :*
        వ్యాధి సోకిన వాళ్ళు గోరువెచ్చని నీళ్ళతో తరచూ కళ్ళు కడగాలి. వీలైతే నల్లటి కళ్ళజోడు ధరించాలి. చేతి రుమాలు తుండుగుడ్డ ఇతరులని వాడనీయకూడదు. డాక్టరు సలహాపై కళ్ళలో మందు చుక్కలు వాడాలి.

ఒఫ్లక్షాసిన్ కంటి చుక్కల మందును 4 - 5 రోజులు వాడాలి .
సిట్రజిన్ (Tab-Cetzine) 10mg రోజుకి ఒకట చొ. దురద తగ్గినా వరకు 4-5 రోజులు వాడాలి .
జ్వరము , నొప్పి తగ్గడానికి నిమ్సులిడ్ మాత్రలు (Nimulid) 100 మగ్ రోజుకి రెండు చొప్పున్న 4-5 రోజులు వాడాలి .
ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటి బయోటిక్ మాత్రలు (Megapen) 250/500 మగ్ రోజుకి మూడు సార్లు 4-5 రోలులువాడాలి
*#ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
*ఫోన్ -9703706660*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment