Tuesday 1 August 2023

వెరికోస్ వెయిన్స్ ప్రమాదమా? ఈ సమస్య నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి?

*వెరికోస్ వెయిన్స్ ప్రమాదమా? ఈ సమస్య నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? వైద్య నిలయం సలహాలు*

మన శరీరం లో రక్తాన్ని గుండె నుండి ఇతర భాగాలకి సరఫరా చేసే వాటిని ధమనులు(arteries), అలాగే, వివిధ శరీర భాగాల నుండి గుండె కి చేరవేసే నాళాల్ని సిరలు(Veins) అనీ అంటారు.

సిరలు తీసుకెళ్లే రక్తం సహజం గానే కలుషిత రక్త అవడం వల్ల అది కొంచెం డార్క్ కలర్ లోనే వుంటుంది.

మనం శరీర భాగాల్లో పైకి కనిపించే వాటిలో చూసుకుంటే మనకు ఆ రంగు తేడా అనేది కనిపిస్తుంది.

Varicose veins లేదా varicosities అంటే, ఎప్పుడైతే,ఆ రక్త సరఫరా విధానం లో ఇబ్బందులు తలెత్తుతాయో,అప్పుడు,అక్కడ రక్తం కొంచెం సరఫరా లో అంతరాయం ఏర్పడి అక్కడే నిల్వ ఉండిపోవడం గానీ, గడ్డ కట్టడం కానీ జరుగుతుంది.

ఇది సహజం గా, కాళ్ళలోనూ, తొడల దగ్గర ఏర్పడతాయి.

*ఇవి ఎక్కువ గా ఏర్పడితే మనకి, అక్కడ ఉబ్బినట్లు,ఇంకా ఎక్కువ గాఢమైన రంగులోనూ(ముదురు నీలం, purple,లేదా ముదురు ఎరుపు),కనిపిస్తాయి.*


వీటి వల్లన వచ్చే ఇబ్బందులు,వాటి సంఖ్య,గాఢత,వెడల్పు ను బట్టి వుంటాయి.

కొంతమంది కి చాలా తక్కువే వుంటాయి,అవి పెద్ద గా ఇబ్బంది పెట్టవు.

కానీ, ఎక్కువ వాచినవి, సంఖ్య ఎక్కువ గా వున్నవి,చాలా నొప్పి కలిగిస్తాయి, కొంచెం బిగిసిపోయిన సెన్సేషన్ కలిగించి,నడవడానికి ఇబ్బంది కలిగిస్తాయి.

ఇక్కడ రక్త సరఫరా విధానం disturb అవ్వడం, లేదా, ఆ వేయిన్స్ damage అవ్వడం ప్రధాన కారణం.

ఆ నొప్పి కూడా వున్న తీవ్రత నీ బట్టి ఎక్కువ/తక్కువలు వుంటాయి.

బీపీ,అధిక బరువు, హార్మోన్ల అసమతౌల్యత, రక్తం గడ్డ కట్టే కాలం లో తేడాలు, ఎక్కువ కొలెస్టరాల్, గుండె వ్యాధులు, వార్ధక్యo, ఆడవారికి అయితే మెనోపాజ్ దశలో, ముఖ్య కారణాలు.

ఈ వ్యాధి మరీ ప్రాణాంతకం అయితే కాదు,కానీ,తీవ్రతను బట్టి రోజువారీ దినచర్యలో ఇబ్బంది కలిగిస్తుంది,నొప్పి కూడా తీవ్రతను బట్టి కొంచెం ఎక్కువ గానే వుండే అవకాశాలు వుంటాయి.

ప్రాణహాని కాకపోయినా,ఇది వున్న తీవ్రత మనకి వున్న ఇతర అనారోగ్యాల తీవ్రతకు ఒక alarming లా చూపిస్తుంది.

ఉదా:- గుండె జబ్బుకు,అధిక కొవ్వు(కొలెస్ట్రాల్/లిపిడ్స్),లేదా మన శరీరం లో రక్త గాఢత,గడ్డ కట్టే కాలం ఇలాంటి వాటిలో ఏమైనా abnormalities వుంటే,వాటికి సంకేతం అందించినట్లు గా.


కనుక,అలాంటపుడు మనం తగిన పరీక్షలు,నివారణ కి తగ్గ చర్యలు తీసుకోవచ్చు నవీన్ రోయ్ సలహాలు తీసుకోని కోవాలి 

ఎక్కువ గా నిలబడి పని చేయాల్సి వచ్చే వాళ్ళకి కూడా,క్రమేణా ఆ నాళాలు బలహీనమై, ఇలా ఏర్పడవచ్చు.

*ఇవి వున్నవాళ్ళు,ఆయా అనారోగ్యాలు వుంటేవాటికి సంబంధించిన మందులు,జాగ్రత్తలు తీసుకోవాలి.*

1.-రోజూ, కొంచెం వేడి నీళ్లలో crystal salt వేసి,అందులో రోజుకి 2-3 సార్లు కాళ్ళు పెట్టి, ఒక 15-30 నిముషాలు వుంచితే కొంచెం నొప్పులనుండి, ఉపశమనం కలగడమే కాకుండా,ఆ veins లో కూడా తేడా రావొచ్చు.

2.-పడుకొనేటపుడు కాళ్ళు ఎత్తు మీద పెట్టుకొని పడుకుంటే మంచిది.కూర్చున్నపుడు కూడా కాళ్ళు కొంచెం ఎత్తు మీద పెట్టుకొంటే మంచిది.

3.-బరువు వున్న వాళ్ళు ఖచ్చితం గా తగ్గాలి.

4.-అస్తమానూ కూర్చుని వుండే వాళ్ళు, కొంచెం walking కూడా చేస్తే మంచిది.

5.-ఆహారం లో,ఫైబర్, విటమిన్ K, మాంగనీస్, పొటాషియం వున్న పదార్థాలు కొంచెం ఎక్కువ వుండేవి తింటూ వుండాలి.అరటిపండు,pine Apple, క్యాబేజ్,ఆకు కూరలు,బటానీలు తింటే మంచిది.ఉప్పు/నూనె వాడకం ఎంత తగ్గితే అంత మంచిది

6.-స్నానం అతి వేడి నీళ్ళతో చెయ్యడం మంచిది కాదు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
     This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://chat.whatsapp.com/KKANXNrFlo37hx9xLJlqb4
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment